[racchabanda] విషమ సీసము #vishama sIsamu#

 

విషమ సీసము - 

అప్పకవి లక్షణ లక్ష్యము - 

ఉత్సాహ. అంచితముగ భీమునకు స-హాయ మేగుదెంచి తా 
నించు కెదిరి దురము సేయు - నేయునంకుశంబు తా
కించుకొనక కినుకవలనఁ - గెరలి నరకపుత్త్రు మ-
ర్దించినట్టి సవ్యసాచి - తేరి ఘోటకావలిం 
ఆ. దోలు కృష్ణ యంచు - దోరంపు టుత్సాహ 
మీద గీత మొకఁడు - మేలవింప 
విషమసీస మనఁగ - వెలయుఁ గామెపలీశ 
జమ్మిచెంత నున్న - చతురవచన 
(కామెపలీశ అర్థము కాలేదు)

అనగా ఉత్సాహను వ్రాసి, దానిని ఆటవెలదితో లేక తేటగీతో కలుప వలయును. అప్పుడు అది విష(స)మ సీసము అవుతుంది. సీస పద్యముతో వ్రాసినప్పుడు అది సమ సీసము. సీస పద్యములో సీసము ఎత్తుగీతి ప్రత్యేకముగా నుండ వచ్చును. కాని విషమ సీసములో ఉత్సాహను ఎత్తుగీతిని కలుపవలెను. లేని యెడల అది సీసము కాజాలదు, విడివిడిగ ఉండే ఉత్సాహ, గీతి అవుతుంది. 

పాత కావ్యాలలో విషమసీసము ఉన్నాదా అని నేను వెదకుతున్నాను, అందఱిని అడుగుతున్నాను. కాని నాకు అప్పకవి లక్ష్యము నచ్చలేదు. ఎందుకంటే అందులో సీసపు అమరిక లేదు. సీసపు అమరిక ఉండాలంటే సీసపు అర్ధపాదాలవలె ఉత్సాహను విడదీసి వ్రాయాలి. అప్పుడే సీసపు సామ్యము సిద్ధిస్తుంది. విషమసీసమునకు నా ఉదాహరణము - 

సీసమువలె విఱుపుతో ఉత్సాహ - 
చిలిపిగాను - గలిపి మెక్కెఁ 
జిన్నవాఁడు - మన్నుఁ దాఁ 
దలియు నడుగఁ - దలఁ గదల్చెఁ  
దప్పిదమ్ము - నొప్పకన్ 
చెలువుఁ డపుడు - చిత్రముగను  
చిఱుత వాయిఁ - దెఱువఁగాఁ 
గలయొ నిజమొ - కల్ల యేమొ 
కాననయ్యె - వాని స 

త్ర్యస్రగతిలో ఆటవెలఁది - 
ద్గళమునందు సర్వ - జలధులన్, గ్రహముల 
వలయములను, వెలుఁగు - నిలయములను, 
మలల యంచులందు - మంచులన్, సృజనల, 
విలయములను, భ్రమల - నిలిచె మాత!  

ఇందులో ఉత్సాహపు రెండు అర్ధాలలో సీసపు అర్ధపాదాలవలె యతి ప్రాసలు ఉన్నాయి. రెండు అర్ధపాదాలకు అక్షరసామ్య యతి ఉత్సాహవలె ఉన్నది. ఉత్సాహకు సరిపోవునట్లు ప్రాస ఉన్నది. ఉత్సాహయందలి త్ర్యస్రగతి ననుసరించి ఆటవెలదిని కూడ త్ర్యస్రగతిలో నడిపినాను. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vishama sIsamu - 

appakavi laxaNa laxyamu - 

utsAha. aMchitamuga bhImunaku sa-hAya mEgudeMchi tA 
niMchu kediri duramu sEyu - nEyunaMkuSaMbu tA
kiMchukonaka kinukavalana@M - gerali narakaputtru ma-
rdiMchinaTTi savyasAchi - tEri ghOTakAvaliM 
aa. dOlu kRshNa yaMchu - dOraMpu TutsAha 
mIda gIta moka@MDu - mElaviMpa 
vishamasIsa mana@Mga - velayu@M gaamepalISa 
jammicheMta nunna - chaturavachana 
(kaamepalISa arthamu kAlEdu) 

anagA utsAhanu vrAsi, dAnini aaTaveladitO lEka tETagItO kalupa valayunu. appuDu adi visha(sa)ma sIsamu avutuMdi. sIsa padyamutO vrAsinappuDu adi sama sIsamu. sIsa padyamulO sIsamu ettugIti pratyEkamugA nuMDa vachchunu. kAni vishama sIsamulO utsAhanu ettugItini kalupavalenu. lEni yeDala adi sIsamu kAjAladu, viDiviDiga uMDE utsAha, gIti avutuMdi. 

pAta kAvyAlalO vishamasIsamu unnAdA ani nEnu vedakutunnaanu, aMda~rini aDugutunnaanu. kAni naaku appakavi laxyamu nachchalEdu. eMdukaMTE aMdulO sIsapu amarika lEdu. sIsapu amarika uMDAlaMTE sIsapu ardhapAdAlavale utsAhanu viDadIsi vrAyAli. appuDE sIsapu sAmyamu siddhistuMdi. vishamasIsamunaku nA udAharaNamu - 

sIsamuvale vi~ruputO utsAha - 
chilipigAnu - galipi mekke@M 
jinnavA@MDu - mannu@M dA@M 
daliyu naDuga@M - dala@M gadalche@M  
dappidammu - noppakan 
cheluvu@M DapuDu - chitramuganu  
chi~ruta vAyi@M - de~ruva@MgA@M 
galayo nijamo - kalla yEmo 
kAnanayye - vAni sa 

tryasragatilO aaTavela@Mdi - 
dgaLamunaMdu sarva - jaladhulan, grahamula 
valayamulanu, velu@Mgu - nilayamulanu, 
malala yaMchulaMdu - maMchulan, sRjanala, 
vilayamulanu, bhramala - niliche mAta!  

iMdulO utsAhapu reMDu ardhAlalO sIsapu ardhapAdAlavale yati prAsalu unnAyi. reMDu ardhapAdAlaku axarasAmya yati utsAhavale unnadi. utsAhaku saripOvunaTlu prAsa unnadi. utsAhayaMdali tryasragati nanusariMchi aaTaveladini kUDa tryasragatilO naDipinaanu. 

vidhEyud'u - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: