Re: [racchabanda] గేయము - వాఁడే వాఁడే #gEyamu - vA@MDE vA@MDE#

cAlA  bAvuMdi Mohana gArU.
Murty.

2018-03-18 6:24 GMT-04:00 'J. K. Mohana Rao' jkmrao@yahoo.com [racchabanda] <racchabanda@yahoogroups.com>:

గేయము - వాఁడే వాఁడే 

మొదటి మూడు పాదములు - 6, 6, 8 మాత్రలు
చివరి పాదము - 6, 6, 10 మాత్రలు

వదనమ్మున మాటలతో - వాఁడే వాఁడే 
ముదమియ్యఁగ నవ్వుచుండు - వాఁడే వాఁడే 
ఎదలోపల తొంగి చూచు - వాఁడే వాఁడే 
వాఁడేలే వాఁడేలే వాఁడే మన కృష్ణుఁడు 

నిదురించఁగ లేపుచుండు - వాఁడే వాఁడే 
గదిబయటను దాళములిడు - వాఁడే వాఁడే 
నదిపైఁ జిఱు నాట్యమాడు - వాఁడే వాఁడే 
వాఁడేలే వాఁడేలే వాఁడే మన కృష్ణుఁడు 

హృదయములోఁ దిష్టవేయు - వాఁడే వాఁడే 
సుధఁ జార్చును జూపులోన - వాఁడే వాఁడే 
పెదవులపై నర్తించును - వాఁడే వాఁడే 
వాఁడేలే వాఁడేలే వాఁడే మన కృష్ణుఁడు 

పద రమ్మను వంశి వనికి - వాఁడే వాఁడే
అది నాదను నిది నాదను - వాఁడే వాఁడే
బ్రదుకు కాదు భారమనును - వాఁడే వాఁడే
వాఁడేలే వాఁడేలే వాఁడే మన కృష్ణుఁడు 

ఎందుకు వ్రాసినానో తెలియదు. ఉదయము లేవగానే మొదటి పంక్తిని ఆ కృష్ణుడు పంపినట్లుంది! 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gEyamu - vA@MDE vA@MDE 

modaTi mUDu pAdamulu - 6, 6, 8 mAtralu
chivari pAdamu - 6, 6, 10 mAtralu

vadanammuna mATalatO - vA@MDE vA@MDE 
mudamiyya@Mga navvuchuMDu - vA@MDE vA@MDE 
edalOpala toMgi chUchu - vA@MDE vA@MDE 
vA@MDElE vA@MDElE vA@MDE mana kRshNu@MDu 

niduriMcha@Mga lEpuchuMDu - vA@MDE vA@MDE 
gadibayaTanu dALamuliDu - vA@MDE vA@MDE 
nadipai@M ji~ru nATyamADu - vA@MDE vA@MDE 
vA@MDElE vA@MDElE vA@MDE mana kRshNu@MDu 

hRdayamulO@M dishTavEyu - vA@MDE vA@MDE 
sudha@M jArchunu jUpulOna - vA@MDE vA@MDE 
pedavulapai nartiMchunu - vA@MDE vA@MDE 
vA@MDElE vA@MDElE vA@MDE mana kRshNu@MDu 

pada rammanu vaMSi vaniki - vA@MDE vA@MDE
adi nAdanu nidi nAdanu - vA@MDE vA@MDE
braduku kAdu bhAramanunu - vA@MDE vA@MDE
vA@MDElE vA@MDElE vA@MDE mana kRshNu@MDu 

eMduku vrAsinAnO teliyadu. udayamu lEvagAnE modaTi paMktini aa kRshNuDu paMpinaTluMdi! 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: Katta Murty <murty@umich.edu>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] అర్ధసమ వృత్తము రతిప్రియ #ardhasama vRttamu ratipriya#

అర్ధసమ వృత్తము రతిప్రియ - 

బేసి పాదములు - మ/న/జ/ర/గ - ప్రహర్షిణి 
సరి పాదములు - జ/భ/స/జ/గ - రుచిర 

ఆధారము - కవిజనాశ్రయము
ఇది జయదామన్ సంకలనములో లేదు. 

రతిప్రియ - 
UUU IIII - UIUI UU // IUI UIII - IUI UIU అమరికతో 

రావేలా నను గన - రమ్య రాత్రి వేళన్ 
నవీన ఛందమున - నవోఢ పాడుమా 
నీవేగా హృదయపు - నిర్మల ప్రభాతుల్ 
కవిత్వ సంపదల - గవేషణార్థముల్ 

రేరాజా నభమున - బ్రేమతోడ వెల్గెన్ 
ధరన్ రతిప్రియవు - తరింతు నిన్ గనన్
శ్రీరాగస్వరములు - చిత్తమందు నిండెన్ 
నిరంతరమ్ము హృది - నివేదనమ్ములే 

UUU IIII - UIUI UU // IUI UI III - UIUIU అమరికతో 

యాచింతున్ నిను గన - నంబుజాక్షి రావా 
విచార మింక వలదు - ప్రేమవృష్టియే 
యోచించన్ సతతము - నుల్లమందు నీవే 
వచించు వాక్య మదియు - స్వర్ణరూపమే 

శ్రీవాణీగిరిజలు - చేరి మమ్ముఁ గావన్ 
భవమ్ము సౌఖ్యమయము - భావపూర్ణమై 
జీవమ్ముల్ విరియఁగఁ - జిత్రమైన రీతిన్ 
దివమ్ము వచ్చు ధరకుఁ - దృప్తి నీయఁగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu ratipriya - 

bEsi pAdamulu - ma/na/ja/ra/ga - praharshiNi 
sari pAdamulu - ja/bha/sa/ja/ga - ruchira 

aadhAramu - kavijanASrayamu
idi jayadAman saMkalanamulO lEdu. 

ratipriya - 
#UUU IIII - UIUI UU // IUI UIII - IUI UIU# amarikatO 

rAvElA nanu gana - ramya rAtri vELan 
navIna ChaMdamuna - navODha pADumA 
nIvEgA hRdayapu - nirmala prabhAtul 
kavitva saMpadala - gavEshaNArthamul 

rErAjA nabhamuna - brEmatODa velgen 
dharan ratipriyavu - tariMtu nin ganan
SrIrAgasvaramulu - chittamaMdu niMDen 
niraMtarammu hRdi - nivEdanammulE 

#UUU IIII - UIUI UU // IUI UI III - UIUIU# amarikatO 

yAchiMtun ninu gana - naMbujAxi rAvA 
vichAra miMka valadu - prEmavRshTiyE 
yOchiMchan satatamu - nullamaMdu nIvE 
vachiMchu vAkya madiyu - svarNarUpamE 

SrIvANIgirijalu - chEri mammu@M gAvan 
bhavammu saukhyamayamu - bhAvapUrNamai 
jIvammul viriya@Mga@M - jitramaina rItin 
divammu vachchu dharaku@M - dRpti nIya@MgA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] నవయుగాది ... సమీహ వృ.

నవయుగాది ...
----------------------

సమీహ - నూతన వృత్తము

గణములు - న,భ,జ 
యతి లేదు

నవయుగాది యరుదెంచెఁ
నవనియంత పులకించె
భువి జనాళి ముదమొందఁ 
గవితలెన్నొ వినిపించె

రకరకాల కుసుమాలు
ప్రకటమైన తరుణమ్ము 
సుకము గాఁగఁ జెవులందుఁ 
బికము పాట మధురమ్ము

నవ విలంబి సమ యౌను 
రవియె రాజు..నిజమౌను
అవధరించి తన యాన
కువలయమ్ము చననౌను

దినకరాజ్ఞ మతినుంచి 
కినియకెట్లు గ్రహరాశి
మనకు సౌఖ్యమొసగంగ
వనట యింక కలిగేన

వెలుఁగుఁ జూప దినరాజు 
పలుకురాణి పలికించఁ
గలుములమ్మ సిరులీయఁ
గలికి గౌరి కృపఁగావ

హరితమైన భువిజాలు
తరులపైన కుసుమాలు
తరణి పంపు కిరణాలు
చిరుతనవ్వు వెలయించ

కలుగు మార్పు గమనించి
వెలుఁగు ఱేఁడు ప్రభువంచుఁ 
గొలఁకులందుఁ గమలాలు 
సలుపుచుండ ప్రణవాలు

అదనులోనఁ జినుకంది
యదితి పొంగ వరి పండ
ముదము గూరఁ బురినిండఁ
గొదవయుండె మనకింక

పదము లట్లె పొరలంగ
వదలిపోవ జడతంత 
సుధలు జిందఁ గలమింక 
మధురమేగ బ్రతుకింక

సుప్రభ
11:40 AM
03-16-2018

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] అర్ధసమ వృత్తము మనోహర #ardhasama vRttamu manOhara#

అర్ధసమ వృత్తము మనోహర - 

ఆధారము - అనంతుని ఛందోదర్పణము 
ఇది కూడ జయదామన్ సంకలనములో కనబడలేదు 
ఈ ఛందస్సుకు లయ తోటక వృత్తపు లయ. నడక చతురస్ర గతి. 

బేసిపాదములు - UU IIU IIU IIU మోటకము (కలితాంతము)
సరి పాదములు - IIU IIU IIU IIU తోటకము  

రెండేసి చతుర్మాత్రలకు యతితో - 

రావా చెలియా - రజనిన్ ద్వరగా 
నవమై వెలిఁగెన్ - నభమం దుడుపుం 
డీవే సకియా - హృదయ మ్మిపుడే 
భవతారిణి నీ-వనయ మ్మనెదన్ 

ఆపూవు మనో-హరమై విరిసెన్ 
ద్రపతో మఱుగై - రమణీ వెలసెన్ 
రా పాలవలెన్ - బడె వెన్నెలలే 
యపరాజితమీ - హరువుల్ ప్రకృతిన్ 

రెండక్షరాల పిదప 11వ మాత్రతో యతి (అనంతుని విధానము) - 

ఆకాశములోఁ గను - మందముగా 
వికసించిన తెల్లని - వెన్నెలలన్ 
నాకై త్వరగాఁ జిఱు - నవ్వులతో 
సకియా నడురేతిరిఁ - జల్లఁగ రా 

శ్రీవాణి మనోహర - చిత్తముతో 
నవ సుందర మోహన - నాట్యములన్ 
నీవీయుము నాకిట - నేర్పులతో 
నవరాగము పాడెద - నాదముతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu manOhara - 

aadhAramu - anaMtuni ChaMdOdarpaNamu 
idi kUDa jayadAman saMkalanamulO kanabaDalEdu 
ee ChaMdassuku laya tOTaka vRttapu laya. naDaka chaturasra gati. 

bEsipAdamulu - #UU IIU IIU IIU# mOTakamu (kalitAMtamu)
sari pAdamulu - #IIU IIU IIU IIU# tOTakamu  

reMDEsi chaturmAtralaku yatitO - 

rAvA cheliyA - rajanin dvaragA 
navamai veli@Mgen - nabhamaM duDupuM 
DIvE sakiyA - hRdaya mmipuDE 
bhavatAriNi nI-vanaya mmanedan 

aapUvu manO-haramai virisen 
drapatO ma~rugai - ramaNI velasen 
rA pAlavalen - baDe vennelalE 
yaparAjitamI - haruvul prakRtin 

reMDaxarAla pidapa 11va mAtratO yati (anaMtuni vidhAnamu) - 

aakASamulO@m ganu - maMdamugA 
vikasiMchina tellani - vennelalan 
nAkai tvaragA@M ji~ru - navvulatO 
sakiyaa naDurEtiri@M - jalla@Mga rA 

SrIvANi manOhara - chittamutO 
nava suMdara mOhana - nATyamulan 
nIvIyumu nAkiTa - nErpulatO 
navarAgamu pADeda - nAdamutO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] ప్రహర్షిణీ (మయూరపిచ్ఛా) #praharshiNI (mayUrapichChA)#

ప్రహర్షిణీ (మయూరపిచ్ఛా) - 

ఆధారము - నాట్యశాస్త్రము, రత్నమంజూష, వృత్తజాతిసముచ్చయము (మయూరపిచ్ఛా) 

నడక - 6,4 - 6,4 మాత్రలు 

ప్రహర్షిణీ - మ/న/జ/ర/గ UUU IIII - UIUI UU

ఉల్లాసమ్ముల నిడ-వో ప్రహర్షణమ్మై 
సల్లాపమ్ములఁ బలు - చాల నాడ నుంటిన్ 
మెల్లంగా వనమున - మేలమాడ రా రం-
జిల్లంగా సమయము - చిత్త మిందు వేచెన్ 

ఏమో యీ దినమున - నిందు నిన్ను గానన్ 
కామమ్మిట్లుఁ గలిగెఁ - గామినీ యెఱుంగన్ 
బ్రేమమ్మే యిది యని - పేరుఁ బెట్టనౌనా 
వ్యోమమ్మందు శశియు - నొంటిగాను నవ్వెన్ 

లాస్యమ్మింక వలదు - లాలి చిట్టితండ్రీ 
హాస్యమ్మింక వలద-యా మయూరపిచ్ఛా 
దృశ్యమ్ముల్ కల గను - దివ్యమైన నిద్రన్ 
ఆస్యందుం డగుపడు - నందమైన డోలన్ 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
praharshiNI (mayUrapichChA) - 

aadhAramu - nATyaSAstramu, ratnamaMjUsha, vRttajAtisamuchchayamu (mayUrapichChA) 

naDaka - 6,4 - 6,4 mAtralu 

praharshiNI - ma/na/ja/ra/ga #UUU IIII - UIUI UU#

ullAsammula niDa-vO praharshaNammai 
sallApammula@M balu - chAla nADa nuMTin 
mellaMgA vanamuna - mElamADa rA raM-
jillaMgA samayamu - chitta miMdu vEchen 

EmO yI dinamuna - niMdu ninnu gAnan 
kAmammiTlu@M galige@M - gAminI ye~ruMgan 
brEmammE yidi yani - pEru@M beTTanaunA 
vyOmammaMdu SaSiyu - noMTigAnu navven 

lAsyammiMka valadu - lAli chiTTitaMDrI 
hAsyammiMka valada-yA mayUrapichChA 
dRSyammul kala ganu - divyamaina nidran 
aasyaMduM DagupaDu - naMdamaina DOlan 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu