[racchabanda] Rare usage! శార్దూల-స్రగ్ధరా అర్ధసమవృత్తము #SArdUla-sragdharA ardhasamavRttamu#

 

శార్దూల-స్రగ్ధరా అర్ధసమవృత్తము - 

ఆధారము - అప్పయ దీక్షితుల నయమంజరి
ఇంతకుముందే శార్దూలవిక్రీడితమునకు మందాక్రాంతమునకు గల సంబంధమును మీకు తెలిపియున్నాను. స్రగ్ధర, మందాక్రాంతములవలె శార్దూలవిక్రీడితమునకు కూడ యతుల నుంచినది గమనార్హము. 

బేసి పాదములు - శార్దూలవిక్రీడితము 
సరి పాదములు - స్రగ్ధర

శార్దూల-స్రగ్ధరా - 

సాయంకాలము వేళ - సాంద్రరుచులన్ - సావిత్రుఁ డస్తాద్రిలో 
నాయభ్రమ్మందు వెల్గెన్ - హరిణి పసనుతో - నందమ్ముఁ జిందించుచున్ 
బ్రాయమ్మందలి కాంతి - పర్వులిడఁగా - వారిర్వు రానందమై 
శ్రేయోవంతమ్ముగా నా - చెలిమి మధువులన్ - సేవించినా రాశతో 

శార్దూలమ్ములతోడఁ - జాల సొబగై - చక్కంగ నాడెన్ గదా 
నిర్ధూతమ్మైన ఠీవిన్ - నెఱయగు పటిమన్ - నేత్రమ్ములన్ భాతితో 
నిర్ధారించఁగనౌను - నేలను సదా - నిర్జించు నాబాలుఁడే! 
హార్దుండై స్రగ్ధరుండై - యట భరతుఁడు దా - హర్షమ్ము నుండెన్ వనిన్ 

దేవీ నిన్ను భజింతుఁ - దెల్లని మదిన్ - దివ్వెల్ వెలింగించుచున్ 
గావంగా నన్ను రావా - కమలనయన నీ - కారుణ్య ముప్పొంగఁగా 
భావాతీతవు నీకు - వందనములన్ - భక్తిన్ సమర్పింతు నా 
జీవానందమ్ము నీవు - చెలువపు నురుఁగుల్ - చిమ్మంగ క్రీడించ రా

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
SArdUla-sragdharA ardhasamavRttamu - 

aadhAramu - appaya dIxitula nayamaMjari
iMtakumuMdE SArdUlavikrIDitamunaku maMdAkrAMtamunaku gala saMbaMdhamunu mIku telipiyunnAnu. sragdhara, maMdAkrAMtamulavale SArdUlavikrIDitamunaku kUDa yatula nuMchinadi gamanArhamu. 

bEsi pAdamulu - SArdUlavikrIDitamu 
sari pAdamulu - sragdhara

SArdUla-sragdharA - 

sAyaMkAlamu vELa - sAMdraruchulan - sAvitru@M DastAdrilO 
nAyabhrammaMdu velgen - hariNi pasanutO - naMdammu@M jiMdiMchuchun 
brAyammaMdali kAMti - parvuliDa@MgA - vArirvu rAnaMdamai 
SrEyOvaMtammugA nA - chelimi madhuvulan - sEviMchinA rASatO 

SArdUlammulatODa@M - jAla sobagai - chakkaMga nADen gadA 
nirdhUtammaina ThIvin - ne~rayagu paTiman - nEtrammulan bhAtitO 
nirdhAriMcha@Mganaunu - nElanu sadA - nirjiMchu nAbAlu@MDE! 
hArduMDai sragdharuMDai - yaTa bharatu@MDu dA - harshammu nuMDen vanin 

dEvI ninnu bhajiMtu@M - dellani madin - divvel veliMgiMchuchun 
gAvaMgA nannu rAvA - kamalanayana nI - kAruNya muppoMga@MgA 
bhAvAtItavu nIku - vaMdanamulan - bhaktin samarpiMtu nA 
jIvAnaMdammu nIvu - cheluvapu nuru@Mgul - chimmaMga krIDiMcha rA

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4603

1 Message

Digest #4603
1
JIVANA LAKSHYAM by swamypvap

Message

Thu Mar 8, 2018 7:25 pm (PST) . Posted by:

swamypvap

The human life is a like a train journey as undertaken by a Jiva(individual).
This human life(Journey) has to reach its Gamyam(destination) before death occurs.
What is the destination(Lakshyam).?
The destination is Parama padam(ultimate station) and that is Paramaatmaka Lingam and this fact implies that a Jiva should become one(Ekam) with Siva as Layam before death happens.
Sareeram(body) signifies a train(body).
Jiva (individual) signifies a traveler performing the journey.
Dharmam as practiced by Prabhu Rama denotes the Railway track.
Sri Guru Hanuman holding Rama Paadam points out to the Guard holding the torch light and showing the route(Margam).
A traveler should hold Sri Rama Bhaavam in Hrudayam as the the valid ticket.
A Jiva(traveler) should chant Rama Namam continuously through out the journey as the food,water and air in order to ensure a safe and sound and a successful journey.
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] అర్ధసమ వృత్తము చూడామణీ #ardhasama vRttamu chUDAmaNI#

 

అర్ధసమ వృత్తము చూడామణీ - 

బేసి ఫాదములు - ఇంద్రవజ్ర
సరి పాదములు - వసంతతిలక 
ఆధారము - జయకీర్తి 

నేను వ్రాసిన వసంతతిలకము పైని వ్యాసములో వసంతతిలకము ఇంద్రవజ్ర వృత్తమునుండి జనించి ఉండ వచ్చునని ప్రతిపాదించినాను. ఈ రెండు వృత్తములను చేర్చి అర్ధసమ వృత్తముగా జయకీర్తి అందుకే సృష్టించినాడేమో? 

చూడామణీ - త/త/జ/గగ // త/భ/జ/జ/గగ 
UUI UU - IIUI UU // UUI UIIIU - IIUI UU

శ్రీదేవి నాకున్ - సిరులీయ నేలా 
నీదివ్య రూపము గనన్ - నిధులెల్ల నావే 
నాదారి సూపన్ - నగుమోముతోడన్ 
రాదేవి గజ్జెల ధ్వనుల్ - రవణించుచుండన్ 

మాణిక్య వీణల్ - మధురమ్ముగా నీ 
వాణిన్ ధ్వనించఁగ మదిన్ - వనజమ్ము విచ్చున్ 
వీనుల్ రమించున్ - బ్రియమార నాకున్ 
గానంగ దోఁచెను నినున్ - గలహంస రావా 

పాడంగ రావా - పదమొండు సీతా 
నాడెంద మందును గదా - నవమైన శాంతిన్ 
నే డస్సినాడన్ - నిను దల్చుచుంటిన్ 
జూడామణిన్ గనఁగ న-శ్రువులిందు జారెన్ 

చిందించ వచ్చెన్ - జిఱునవ్వుతోడన్ 
సందేహ మెందుల కిఁకన్ - సరసాల విందుల్ 
మందమ్ము గాలుల్ - మకరాంకు మిత్రుల్ 
గంధమ్ము నిండెను వనిన్ - గమనీయ సంధ్యన్ 
బంధమ్ము హెచ్చున్ - ఫలియించుఁ గోర్కెల్  
అందాల యామని గదా - యది నవ్వుచుండెన్ 
తందాన తానా - తనతాన తానా 
తందాన తానన తనా - తనతాన తానా 

విడివిడిగా పై పద్యములు - 

ఇంద్రవజ్ర - 
చిందించ వచ్చెన్ - జిఱునవ్వుతోడన్ 
మందమ్ము గాలుల్ - మకరాంకు మిత్రుల్ 
బంధమ్ము హెచ్చున్ - ఫలియించుఁ గోర్కెల్  
తందాన తానా - తనతాన తానా 

వసంతతిలకము - 
సందేహ మెందుల కిఁకన్ - సరసాల విందుల్ 
గంధమ్ము నిండెను వనిన్ - గమనీయ సంధ్యన్  
అందాల యామని గదా - యది నవ్వుచుండెన్ 
తందాన తానన తనా - తనతాన తానా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu chUDAmaNI - 

bEsi PAdamulu - iMdravajra
sari pAdamulu - vasaMtatilaka 
aadhAramu - jayakIrti 

nEnu vrAsina vasaMtatilakamu paini vyAsamulO vasaMtatilakamu iMdravajra vRttamunuMDi janiMchi uMDa vachchunani pratipAdiMchinAnu. ee reMDu vRttamulanu chErchi ardhasama vRttamugA jayakIrti aMdukE sRshTiMchinADEmO? 

chUDAmaNI - ta/ta/ja/gaga // ta/bha/ja/ja/gaga 
#UUI UU - IIUI UU // UUI UIIIU - IIUI UU#

SrIdEvi nAkun - sirulIya nElA 
nIdivya rUpamu ganan - nidhulella nAvE 
nAdAri sUpan - nagumOmutODan 
rAdEvi gajjela dhvanul - ravaNiMchuchuMDan 

mANikya vINal - madhurammugA nI 
vANin dhvaniMcha@Mga madin - vanajammu vichchun 
vInul ramiMchun - briyamAra nAkun 
gAnaMga dO@Mchenu ninun - galahaMsa rAvA 

pADaMga rAvA - padamoMDu sItA 
nADeMda maMdunu gadA - navamaina SAMtin 
nE DassinADan - ninu dalchuchuMTin 
jUDAmaNin gana@Mga na-SruvuliMdu jAren 

chiMdiMcha vachchen - ji~runavvutODan 
saMdEha meMdula ki@Mkan - sarasAla viMdul 
maMdammu gAlul - makarAMku mitrul 
gaMdhammu niMDenu vanin - gamanIya saMdhyan 
baMdhammu hechchun - phaliyiMchu@M gOrkel  
aMdAla yAmani gadA - yadi navvuchuMDen 
taMdAna tAnA - tanatAna tAnA 
taMdAna tAnana tanA - tanatAna tAnA 

viDiviDigA pai padyamulu - 

iMdravajra - 
chiMdiMcha vachchen - ji~runavvutODan 
maMdammu gAlul - makarAMku mitrul 
baMdhammu hechchun - phaliyiMchu@M gOrkel  
taMdAna tAnA - tanatAna tAnA 

vasaMtatilakamu - 
saMdEha meMdula ki@Mkan - sarasAla viMdul 
gaMdhammu niMDenu vanin - gamanIya saMdhyan  
aMdAla yAmani gadA - yadi navvuchuMDen 
taMdAna tAnana tanA - tanatAna tAnA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___