What is this about? కూనిరాగాన్నొకదాన్ని గొంతులో కదిలిస్తూ కేశాలలో చిక్కులు వేళ్లతో నిడుపుగా విదిలిస్తూ అతని తలపులలో చిక్కు పడ్డా నేను. అర్ధమే కావు నీవు, -అంటాడు చేతులతో తల పట్టుకుని; అతని ముఖంలో రక్తం జారిపోయి తెల్లబడిపోతుంది. నాకు జాలి వేస్తుంది. కాని నేను 'జాలి' లో చిక్కుపడకుండా జాగ్రత్తలో ఉంటాను. మరి నేను 'వైద్య' ప్రొఫెషన్ నుండి వచ్చాను. ఆ vulnerability నాకుంది. నాకు తెలియని ఈ సంగీత మర్మాలు నీతో చెప్పించుకోటానికి వస్తున్నా; బాఖ్, బీథొవెన్ తెలుపుతావని వస్తున్నా, నువ్వు నన్నర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నానంటావు పాఠం ప్రతిసారీ దాటవేస్తున్నావు పాఠం చెప్పు చాలు -అంటా నేను. నేనతనితో అననే అనను ఇలా - నేనటు తిరిగి కూర్చున్నపుడు నా జుట్టు, జఘనం అందం చూస్తావు ఇటు తిరిగి కూర్చుంటే, నా మస్కారా కళ్లు, ముఖంలో నవ్వులు గుండ్రని బ్రౌన్ భుజాలు, సన్నని నడుము, కాలి మీద కాలు వేసుకుని ఊగించే షనెల్ షూ చూస్తావు. చూడకు. - అని అవి అన్నీ నావేగా, నేను చూడొద్దనను అసలు నా సంభాషణలోకే తేను నేను; "I love your hair, I love your voice" లాటి కాంప్లిమెంట్సన్నీ దాటవేస్తుంటా, ధాంక్యూ కూడా ఉండదు. 'నిన్నర్ధం చేసుకోటానికి ప్రయత్నిస్తున్నా,' ఛాప్టర్ కూడా -నా ప్రయత్నం మీద ముగిసింది. బాఖ్, బీథొవెన్ సంగీతం నేర్పటానికి నన్నర్థం చేసుకునే అవసరం ఏమీ లేదని నాకు, అతనికీ మహచక్కగా తెలుసు. సంగీత పాఠం చెప్పవూ? అంటా నేను అందుకోసమే వెళ్తా నేను. పాఠం ఈ సారైనా చెపుతాడా? లేక నన్ను గురించే నాకు చెపుతాడా? Lyla
Posted by: lylayfl@aol.com
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (59) |
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com