కలకంఠ (స్వరమాల) -
1 ఏప్రిల్ 2013 స్వరమాల అనేపేరుతో ఈ వృత్తమును పరిచయము చేసినాను. ఇదే వృత్తము కలకంఠ అనే పేరుతో మందారమరందములో పేర్కొనబడినది. ఇది అశ్వధాటి (మత్తేభము) లయ గలిగిన వృత్తము. క్రింద రెండు ఉదాహరణములు -
కలకంఠ (స్వరమాల) - స/జ/న/జ/భ/న/ర/న/గ
IIUI UIII - IIUI UIII - IIUI UIII U
25 అభికృతి 15461356
కలయందుఁ జూపితివి - కలహంస నాట్యములఁ - గల నన్ను వీడి జనఁగా
నిలపైన నిన్ను గన - మలపైన జూచితిని - సెలలోన నీఁదితిని నా
వలపిప్డు పూచినది - తలఁపిప్డు తోఁచినది - మెల వాంఛ లేచినది నీ
చెలువమ్ము సిందగను - దెలినవ్వు చూపగను - గలకంఠి వేగముగ రా
చిఱునవ్వు సిందగను - సరిలేని సంపదలు - స్మరణీయమై వఱలఁగా
సరసమ్ము లాడగను - విరసమ్ము వీడగను - గురిపించ శాంతి సుఖముల్
మఱి నేఁడు వచ్చెఁగద - సరి క్రొత్త వత్సరము - మురిపించ నెల్లర నిలన్
దరులందుఁ గోయిలల - స్వరపూర్ణ గీతికలు - ధరపైన నామని గదా!
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kalakaMTha (svaramAla) -
1 Epril 2013 svaramAla anEpErutO ee vRttamunu parichayamu chEsinAnu. idE vRttamu kalakaMTha anE pErutO maMdAramaraMdamulO pErkonabaDinadi. idi aSvadhATi (mattEbhamu) laya galigina vRttamu. kriMda reMDu udAharaNamulu -
kalakaMTha (svaramAla) - sa/ja/na/ja/bha/na/ra/na/ga
#IIUI UIII - IIUI UIII - IIUI UIII U#
25 abhikRti 15461356
kalayaMdu@M jUpitivi - kalahaMsa nATyamula@M - gala nannu vIDi jana@MgA
nilapaina ninnu gana - malapaina jUchitini - selalOna nI@Mditini nA
valapipDu pUchinadi - tala@MpipDu tO@Mchinadi - mela vAMCha lEchinadi nI
cheluvammu siMdaganu - delinavvu chUpaganu - galakaMThi vEgamuga rA
chi~runavvu siMdaganu - sarilEni saMpadalu - smaraNIyamai va~rala@MgA
sarasammu lADaganu - virasammu vIDaganu - guripiMcha SAMti sukhamul
ma~ri nE@MDu vachche@Mgada - sari krotta vatsaramu - muripiMcha nellara nilan
darulaMdu@M gOyilala - svarapUrNa gItikalu - dharapaina nAmani gadA!
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
.
__,_._,___