[racchabanda] రాగాలస #rAgAlasa#

 

రాగాలస - 

ఆధారము - కల్పితము 
నడక - ఖండగతి 
వర్గము - వనమయూరము 
సార్థకనామ గణాక్షర వృత్తము 

రాగాలస - ర/ర/త/స UIU UIU - UUI IIU
12 జగతి 1811 

ఎందుకే డెందమా - యీరీతి నగవుల్ 
చందురున్ జూచితే - చల్లంగ నిశిలో 
ఎందుకే డెందమా - యీరీతి వగపుల్ 
కుందకే వానికై - గోవింద యనవే 

రాగిణీ యేల నీ - రాగాలసము నీ 
యోగమే చాలు నీ - యుర్వీస్థలముపై 
వేగమే రా దరిన్ - బ్రేమాబ్ధి మునుఁగన్ 
భోగసంపన్నమై - మోదమ్ము లొసఁగన్ 

రేయి దైర్ఘ్యమ్ములో - రేవెల్గు మిసలో 
హాయిగా నుందమా - హర్షాబ్ధి యలలన్ 
వేయి రాగమ్ములన్ - బ్రేమార్ద్ర పదముల్ 
తీయఁగా పాడు సం-తృప్తిన్ లలితమై 

శ్రీధరా రమ్ము నా - చిత్తమ్ము విరియన్ 
మాధవా రమ్ము నీ - మాధుర్య మొలుకన్ 
యాదవా రమ్ము నీ - యందమ్ము వెలుఁగన్ 
రాధ నే వేచితిన్ - రాగాల నిశిలో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
rAgAlasa - 

aadhAramu - kalpitamu 
naDaka - khaMDagati 
vargamu - vanamayUramu 
sArthakanAma gaNAxara vRttamu 

rAgAlasa - ra/ra/ta/sa #UIU UIU - UUI IIU#
12 jagati 1811 

eMdukE DeMdamA - yIrIti nagavul 
chaMdurun jUchitE - challaMga niSilO 
eMdukE DeMdamA - yIrIti vagapul 
kuMdakE vAnikai - gOviMda yanavE 

rAgiNI yEla nI - rAgAlasamu nI 
yOgamE chAlu nI - yurvIsthalamupai 
vEgamE rA darin - brEmAbdhi munu@Mgan 
bhOgasaMpannamai - mOdammu losa@Mgan 

rEyi dairghyammulO - rEvelgu misalO 
hAyigA nuMdamA - harshAbdhi yalalan 
vEyi rAgammulan - brEmArdra padamul 
tIya@MgA pADu saM-tRptin lalitamai 

SrIdharA rammu nA - chittammu viriyan 
mAdhavA rammu nI - mAdhurya molukan 
yAdavA rammu nI - yaMdammu velu@Mgan 
rAdha nE vEchitin - rAgAla niSilO 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: