[racchabanda] హిమమణి #himamaNi#

 

హిమమణి - 

ఆధారము - కల్పితము
నడక - ఖండగతి 
వర్గము - వనమయూరము

హిమమణి - (న)5/స IIIII IIIII - IIIII IIU
18 ధృతి 131072

హరి యనెద నుదయమున - హరి యనెద నిశిలో 
హరి యనెద స్వగృహమున - హరి యనెద వనిలో 
హరి యనెద హరుసమున - హరి యనెద వ్యధలో 
హరి యనెద బ్రతుకునను - హరి యనెద తుదిలో

ప్రణయ మొక వననిధియొ - ప్రణయ మొక నిధియో 
ప్రణయ మొక సురతరువొ - ప్రణయ మొక బరువో 
ప్రణయ మొక యుపవనమొ - ప్రణయము కవనమో
ప్రణయ మొక కరువలియొ - ప్రణయ మొక లలియో 

కమలమును గన వదన - కమలమును దలఁతున్ 
సుమములను గనఁ గదలు - సొబగులను దలఁతున్ 
భ్రమరముల గనఁ గురుల - వలయములఁ దలఁతున్ 
హిమమణులఁ గన వలపు - హృదయమును దలఁతున్ 

హృదయమను సరసిజము - ప్రియతముని కలరెన్ 
మధురమగు పదములను - మఱువకను వినుమా 
వదల నిను నిజముగను - బదములను వదలన్ 
వదల నిను వసుమతిని - వదల నిను మతిలో

కిరణముల యరుణిమలు - గెరలెఁ బలు దెసలన్ 
దరుణరవి కనబడెను - ధరణిపయి మిసతో 
హరిచరణ కమలముల - నరుసమునఁ గొలువన్ 
దరుణమిది నడువు మిఁక - తరుణి గుడి పిలిచెన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
himamaNi - 

aadhAramu - kalpitamu
naDaka - khaMDagati 
vargamu - vanamayUramu

himamaNi - (na)5/sa #IIIII IIIII - IIIII IIU#
18 dhRti 131072

hari yaneda nudayamuna - hari yaneda niSilO 
hari yaneda svagRhamuna - hari yaneda vanilO 
hari yaneda harusamuna - hari yaneda vyadhalO 
hari yaneda bratukunanu - hari yaneda tudilO

praNaya moka vananidhiyo - praNaya moka nidhiyO 
praNaya moka surataruvo - praNaya moka baruvO 
praNaya moka yupavanamo - praNayamu kavanamO
praNaya moka karuvaliyo - praNaya moka laliyO 

kamalamunu gana vadana - kamalamunu dala@Mtun 
sumamulanu gana@M gadalu - sobagulanu dala@Mtun 
bhramaramula gana@M gurula - valayamula@M dala@Mtun 
himamaNula@M gana valapu - hRdayamunu dala@Mtun 

hRdayamanu sarasijamu - priyatamuni kalaren 
madhuramagu padamulanu - ma~ruvakanu vinumA 
vadala ninu nijamuganu - badamulanu vadalan 
vadala ninu vasumatini - vadala ninu matilO

kiraNamula yaruNimalu - gerale@M balu desalan 
daruNaravi kanabaDenu - dharaNipayi misatO 
haricharaNa kamalamula - narusamuna@M goluvan 
daruNamidi naDuvu mi@Mka - taruNi guDi pilichen 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: