[racchabanda] తురగవల్గితము #turagavalgitamu#

 

తురగవల్గితము - 

ఆధారము - విన్నకోట పెద్దన 
లయ - మిశ్రగతి, మత్తకోకిల 
కొందఱు 15వ అక్షరముతో మాత్రమే యతిని ఉంచుతారు. 

తురగవల్గితము - (న)4/స/జ/జ/గ III IIII - III IIII - UI UII UIU
22 ఆకృతి 1490944 

మనసు పిలిచెను - మధురతరమగు - మాధవమ్మున మోదమై 
వినఁగఁ బదములఁ - బ్రియము లొలుకఁగఁ - బ్రేమ రాగపు నాదమై 
నెనరు వెలుఁగును - నిజము నిలపయి - స్నేహ దీపపు కాంతిలో 
దినము రజనియు - దివిగ భువియగు - దివ్య కౌముది శాంతిలో 

కవన వనమునఁ - గలలు విరులగుఁ - గావ్యమై కడు భావ్యమై 
రవళి వనమున - లలియు విరులగు - శ్రావ్యమై రస సేవ్యమై 
భవపు వనమున - వలపు విరులగుఁ - బ్రాణమై నవ గానమై 
భువన వనమున - ముదము విరులగు - మోహమై మధు వాహమై 

తురగమున దను - తురితముగఁ జనె - దూర దూరముఁ జేరఁగా 
విరహమున గల - వెతల మఱువఁగఁ - బ్రేమ బాష్పము కారఁగా 
సరసహృదయను - జలజనయనను - జక్కదానిని నిక్కమై 
మఱువ నగునని - మనసు నుడువునె - మాయయే యిది భ్రాంతియే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
turagavalgitamu - 

aadhAramu - vinnakOTa peddana 
laya - miSragati, mattakOkila 
koMda~ru 15va axaramutO mAtramE yatini uMchutAru. 

turagavalgitamu - (na)4/sa/ja/ja/ga #III IIII - III IIII - UI UII UIU#
22 aakRti 1490944 

manasu pilichenu - madhurataramagu - mAdhavammuna mOdamai 
vina@Mga@M badamula@M - briyamu loluka@Mga@M - brEma rAgapu nAdamai 
nenaru velu@Mgunu - nijamu nilapayi - snEha dIpapu kAMtilO 
dinamu rajaniyu - diviga bhuviyagu - divya kaumudi SAMtilO 

kavana vanamuna@M - galalu virulagu@M - gAvyamai kaDu bhAvyamai 
ravaLi vanamuna - laliyu virulagu - SrAvyamai rasa sEvyamai 
bhavapu vanamuna - valapu virulagu@M - brANamai nava gAnamai 
bhuvana vanamuna - mudamu virulagu - mOhamai madhu vAhamai 

turagamuna danu - turitamuga@M jane - dUra dUramu@M jEra@mgA 
virahamuna gala - vetala ma~ruva@Mga@M - brEma bAshpamu kAra@MgA 
sarasahRdayanu - jalajanayananu - jakkadAnini nikkamai 
ma~ruva nagunani - manasu nuDuvune - mAyayE yidi bhrAMtiyE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

.

__,_._,___