[racchabanda] మణికుండల #maNikuMDala#

 

మణికుండల - 

ఆధారము - జయకీర్తి, హేమచంద్రుడు 
ఇతర నామములు - సుదంత (హేమచంద్రుడు), అంబుదావలీ (వాగ్వల్లభ) 
వర్గము - ఇంద్రవంశ
ఇంద్రవంశలోని మొదటి గురువునకు బదులు ఇందులో రెండు లఘువులు. 

మణికుండల (సుదంత, అంబుదావలీ) - స/య/స/జ/గ IIUI UU - IIUI UIU 
13 అతిజగతి 2764 

మణికుండలమ్ముల్ - మకరాంకమూర్తిపైఁ 
గనిపించుచుండెన్ - గడు రమ్య రీతిగా
వనమందుఁ బూవుల్ - వదనాన నవ్వులై 
తనరారుచుండెన్ - దరుణేందు కాంతిలో 

కనకాంగి దేవీ - కరుణించు ప్రేమతో 
వనజాక్షి నాకున్ - వరమిమ్ము ప్రీతితో 
మనమందు నిన్నే - మరణించు దాక నే 
ననిశమ్ము గొల్తున్ - హరినీల కేశినీ 

గగనమ్మునందున్ - గన నంబుదావళుల్ 
పొగమంచు గప్పెన్ - భువిపైన దుప్పటిన్ 
రగిలెన్ గదా యీ - రజనిన్ మనస్సు నీ 
వొగి రమ్ము జూడన్ - బులకించిపోదు నేన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
maNikuMDala - 

aadhAramu - jayakIrti, hEmachaMdruDu 
itara nAmamulu - sudaMta (hEmachaMdruDu), aMbudAvalI (vAgvallabha) 
vargamu - iMdravaMSa
iMdravaMSalOni modaTi guruvunaku badulu iMdulO reMDu laghuvulu. 

maNikuMDala (sudaMta, aMbudAvalI) - sa/ya/sa/ja/ga #IIUI UU - IIUI UIU# 
13 atijagati 2764 

maNikuMDalammul - makarAMkamUrtipai@M 
ganipiMchuchuMDen - gaDu ramya rItigA
vanamaMdu@M bUvul - vadanAna navvulai 
tanarAruchuMDen - daruNEMdu kAMtilO 

kanakAMgi dEvI - karuNiMchu prEmatO 
vanajAxi nAkun - varamimmu prItitO 
manamaMdu ninnE - maraNiMchu dAka nE 
naniSammu goltun - harinIla kESinI 

gaganammunaMdun - gana naMbudAvaLul 
pogamaMchu gappen - bhuvipaina duppaTin 
ragilen gadA yI - rajanin manassu nI 
vogi rammu jUDan - bulakiMchipOdu nEn 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (3)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___