[racchabanda] అర్ధసమ వృత్తము సరసవసంతము #ardhasama vRttamu sarasavasaMtamu#

 

అర్ధసమ వృత్తము సరసవసంతము -

బేసి పాదములు - సరసాంకము 
సరి పాదములు - వసంతతిలకము 
సరసాంక వృత్తము (సులక్షణసారము) వసంతతిలకములోని మొదటి గురువును రెండు లఘువులుగా చేసినప్పుడు లభిస్తుంది. 

ఆధారము - కల్పితము 

ఇక్కడ ఒక విషయమును మీకు తెలుపవలయును. ఈ రెండు వృత్తములకు లయ ఒక్కటే. వసంతతిలకము, సరసాంకము శార్దూలమత్తేభవిక్రీడితములవలె, చంపకోత్పలమాలలవలె కవల పిల్లలు. కాని తెలుగులో వసంతతిలకమునకు యతిస్థానము తొమ్మిదవ అక్షరమైతే, సరసాంకమునకు పదవ అక్షరము. నా ఉద్దేశములో వసంతతిలకము ఇంద్రవజ్రనుండి పుట్టినది. ఆ సామ్యమువలన, నేను సామాన్యముగా పదవ అక్షరమును యతి స్థానముగా వాడుతాను. 

సరసవసంతము - IIUI UIIIU - IIUI UU // UUI UIIIU - IIUI UU

హరి నిన్ను గాంచఁగ మదిన్ - హరుసమ్ము గల్గెన్ 
నీరేజపత్ర నయనా - నిరతమ్ము నీవే 
సరసా వసంతము గదా - సరసాంకుఁ డీవే 
యీ రేయి నన్ను గనరా - హృదయమ్ము నిత్తున్ 

విరులెల్లఁ బూచెను వనిన్ - విరహాల వేళన్ 
భారమ్ము నిట్లు హృదిలో - భరియించ నౌనా 
మరుమల్లె లిందు వడలెన్ - మదనస్వరూపా 
చేరంగ రావు నిశియున్ - శివరాత్రి యయ్యెన్ 

మెలమెల్ల మంచు కరిగెన్ - మిహిరుండు మించెన్ 
రోలంబముల్ వనములో - రొదఁ జేయుచుండెన్ 
కలగీతముల్ సెలఁగెఁ జ-క్కఁగ దిక్కులందున్ 
బాలా ననున్ గనఁగ రా - వరవీణ వాణిన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu sarasavasaMtamu -

bEsi pAdamulu - sarasAMkamu 
sari pAdamulu - vasaMtatilakamu 
sarasAMka vRttamu (sulaxaNasAramu) vasaMtatilakamulOni modaTi guruvunu reMDu laghuvulugA chEsinappuDu labhistuMdi. 

aadhAramu - kalpitamu 

ikkaDa oka vishayamunu mIku telupavalayunu. ee reMDu vRttamulaku laya okkaTE. vasaMtatilakamu, sarasAMkamu SArdUlamattEbhavikrIDitamulavale, chaMpakOtpalamAlalavale kavala pillalu. kAni telugulO vasaMtatilakamunaku yatisthAnamu tommidava axaramaitE, sarasAMkamunaku padava axaramu. nA uddESamulO vasaMtatilakamu iMdravajranuMDi puTTinadi. aa sAmyamuvalana, nEnu sAmAnyamugA padava axaramunu yati sthAnamugA vADutAnu. 

sarasavasaMtamu - #IIUI UIIIU - IIUI UU // UUI UIIIU - IIUI UU#

hari ninnu gAMcha@Mga madin - harusammu galgen 
nIrEjapatra nayanA - niratammu nIvE 
sarasA vasaMtamu gadA - sarasAMku@M DIvE 
yI rEyi nannu ganarA - hRdayammu nittun 

virulella@M bUchenu vanin - virahAla vELan 
bhArammu niTlu hRdilO - bhariyiMcha naunA 
marumalle liMdu vaDalen - madanasvarUpA 
chEraMga rAvu niSiyun - SivarAtri yayyen 

melamella maMchu karigen - mihiruMDu miMchen 
rOlaMbamul vanamulO - roda@M jEyuchuMDen 
kalagItamul sela@Mge@M ja-kka@Mga dikkulaMdun 
bAlA nanun gana@Mga rA - varavINa vANin 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] అర్ధసమ వృత్తము స్రగ్ధరేభ #ardhasama vRttamu sragdharEbha#

 

అర్ధసమ వృత్తము స్రగ్ధరేభ - 

బేసి పాదములు - మత్తేభ విక్రీడితము 
సరి పాదములు - మహాస్రగ్ధర 

ఆధారము - రన్నకవి గదాయుద్ధము 

స్రగ్ధరేభ - 
IIU UII UI UIIIU - UUI UUIU // IIUUUIUU - IIII IIU - UIU UIUU

నిను జూడంగ మనస్సు వెళ్లె నెటకో - నిక్కమ్ముగా సుందరీ 
తను వెప్డున్ గోరె నిన్నే - తరుణము లివియే - తారలన్ గాంచి పాడన్ 
విను రాగాల స్వరమ్ము లిందుఁ జెలియా - ప్రేమమ్ములో మ్రోఁగఁగాఁ  
బ్రణయాస్వాదమ్ము ముద్దై - పరువపు వడిలోఁ - బ్రాణమున్ దీపి సేయున్ 

అట సాకేతపురమ్ములో జననమై, - హ్లాదమ్ముతో నానతిన్ 
నిటలాక్షాస్త్రమ్ము ద్రుంచన్, - నెనరున స్మితుఁడై - నేలచూలిన్ వరించెన్, 
అటవిన్ జేరెను భార్యతో ననుజుతో, - నందుండ లంకేశుడున్ 
గటువై కొంపోవ సీతన్, - గడలిని గడచెన్, - గాముకున్ జంపి కాచెన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu sragdharEbha - 

bEsi pAdamulu - mattEbha vikrIDitamu 
sari pAdamulu - mahAsragdhara 

aadhAramu - rannakavi gadAyuddhamu 

sragdharEbha - 
#IIU UII UI UIIIU - UUI UUIU // IIUUUIUU - IIII IIU - UIU UIUU#

ninu jUDaMga manassu veLle neTakO - nikkammugA suMdarI 
tanu vepDun gOre ninnE - taruNamu liviyE - tAralan gAMchi pADan 
vinu rAgAla svarammu liMdu@M jeliyA - prEmammulO mrO@Mga@MgA@M  
braNayAsvAdammu muddai - paruvapu vaDilO@M - brANamun dIpi sEyun 

aTa sAkEtapurammulO jananamai, - hlAdammutO nAnatin 
niTalAxAstrammu druMchan, - nenaruna smitu@MDai - nElachUlin variMchen, 
aTavin jErenu bhAryatO nanujutO, - naMduMDa laMkESuDun 
gaTuvai koMpOva sItan, - gaDalini gaDachen, - gAmukun jaMpi kAchen 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___