[racchabanda] నెమ్మికందము - 736,737 #nemmikaMdamu - 736,737#

నెమ్మికందము - 736,737

ఆరోజాకసముఁ గనుచు 
నీరమ్మున నీఁదినాము - నీవును నేనున్ 
నీరంధ్రపు నీలములకు 
నీరమ్ముల నీల మిడెను - నీరాజనముల్ 

లలితయట నామ మామెకు 
లలితముగా మాటలాడు - లలితము పాటల్ 
లలిత మ్మందము చందము 
లలిత యనఁగ లలిత మెపుడు, - లలి తే లలితా 

విధేయుడు - మోహన 
#
nemmikaMdamu - 736,737

aarOjAkasamu@M ganuchu 
nIrammuna nI@MdinAmu - nIvunu nEnun 
nIraMdhrapu nIlamulaku 
nIrammula nIla miDenu - nIrAjanamul 

lalitayaTa nAma mAmeku 
lalitamugA mATalADu - lalitamu pATal 
lalita mmaMdamu chaMdamu 
lalita yana@Mga lalita mepuDu, - lali tE lalitA 

vidhEyuDu - mOhana 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4617

2 Messages

Digest #4617
1a
Re: Dharma Pathni Qualities. by "ras sastry" sastry1951
1b
Re: Dharma Pathni Qualities. by "ras sastry" sastry1951

Messages

Sun Mar 25, 2018 8:25 am (PDT) . Posted by:

"ras sastry" sastry1951

మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు
క్రింది విదంగా ఉంటాయి .

(1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )

*కార్యేషు యోగీ :*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
*కరణేషు దక్షః *
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో
వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
* రూపేచ కృష్ణః*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
* క్షమయా తు రామః*
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
*భోజ్యేషు తృప్తః*
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.
*సుఖదుఃఖ మిత్రం*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు
పంచుకోవాలి.

ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు.

(2). శ్లో॥ కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,
రూపేచ లక్ష్మీ, క్షమయా ధరిత్రీ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మ యుక్తా కుల ధర్మపత్నీ. (ఉత్తమ భార్య లక్షణాలు)

* కార్యేషు దాసీ*
పనులు చెయ్యడంలో దాసి లాగా బద్ధకించకుండా పొందికగా, ఒద్దికగా, నిదానంగా పనులు
చెయ్యాలి.
*కరణేషు మంత్రీ*
మంచి సలహాలు, సూచనలు అందించడంలో మంత్రిలాగా ఉండాలి.
* రూపేచ లక్ష్మీ*
రూపంలో లక్ష్మీ దేవి లాగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ, చిరునవ్వు చిందిస్తూ
సంతోషంగా ఉండాలి.
*క్షమయా ధరిత్రీ*
కష్ట సమయాలలో, కుటుంబ నిర్వహణలో భూదేవి అంత ఓర్పును కలిగి ఉండాలి. తొందరపడి ఏ
పని చేయకూడదు.
*భోజ్యేషు మాతా*
భోజనం పెట్టేటప్పుడు తల్లి వలె ప్రేమగా పెట్టాలి.
*శయనేషు రంభా*
పడకటింటి లో రంభ లాగా ఉండాలి.
ఈ 6 పనులు సక్రమంగా చేసే స్త్రీ ఉత్తమ స్త్రీగా, ధర్మపత్నిగా కొనియాడబడుతుంది.

పై నీతి శ్లోకాలలో ఉత్తమ భర్త లక్షణాలు గురించి మన0
చెప్పుకోవలసిన అవసరం లేదు . ఎందుకంటే మన దేశం లోని ప్రజలు ఎప్పుడూ వాటి
గురించి ప్రస్తావించరు. ఇక ఉత్తమ భార్య లక్షణాలలో కూడా రూపేచ లక్ష్మి , క్షమయా
ధరిత్రి అనే వాటిని వదిలేసి మిగతా నాలుగు లక్షణాలని ఎక్కువ ప్రాచుర్యం లోకి
తెచ్చారు . ఆలా తెచ్చిన వారు భారత దేశం లోని భర్తలు అనుకుంటే పొరపాటే.
ఎందుకంటే వారికి ఉత్తమ పతులు గా ఉండాలంటేనే కుదరని పని కాబట్టి , ఒక వేళా తమ
భార్యలను ఉత్తమ పత్నులు గా ఉండాలని భార్యల ఎదుట " కార్యేషు దాసీ" అనే శ్లోకం
తాత్పర్య సహితంగా చెపితే , వెంటనే "కార్యేషు యోగీ," అనే శ్లోకం తాత్పర్య
సహితంగా వచ్చి ముఖానికి తగులుతుందేమో అనే భయంతో అసలు నీతి శాస్త్రాన్నే మననం
చేసుకోవడం మాని వేశారు కాబోలు . ఈ నీతులు, శాస్త్రాల గోలేమి లేకుండా "
సర్దుకు పోయి సంసారం చేసే వారే మంచి మొగుడూ పెళ్ళాలు " అనే అభిప్రాయానికి
వచ్చేసారు.

అయితే ఎవరికీ పనికి రాని నీతి శాస్త్రం లోని ఉత్తమ పత్ని తాలూకు శ్లోకం
ఇండియాలోని విదేశీ ప్రేరేపిత స్త్రీ వాదులకు మాత్రం చక్కగా పనికొచ్చింది
..భారత సమాజానికి ఆయువు పట్టుగా ఉన్న కుటుంబ వ్యవస్థను దెబ్బ తీయాలంటే భార్యా
భర్తల మధ్య తంపులు పెట్టందే సాధ్యం కాదు అని భావించిన కుట్రవాదులు నీతి
శాస్త్రం లోని శ్లోకం ని తమ భావజాలానికి అనుకూలంగా మార్చి నెగటివ్
గా ప్రచారం చేయడం ప్రారంభించారు . ఆ ప్రచారం లో కూడా కేవలం 4 లక్షణాలు
గురించి మాత్రమే చెప్పడం మొదలు పెట్టారు . అందుకే పై శ్లోకం లో ప్రస్తుతం
ఎక్కువ వాడుకలో ఉన్న మాటలు ఏమిటంటే "కార్యేషు దాసీ, కరణేషు మంత్రీ,భోజ్యేషు
మాతా, శయనేషు రంభా" అనేవి మాత్రమే .

ఇలా కుట్రపూరితమైన స్త్రీ వాదుల నెగటివ్ ప్రచారం ఎలా ఉందంటే " భారత దేశం
లో మగవాడు అనాదిగా స్త్రీని తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు అనటానికి ఈ
శ్లోకమే మంచి ఉదాహరణ . పగలల్లా దాసిదానిలాగా పనిచేయాలని , రాత్రయితే రంభ లాగ
మారి పడకదిలొ ప్రవర్తించాలని స్త్రీని శాసిస్తున్నాడు మగవాడు . అందుకే స్త్రీ
ఛైతన్యం కోల్పోయి మగవాడికి అడుగులు మడుగులు ఒత్తే బానిసగా మారి పోయింది . ఇక ఈ
దౌర్జన్యం సాగటానికి వీలు లేదు. ఇలాంటి మొగుళ్ళతో కాపురం చేయటం కంటే,
ఆత్మాభిమానం తో ఒంటరిగా జీవించడం మేలు " అని ప్రభోదించడం మొదలు పెట్టారు ,
ఈ తరహా బోధలు వలన చివరకు చాలా కుటుంబాలలో చిచ్చు పెట్టగలిగారు . ఇలా వీరి
మాటలకు మోసపోయి , కావురం కూల్చుకుని , భర్త పిల్లలకు దూరమై , వేశ్యగా మారి ,
చివరకు రాత్రి పూట నడి బజార్లో నగ్నంగా పరుగు తీసి ఇరుగు పొరుగు వారి సహాయం
కోరిన ఒక మహిళ గురించి ఇదే బ్లాగులో ప్రస్తావించడం జరిగింది .
<http://ssmanavu.blogspot.in/2014/12/blog-post_10.html>
ఒక అసత్యాన్ని పలు మార్లు ప్రస్తావిస్తే అదే నిజం అయి తీరుతుందనే నానుడి ని
నిజం చేయడం లో సఫలీ కృతులు అయ్యారు సో కాల్డ్ స్త్రీ వాదులు . కుటుంబ
బాంధవ్యాలు సజావుగా ఉండాలి అంటే ముక్యంగా కావలసింది "సర్దుకుపోయే తత్త్వం
". వీరి నెగటివ్ ప్రచారం వలన , సర్దుకు పోయే గుణం లోపించి , ప్రతి చిన్న
విషయాన్ని భూతద్దం లో చూస్తూ తమ సంసార జీవితాలు నాశనం చేసుకుంటున్న అభాగ్య
స్త్రీలు ఈ నాడు సమాజం లో చాలా మంది ఉన్నారు . ఏ స్త్రీ జనోద్ధరణ అని
చెప్పే T.V సీరియల్ చూసినా , ఏ సినిమా చూసినా "కార్యేషు దాసీ" అనే 4 మాటల
ప్రస్తావన ఉంటుంది . కాకపొతే అది నెగటివ్ గా ప్రచారం అవుతున్నందు వలన
"మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కే " బాపతు కొంతమంది స్త్రీలకు తప్పా , సంసారాలు
చేసుకునే సామాన్య స్త్రీలకు ఉపయోగపడడం లేదు అని నా అభిప్రాయం.

ఆలుమగలు ఎలా ఉండాలో మన పెద్దలు చక్కగా చెప్పిన నీతి శాస్త్రం
లోని "కార్యేషు దాసీ" అనే శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే
శ్లోకం పాపులర్ కాకపోవటానికి కొంతమంది కుటుంబ విచ్చిన్నకర బావజాలికుల
నెగటివ్ ప్రచారమే కారణం .
*రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ **(ఆదోని ఆర్ట్స్
అండ్ సైన్స్ కాలేజి, ఆదోని)*

*R.A.S. Sastry (Retired Principal of The Adoni Arts &Science College,
Adoni), *
*2-629, Srinivasa Nagar, Behind Three Town Police Station, **Opp. Arts
College Auditorium, **Adoni-2 , *
*Kurnool Dt, (Andhra Pradesh) **PIN Code - 518302 *
*My Mobile Nos: +91 94402 44283, 99491 47589 ** Land line home:
08512-231583 *
*My e-mail id: **rassastry@gmail.com* <rassastry@gmail.com>*,
**sastry1951@yahoo.co.in
<sastry1951@yahoo.co.in> *

Sun Mar 25, 2018 8:25 am (PDT) . Posted by:

"ras sastry" sastry1951

మన పూర్వికులు చెప్పిన నీతి శాస్త్రాను సారం ఉత్తములైన భార్యా భర్తల లక్షణాలు
క్రింది విదంగా ఉంటాయి .
(1) శ్లో॥ కార్యేషు యోగీ, కరణేషు దక్షః
రూపేచ కృష్ణః క్షమయా తు రామః
భోజ్యేషు తృప్తః సుఖదుఃఖ మిత్రం
షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (ఉత్తమ భర్త లక్షణాలు )
*కార్యేషు యోగీ :*
పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి.
*కరణేషు దక్షః *
కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో
వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి.
* రూపేచ కృష్ణః*
రూపంలో కృష్ణుని వలె ఉండాలి.
* క్షమయా తు రామః*
ఓర్పులో రామునిలాగా ఉండాలి.
*భోజ్యేషు తృప్తః*
భార్య వండినదాన్ని సంతృప్తిగా భుజించాలి.
*సుఖదుఃఖ మిత్రం*
సుఖదుఃఖాలలో కుటుంబానికి మిత్రుని వలె అండగా ఉండాలి. మంచి చెడ్డలలో పాలు
పంచుకోవాలి.
ఈ ఈ ఆరు పనులు సక్రమంగా చేసే పురుషుడు ఉత్తమ భర్త కొనియాడబడతాడు.
*రాయపెద్ది అప్పా శేష శాస్త్రి, రిటైర్డ్ ప్రిన్సిపాల్ **(ఆదోని ఆర్ట్స్
అండ్ సైన్స్ కాలేజి, ఆదోని)*

*R.A.S. Sastry (Retired Principal of The Adoni Arts &Science College,
Adoni), *
*2-629, Srinivasa Nagar, Behind Three Town Police Station, **Opp. Arts
College Auditorium, **Adoni-2 , *
*Kurnool Dt, (Andhra Pradesh) **PIN Code - 518302 *
*My Mobile Nos: +91 94402 44283, 99491 47589 ** Land line home:
08512-231583 *
*My e-mail id: **rassastry@gmail.com* <rassastry@gmail.com>*,
**sastry1951@yahoo.co.in
<sastry1951@yahoo.co.in> *
www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] నెమ్మికందము - 733-735 #nemmikaMdamu - 733-735#

నెమ్మికందము - 733-735

ఒక క్షణము నవ్వులాటకు 
నొక యుగ మీయిలను బాధ - నొందఁగవలెనా 
శకలమ్ములఁ జేర్చి మఱల 
నొక హృదయము సేయు టెట్లు - నుర్విని బ్రేమన్ 

మనసు స్మరించును విడువక 
మనసునకో మఱచిపోవ - మఱి వీలగునా  
కనులన్ గల నీటిఁ దుడువ 
మనసునగల యశ్రుధార - మాయమ్మగునా 

ముల్లొక్కటి గ్రుచ్చుకొనిన 
మెల్లఁగఁ దీయంగవచ్చు - మెయినుండి యదే 
యుల్లములో గ్రుచ్చుకొనిన 
మెల్లఁగఁ దీయుటయు నెట్లు - మెరమెర వీడన్ 

విధేయుడు - మోహన 
#
nemmikaMdamu - 733-735

oka xaNamu navvulATaku 
noka yuga mIyilanu bAdha - noMda@MgavalenA 
Sakalammula@M jErchi ma~rala 
noka hRdayamu sEyu TeTlu - nurvini brEman 

manasu smariMchunu viDuvaka 
manasunakO ma~rachipOva - ma~ri vIlagunA  
kanulan gala nITi@M duDuva 
manasunagala yaSrudhAra - mAyammagunA 

mullokkaTi gruchchukonina 
mella@Mga@M dIyaMgavachchu - meyinuMDi yadE 
yullamulO gruchchukonina 
mella@Mga@M dIyuTayu neTlu - meramera vIDan 

vidhEyuDu - mOhana 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___

[racchabanda] పుష్పితాగ్రా #pushpitAgrA#

పుష్పితాగ్రా - 

సంస్కృతములో ప్రసిద్ధమైన అర్ధసమ వృత్తములలో ఇది ఒకటి. 

బేసి పాదములు - న/న/ర/య III III - UIUI UU - కామదత్తా 
సరి పాదములు - న/జ/జ/ర/గ IIII UII - UIUI UU - మృగేంద్రముఖ 

ఇది ఔపచ్ఛందసికయందలి ఒక ప్రత్యేకత. ఔపచ్ఛందసికలో బేసి పాదములలో 6 మాత్రలు + ర/య గణములు, సరి పాదములలో 8 మాత్రలు + ర/య గణములు ఉంటాయి. పుష్పితాగ్రలోని 6 మాత్రలు రెండు న-గణములు, 8 మాత్రలు నల, భ గణములు. 

పుష్పితాగ్రా - III III - UIUI UU // IIII UII - UIUI UU

అలరె విరులు - యామినీప్రియమ్మై 
కలలిఁక కల్గును - కామినీప్రియమ్మై 
పలుకు మనసు - భామినీప్రియమ్మై 
వలపులు వెల్గును - స్వామినీప్రియమ్మై 

ముదము నొసఁగు - పుష్పితాగ్రముల్ సం-
పదలగు నామని - వర్ణజాలమందున్ 
హృదియు పదము - నిష్టరీతిఁ బాడున్ 
పొదరిలు పిల్వఁగఁ - బొంగు దేహమెల్లన్  

తరువు కొనలఁ - దామ్ర పుష్పరాశుల్ 
మురియు వసంతము - మోహనమ్ము గాదా 
విరహ మెడఁదఁ - బిండుచుండె నీకై 
సరసము లాడుచు - సారసాక్ష రావా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
pushpitAgrA - 

saMskRtamulO prasiddhamaina ardhasama vRttamulalO idi okaTi. 

bEsi pAdamulu - na/na/ra/ya #III III - UIUI UU# - kAmadattA 
sari pAdamulu - na/ja/ja/ra/ga #IIII UII - UIUI UU# -
 mRgEMdramukha 

idi aupachChaMdasikayaMdali oka pratyEkata. aupachChaMdasikalO bEsi pAdamulalO 6 mAtralu + ra/ya gaNamulu, sari pAdamulalO 8 mAtralu + ra/ya gaNamulu uMTAyi. pushpitAgralOni 6 mAtralu reMDu na-gaNamulu, 8 mAtralu nala, bha gaNamulu. 

pushpitAgrA - #III III - UIUI UU // IIII UII - UIUI UU#

alare virulu - yAminIpriyammai 
kalali@Mka kalgunu - kAminIpriyammai 
paluku manasu - bhAminIpriyammai 
valapulu velgunu - svAminIpriyammai 

mudamu nosa@Mgu - pushpitAgramul saM-
padalagu nAmani - varNajAlamaMdun 
hRdiyu padamu - nishTarIti@M bADun 
podarilu pilva@Mga@M - boMgu dEhamellan  

taruvu konala@M - dAmra pushparASul 
muriyu vasaMtamu - mOhanammu gAdA 
viraha meDa@Mda@M - biMDuchuMDe nIkai 
sarasamu lADuchu - sArasAxa rAvA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu