[racchabanda] తేటగీతి "కందము" #tETagIti "kaMdamu"#

తేటగీతి "కందము" - 

బేసి పాదములు - తేటగీతిలోని మొదటి మూడు గణములు
సరి పాదములు - తేటగీతి గణములు 

లలితమగు నవ్వు నిండఁగ 
లలిత హృదయుండ వేలకో - రావు నీవు 
వెలిఁగె రవికాంతి దండిగ 
తొలఁగెఁ దిమిరంపు రజనియుం - దోఁచ వీవు

ఇంద్రచాపంపు టందమ్ముఁ 
జంద్రబింబంపు చందమ్ము - సరస నిలిచె 
మంద్రనాదంపు నుడులతో 
సంద్రమందూఁగు సడులతో - సకియ పిలిచె

మనసు నిను బిల్చె వేగము 
తనువు వలదంచు నాగెను - దాను ద్రపను 
వినగ రావేల యోగము 
మనకు సిద్ధించు నింకను - మదను గృపను 

ఏమి బ్రదుకో యెఱుంగను 
స్వామి మనసు కరుంగను - సమయ మెపుడు 
ఈమనోజ్ఞ వసంతమ్ము 
ప్రేమభావన కంతమ్ము - విరహ మిపుడు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
tETagIti "kaMdamu" - 

bEsi pAdamulu - tETagItilOni modaTi mUDu gaNamulu
sari pAdamulu - tETagIti gaNamulu 

lalitamagu navvu niMDa@Mga 
lalita hRdayuMDa vElakO - rAvu nIvu 
veli@Mge ravikAMti daMDiga 
tola@Mge@M dimiraMpu rajaniyuM - dO@Mcha vIvu

iMdrachApaMpu TaMdammu@M 
jaMdrabiMbaMpu chaMdammu - sarasa niliche 
maMdranAdaMpu nuDulatO 
saMdramaMdU@Mgu saDulatO - sakiya piliche

manasu ninu bilche vEgamu 
tanuvu valadaMchu nAgenu - dAnu drapanu 
vinaga rAvEla yOgamu 
manaku siddhiMchu niMkanu - madanu gRpanu 

Emi bradukO ye~ruMganu 
svAmi manasu karuMganu - samaya mepuDu 
eemanOj~na vasaMtammu 
prEmabhAvana kaMtammu - viraha mipuDu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4713

9 Messages

Digest #4713
2
SAT AS NIJA HITAM by swamypvap
3.1
Spiritual by p_gopi_krishna
4.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
6.1
Sri Satya Sai Baba by p_gopi_krishna
7
Srivari Padalu by p_gopi_krishna

Messages

Sat Jul 7, 2018 12:44 am (PDT) . Posted by:

swamypvap

Karna Kundalamu(ear rings) which are worn as the ornaments to ears signify that one should lend his ears to Jhnanees to acquire Jhnanam(knowledge) because a Kundalam is in the form of a circle (Poornam) and a circle points out to Jhnanam because a circle has 360 degrees. Apart from this fact a circle drawn within a circle or outside a circle also contains 360 degrees. This points out to Jhnanam as Poornam keeping in view the truth that whatever is produced from Poornam is Poornam and Poornam does not loose by producing another Poornam.
Kundalam/circle/Poornam points out to Samtushthi(full satisfaction) . Accordingly if Buddi(intellect) embraces Samtushthi (perfect satisfaction), then it proceeds towards the center/basis of the Kundalam/ circle/Poornam/Jhnanam which signifies Vairagyam and finally Buddi(intellect) becomes one with Sat/Nityam/Ekam. The center/ basis (Aaatharam) signifies Vairagyam because the center as a point has no dimensions (Gunamulu). Eswara as Nirgunam/ Niraakaaram is the center/ Aatharam (basis) for Jhnanam/circle. Here circle/Jhnanam/Pornam signifies Eswari and its center/basis/Nirgunam(Aatharam) signifies Eswara as Eswari Praana Natham.
As Eswara is in all Bhutamulu(beings) as Atma, Buddi under the grace/Krupa of Eswari(Eswara Jhnana Swarupni) should embrace Samtushthi(perfect satisfaction) and become one with Eswara/Atma finally.

Sat Jul 7, 2018 2:18 am (PDT) . Posted by:

swamypvap

Sat is Ekam and is beyond the dual aspects of the world(Dvaitam) and it is Aatharam(basis) for the dual aspects like day(Sun as Dinakara) and night(Chandra as Nisakara) etc of Dvaitam. .
Dvaita Buddi is an effect of Brama (illusion) as caused by ignorance (Ajhnanam)

Sannihitam means Sat is Nija Hitam(real friend) and it is the closest(Sannihitam) to any being.
Accordingly, one should have Sangam (very close union) with Sat by having Sama Darsanam(equal mindedness) with regard to the dual aspects of the world. The Sama Dushthi sets zero to the effect Dualism(Dvaitam) and thus deciphers the the code of Brama(illusion) being caused by Ajhnanam(ignorance).

Sat Jul 7, 2018 7:08 am (PDT) . Posted by:

p_gopi_krishna

*తర్పణము అంటే ఏమిటి ?*_
1. తర్పణం అంటే ఏమిటి?
తృప్తినిచ్చే అర్పణం తర్పణం అంటారు. పితృదేవతలకు తృప్తినిచ్చి, వారికి ఊర్ధ్వ లోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం. విధి విధానాలను బట్టి, సందర్భాన్ని బట్టి తర్పణం పలురకాలు.
*2. తర్పణము ఎన్నిరకాలు?*
తర్పణము రెండు విధములుగా చేయ వచ్చును అవి సకామ లేక నిష్కామములు. సకామ తర్పణములో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణము చేస్తారు. నిష్కామ తర్పణము జలముతో చేయబడుతుంది. ఋగ్వేదులు, యజుర్వేదులు, సామ, అధర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు.
*ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు.*
*గరుడ తర్పణం 😗
ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు.
*బ్రహ్మ యజ్ఞ తర్పణం 😗
నిత్యానుష్టానం లో భాగంగా విడిచే తర్పణాలు ఇవి.
పర్హెణి తర్పణం : యేటా చేసే పితృకర్మల తరువాతిరోజు ఇచ్చే తర్పణాలు.
*సాధారణ తర్పణం 😗
అమావాస్య రోజున, పుణ్యనదీ స్నానాలలో, పుష్కరాలలో, సంక్రమణ, గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు. మన ఋషులు ఇటువంటి తర్పణాలను 96 పేర్కొన్నారు.
*3. తర్పణాలు ఎందుకు వదులుతాము?*
తర్పణము చేయడము వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులౌతారు. లేదా వారిని సంతృప్తి పరచే విధిని తర్పణము అని అందురు. దేవతలను ప్రసన్నము చేసుకోనబడుటకు, వారిని ప్రీతీ చేయుట కొరకు ఈ తర్పణము వదల బడుతుంది.
*4. ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది?*
1. తేనె ద్వార తర్పణము చేయడము వలన అన్ని కోరికలు నెర వేరుతాయి, అన్ని పాతకములు నాశనము అవుతాయి.
2. కర్పూర జలముతో తర్పణము చేస్తే, రాజు వశ మౌతాడు .
3. పసుపు కలిపిన జలముతో తర్పణము చేస్తే, సామాన్య వ్యక్తి వశమౌతాడు.
4. ఆవు నేతితో తర్పణము చేస్తే, …….సుఖము
5. కొబ్బరి నీళ్ళతో తర్పణము చేస్తే, ……. సర్వ సిద్ధి
6. మిరియాలు కలిపిన జలముతో తర్పణము చేస్తే …….. శత్రు నాశనము
*5. తర్పణం ఎలా వదలాలి?*
కల్పోక్త ప్రకారముగా సాధకుడు, స్నాన, పూజా, హోమ సమయము లందు ప్రతి రోజు దేవతల ప్రీతి కొరకు తర్పణము గావించవలయును. దేవతలకు వారి నామ మంత్రములు ఉచ్చరించుచు, దేవ తీర్ధము ద్వారా తర్పణము చేయ వలెను. వారి నామములకు "స్వాహా" చేర్చి తర్పణము లీయవలెను. (అగ్ని పురాణము, బ్రహ్మ పురాణము, మంత్ర మహోదధి నుంచి సేకరించ బడినది)

.. Santosh Kumar https://www.facebook.com/profile.php?id=754506607&fref=mentions ..

Sat Jul 7, 2018 8:21 am (PDT) . Posted by:

p_gopi_krishna

Go beyond the shelter of the intelligence to the shelter of Krishna with your intelligence

Intelligence is vital for our spiritual growth. The Gita's flow reveals how the role of the intelligence evolves with the evolution of our spiritual understanding.

Initially, the Gita asks us to take shelter of the intelligence (02.49). At this point, it hasn't yet revealed the ultimate object of devotion; its focus is on differentiating between the body and the soul and to accordingly rise from actions for gratifying the body to actions for realizing our soul. As discerning such differences requires a sharp intelligence, the Gita urges us to take shelter of the intelligence.

Just before its conclusion, the Gita urges us to take shelter of the intelligence by which we can connect with Krishna (18.57). This statement conveys the summit of the Gita's revelation, wherein its focus goes beyond generic spiritual reality to the supreme spiritual reality – the all-attractive, all-loving supreme person, Krishna.

The best way to become conscious of Krishna is, of course, with the heart, not the head. Why? Because the force of love can direct, even propel, our consciousness far more easily, quickly and effectively than the force of reason.

Nonetheless, for those of us who can't avail of the force of love because our devotion to Krishna is not yet mature, reason is a valuable, even indispensable, intermediary shelter. Whenever we feel agitated by temptation or tribulation, we can use our scripturally-equipped intelligence to reason our way through things. By such reasoning, we can understand the ultimate futility of everything other than Krishna as a source of shelter and joy. Thus, we become convinced to resolutely take shelter of him by practicing bhakti-yoga.

Gradually, by steady bhakti-yoga practice, as our heart becomes attracted to Krishna, we take his trans-intellectual shelter, becoming lovingly absorbed in him.

Think it over:

Why does the Gita initially ask us to take shelter of the intelligence?

How can the intelligence help us to take shelter of Krishna?

How does our connection with Krishna rise from intellectual to trans-intellectual?

Read more https://www.gitadaily.com/go-beyond-the-shelter-of-the-intelligence-to-the-shelter-of-krishna-with-your-intelligence/ https://www.gitadaily..com/go-beyond-the-shelter-of-the-intelligence-to-the-shelter-of-krishna-with-your-intelligence/

Sat Jul 7, 2018 10:54 am (PDT) . Posted by:

"Gopi Krishna" p_gopi_krishna

Yes, you are right. I agree with you.
Right now, since we cannot handle these elements individually, we all together should support someone, who can not only face them, but also have the guts to defeat them in their own game is Mr. Narendra Modi, the present PM. Whatever might be the drawbacks, let us all unite in strengthening his hands. Let us all be united to support him now and always. It is very important for the simple reason that if India survives, Hinduism survives and when Hinduism survives, this great country can once again become leader to the world in all and every respect and aspect of life.
Love and Love alone ... On Saturday, 7 July, 2018, 10:54:31 PM IST, ravi sarva <r_sarva@yahoo.com> wrote:

Jyothi Swaroop garu chakkaga vivaricharu; Dhanyavadamulu!
Kaani, para matha pralobhalu, dabbuku ammuduboina ee neechulu ela vintaru? mullu nu mullu tho pekalinchali.  

On Thursday, July 5, 2018, 6:10:05 AM MST, p_gopi_krishna@yahoo.com [TeluguBhaktiPages] <TeluguBhaktiPages-noreply@yahoogroups.com> wrote:

*రామాయణ కల్పవృక్షమమును  విష వృక్షముగా చిత్రీకరిస్తూ చేస్తున్న విషపు తేళ్ళ దాడులు – వాటిని తొక్కిపెట్టి మదమణచే రామనామాంకిత సమాధానములు.*
(చదివి Share చేయగలరు)

రామాయణము పైనా శ్రీ రాముడి పైనా బురద జల్లే ప్రయత్నాలు మంద బుద్ధులు మరియు వక్రపు బుద్ధులు కలిగిన వారు ఏనాటి నుంచో చేస్తూనే ఉన్నారు, కానీ అవి ఏవీ నిలువక ఆ నిశాచరుల చీకటి వలన మరింతగా రామాయణపు వెలుగు విలువ మరింతగా వెలుగులోకి వచ్చి దేదీప్యమానముగా  వెలుగొందుతున్న రామ నామమమును చూస్తున్ననూ ఆ చీకటి బుద్ధులకు తెలియకున్నది ఏమనగా, ఎప్పటివరకు ఈ భూమి పైన నదులూ పర్వతాలూ చెట్లూ మనుష్యులూ ఉంటారో అప్పటి వరకు రామ నామమూ రామాయణమూ గానము చేయబడుతూనే ఉంటుంది. ఇది సాక్షాత్తు బ్రహ్మ ఉవాచ.

ఒకసారి వారు బుద్ధి తక్కువతో లేదా వక్రబుద్ధితో చేస్తున్న వక్రీకరపు నిందారోపణలు కొన్ని తీసుకుంటే వాటిలో శంబూక వధ, వాలి వధ,విభీషణుడి సహకారం, రావణుడి గుండె కిందకు బాణము వేసాడన్న అపోహ, సీతా అగ్నిప్రవేశం, సీతాదేవిని విడిచిపెట్టుట వంటి ముఖ్యమైన 6 వక్రీకరపు నిందారోపణలు వాటి అసలు యదార్ధ విషయములను ప్రామాణికముగా అతి క్లుప్తముగా పరిశీలిద్దాము.

గమనిక : *నేను ఎంతో కాలముగా పరిశీలన చేసి విశ్లేషణ చేసిన నా కృషిని కొంతైనా గుర్తించి నా పేరుని మార్చి మీ పేరులు వేసుకోవద్దని అది ధర్మము కాదని విజ్ఞప్తి.*

1)*రావణుడి గుండెకు కాక పొట్టలోకి రాముడు బాణమేసెనా? ఇది కూసిన వారికి మతి భ్రమించినదా ఏమి ?* :

(వాల్మీకి రామాయణం 111వ సర్గము 18, 19, 20 శ్లోకములు)
స విసృష్టో మహా వేగః శరీరాంతకరః శరః ! బిభేద హృదయం తస్య రావణస్య దురాత్మనః !!

రుధిరాక్తః స వేగేన జీవితాఽన్తకరః శరః ! రావణస్య హర న్ప్రాణాన్ వివేశ ధరణీ తలమ్ !!

స శరో రావణం హత్వా రుధిరాఽర్ద్రీ కృత చ్ఛవిః ! కృత కర్మా నిభృతవత్ స్వ తూణీం పునః ఆవిశత్ !!

అనగా రాముడు మహా వేగముగా విడిచిపెట్టిన బ్రహ్మాస్త్రము అతి వేగముగా వెళ్ళి దురాత్ముడైన రావణుడి వక్షస్థలమున నాటుకొని అతడి హృదయముని చీల్చి వేసెను. శత్రువులను సంహరించటంలో తిరుగులేని ఆ అస్త్రము రావణుని ప్రాణములు హరించి రక్తసిక్తమై, మరుక్షణమే భూమిలోని ప్రవేశించి రావణుని హతమార్చిన పిమ్మట ఆ శరము తిరిగి శ్రీరాముని తూణీరమున చేరెను.

ఇందులో అసలు రాముడు రావణాసురుడు పొట్టపైన గురి పెట్టడం ఎక్కడ ఉంది? గుండె కిందకు బాణాలు వేయడం ఎక్కడ ఉన్నది?అంత స్పష్టంగా ఉంటే ఒక పక్కన ఈ విధంగా అనాలోచిత  ఆరోపణలు చేయడానికి బుద్ధి ఉన్నదా? జ్ఞానం ఉన్నదా? పోనీ తెలిసి మరీ చేస్తుంటే సత్యాన్ని అసత్యంగా వక్రీకరించి తెలియని వారికి తప్పుగా చూపించడానికి సిగ్గూ మానాభిమానాలు ఉన్నవా?ఎందుకు అటువంటి నీచ జన్మ?? ఇటువంటి వక్రీకరణలు చేసే దుర్బుద్ధులకు ప్రమాణీకముగా బుద్ధి చెప్పవలసిన అవసరము అప్పుడప్పుడూ ఉంటుంది.

______________________________________________________

2) *రావణ వధలో విభీషణుడి సహకారం* :

విభీషణుడు రావణుడికి చేసిన ధర్మ హితభోధ రుచించని వాడై యుండగా విభీషణుడుని రావణుడు ఇంద్రజిత్తులు ఎంతగానో తూలనాడి నిందించడము జరిగినది (యుద్ధకాండ 15వ 16వ సర్గలు). ఎంతగానో హెచ్చరించినా రావణుడు వినకుండని వాడై ఉండగా, ఇక ధర్మస్థాపన కొరకు తప్పక అధర్మ పరుడైన రావణుడిని వీడి విభీషణుడు మూర్తీభవించిన ధర్మాత్ముడైన రాముడిని చేరి శ్రీ రామ శరణార్తుడయ్యేను(యుద్ధకాండ 17వ సర్గ).

*సకృదేవ ప్రసన్నాయ తవాస్మీతి యాచతే | అభయం సర్వ భూతేభ్యో  దాదామ్యే తద్వ్రతం మమ ||*

*ఆనయైనం హరిశ్రేష్ఠ దత్తమాస్యాభయం మయా |విభీషణోవా సుగ్రీవ యది వా రావణః స్వయం || * *(యుద్ధకాండ 18వ సర్గలో 35, 36 శ్లోకాలు)*

"నేను నీవాడను అని పలుకుతూ సర్వ భూతములలో ఎవరు నన్ను శరణుజొచ్చిననూ నేను తప్పక అభయమిస్తాను ఇది నేను బూనిన వ్రతము. సుగ్రీవా విభీషణుడికి నేను అభయమిచ్చుచున్నాను అతనిని తీసుకొని రమ్ము, అతనికే కాదు స్వయంగా రావణుడు వచ్చి శరణుకోరినా నేను అభయమిస్తాను ఇది నా వ్రతము" అని  తాను శరణార్ధులను ఆదుకునే వ్రతము బూనిన విషయమును శరణాగత వత్సలుడైన శ్రీ రాముడు విభీషణుడుకి శరణమిచ్చి తనను తన వాడిగా అంగీకరించాడు. తన వాడుగా మారిన విభీషణుడు ధర్మము కొరకు శ్రీరాముడుకి రావణుడి బలాబలగములు చెప్పడములో ఎట్టి దోషమూ ఉండదు ఎందుకనగా తాను అప్పుడు రాముడి పక్షము వాడు.

*తేన చేమం మాహాప్రాజ్ఞమ్ అభిషించ విభీషణమ్ | రాజానం రక్షసాం క్షిప్రం ప్రసన్నే మయి మానద ||*

*ఏవ ముక్తస్తు సౌమిత్రిః అభ్యషించద్విభీషణమ్ | మధ్యే వానరముఖ్యానాం రజానాం రాజాశాసనాత్ ||* *(యుద్ధకాండ 19వ సర్గ 26, 27 శ్లోకములు)*

శ్రీరాముడు విభీషణుడి ధర్మనిరతికి సంతుష్ఠుడైన వాడై లంకా రాజ్యానికి రాజుగా ఇటువంటి ధర్మాత్ముడే రాజుగా ఉండవలెనని ఎరింగిన వాడై లక్ష్మణుడితో వెంటనే సముద్ర జలమును తీసుకురమ్మని మిక్కిలి బుద్ధిమంతుడైన విభీషణుడికి ఆ జలముతో లంకా రాజ్యానికి పట్టాభిషిక్తుని గావింపమని చెప్పెను. ప్రభువైన శ్రీ రాముడి ఆదేశము శాసనముగా భావించిన లక్ష్మణుడు వానర ప్రముఖుల సమక్షమున ఆ సముద్రజలములతో లంకకు విభీషణుని రాజుగా అభిషిక్తుని చేసెను.

శ్రీరాముడి యుద్ధము లంక పైన  కనుక లంక తనదే అవుతుంది కావున లంకకు విభీషణుడుని ముందుగానే రాజ్యాభిషేకం చేసెను. అప్పుడు లంకలో ఉన్నవాడు రావణుడుని సంహరించడానికి తన సామంతుడైన వాడు అందునా శరణార్తిగా వచ్చి తన వాడైన విభీషణుడి సలహాలు కాదు కదా యుద్ధములో తనను పాలుగొమ్మనడం కూడా ధర్మమే అవుతుంది.

ధర్మాధర్మ విచక్షణలు ఎరుగని వారు, అసలు వాల్మీకి రామాయణమే సరిగా చదవక ఏ సినిమాలలోనో లేక సీరియళ్ళలోనో చూసి లేక ఎవరెవరో రాసుకున్నవి చదివి వీరికంటూ ఒక స్వంత అభిప్రాయాలు లేక ప్రమాణీకాలకూ అప్రామాణికాలకూ తేడా తెలియని మంద బుద్ధుల మాటలు అసలైన చరిత్రకు విరుద్ధంగా ఉండడంలో ఆశ్చర్యము లేదు.

అటువంటి అల్పబుద్ధులు వక్రబుద్ధులు కలవారికి ఈ విషయమును ఈ విధమున కనీస క్లుప్తముగా తెలిపి నోర్లు మూయించుట ఎంతేని అవరసరము.

3)*వాలి వధ* :

మీరూ నేనూ కాదు వాలి తాను మరణిస్తున్నప్పుడు వాలియే అడుగుతాడు, ధర్మావతార శ్రీ రామా ఈ విధంగా నేను వేరొకరితో యుద్ధము చేయుచుండగా నా పై ఈ విధంగా బాణము విడిచి నన్ను సంహరించదలచడం నీకు తగునా ? అని..

దానికి శ్రీరాముడు ఇచ్చిన ధర్మయుక్త సమాధానము

*కిష్కిందకాండ 18వ సర్గలో 4 నుంచి 12 శ్లోకములు*

"ఓ వాలీ ధర్మార్ధ కామములను లౌకిక ఆచారములను తెలుసుకొనక నన్ను తప్పుబడుతున్నావు, ఈ భూమి(జంబూద్వీపము) అంతయూ ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది, పాదుకా పట్టాభిషేకము చేసి రాజుగా భరతుడు దీనిని ధర్మయుక్తముగా పాలించుచున్నాడు. మేము మరియు ఇతర రాజులు ధర్మబద్ధులై ధర్మాన్ని రక్షించడానికి ఈ భూమిపై సంచరించుచున్నాము. అటువంటి ఈ ధర్మముతో నిండిన రాజ్యములో అధర్మ వర్తనులుగా ఉన్నవారిని దండించడము ధర్మమును నిలుపడమూ మా కర్తవ్యము.

*కిష్కిందకాండ 18వ సర్గలో 13, 14, 17, 18, 19, 20 ,21, 28 శ్లోకములు*

నీవు ధర్మము తప్పి ఉన్నావు, ధర్మము ప్రకారము తనకంటే చిన్నవాడైన తమ్ముడు, తన కడుపున పుట్టిన వాడు, తన వద్ద విద్యనభ్యసించిన వాడు వీరు ముగ్గురూ తనకు పుత్రులు వంటి వారు. నీవు నీ కొడుకు వంటి తమ్ముడు బతికి ఉండగానే బలవంతముగా నీ కోడలి వంటి అతని భార్యను పొంది  సుఖిస్తున్నవాడివి. ఒక తండ్రి కూతురిని బలవంతముగా పొందినటువంటి అధర్మము ఇది. దీనికి మరణమే దండనము. నీ తమ్ముడు నావద్దకు వచ్చి దుఃఖించి  మొరపెట్టుకున్నప్పుడు ధర్మము రక్షించవలసిన నేను అతనికి మాట ఇచ్చితిని నిన్ను దండించి తనకు రాజ్యమును తన భార్యను ఇస్తానని.

*కిష్కిందకాండ 18వ సర్గలో 39, 40, 41, 42, 43, 44 శ్లోకములు* 

పైగా ధర్మముగా జీవించు వారిపై దాడి చేసే క్రూర జంతువలను వేటాడి సంహరించి వారిని కాపాడుట క్షత్రియ ధర్మము ఎందుకనగా ధర్మమున నివసించు వారిని నడిపించి వారి జీవనాధారము చూస్తూ వారి ప్రగతి కోసం కృషి చేసేది రాజే. నీవు శాఖా మృగమైన వానరుడవు, మృగములను వల వేసినైననూ, ఎదురుగానైననూ లేక పొంచి ఉన్ననూ అనేక ఉపాయములలో వేటాడవచ్చును. నిన్ను ఎటునుంచి అయిననూ నేను వేటాడి సంహరించవచ్చును,ఎందుకనగా ధర్మములో ఉన్న వారిపైన నీవు ధర్మము తప్పి క్రూరముగా దాడి చేసిన శాఖా మృగానివి. కాబట్టి  ఏ విధంగా చూసినా నిన్ను ఈ విధముగా వధించడము ధర్మమే." అని ఈ విధముగా శ్రీ రాముడు ధర్మమును వాలికి తెలియజేయగా వాలి దానికి పూర్వము రాముడిని నిందించినందు భాధపడి రాముడి ధర్మ భోధను అంగీకరించి నమస్కరించి తన పుత్రుడైన అంగధుడిని శ్రీరాముడికి అప్పగించాడు.

*కిష్కిందకాండ 18వ సర్గలో 47, 48, 49, 50, 51, 52, 53, 54 శ్లోకములు*

వాలి వధ విషయములో రాముడిని నిందించిన వాలికి అందులో ధర్మమును శ్రీరాముడు తెలుపగా వాలియే దానిని తెలుసుకుని మనస్ఫూర్తిగా అంగీకరించి శ్రీరాముడి ధర్మమును కీర్తించి అప్పటివరకూ తాను ఉన్న అధర్మమును ఎరిగి శ్రీరాముడుకి నమస్కరించి తన కుమారుడిని కూడా శ్రీరాముడి చేతిలో పెట్టినప్పుడూ, ఇవన్నీ స్పష్టముగా వాల్మీకి రామాయణములోనే వివరించి ఉన్నప్పుడూ వాలికి లేని అభిప్రాయ భేధము రాముడిని దూషించే కుహానా మేధావులకు ఎందుకు? కేవలం రామాయణముపైన విషము చిమ్మే వారి వక్రపు బుద్ధి కాదా ?అటువంటి వారిని ప్రామాణీకముగా కొంతైనా విశ్లేషణాత్మక  సమాధానములతో నోరు మూయించుట నేడు అవసరము.

-----------------------------------------

4)*సీతమ్మ అగ్నిప్రవేశం* :

రావణ సంహారణాంతరము సీతమ్మ అగ్ని ప్రవేశము చేసిన విషయము అందరికీ తెలిసినదే. కానీ ఈ కాలములో దాదాపు జనులు వాల్మీకి రామాయణం చదవని కారణంతో కుహానా మేధావుల కుట్ర పూరిత వ్యాఖ్యల వలన ఆనాడు అందరూ అర్ధము చేసుకున్ననూ నేడు మాత్రం శ్రీ రాముడికి అపవాదులు తప్పడం లేదు, దానికి రామాయణం చదవని వారి సంఖ్య ఎక్కువ ఉండడమే కారణం అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

ఆ ఘట్టము క్లుప్తముగా ఒకసారి చూస్తే – రావణ సంహారణాంతరము విభీషణుడు సీతమ్మను పల్లకీలో శ్రీరాముడి ముందుకి తీసుకురాగా..
*తాం తు పార్శ్వస్థితాం ప్రహ్వాం రామః సంప్రేక్ష్య మైధిలీమ్ |హృదయాంతర్గత క్రోధో వ్యాహర్తుమ్ ఉపచక్రమే ||* (యుద్ధకాండ 118వ సర్గ – 1వ శ్లోకం)

అనగా అంతట శ్రీరాముడు తనపక్కనే వినమ్రతతో నిలబడి ఉన్నసీతాదేవిని చూసి తన మనస్సులో నిఘూఢముగా ఉన్న గిలిని అంటే లోకాప వాద భయమును ఆమెతో ఈ విధముగా ప్రకటించాడు..  అంటే ఆ తరువాత తాను మాట్లాడబోయే ప్రతి మాట తాను ఉద్దేశపూర్వకముగా మాట్లాడుతున్నది కాదు కేవలం లోకులు కాకులనే ఉపమానం ఉన్నది కనుక లోకులు రావణుడి అపహరణలో ఉన్న సీతా దేవి గూర్చి అపవాదాలుగా చేసే వ్యాఖ్యలకు భయపడి అవి జరుగకుండడం కోసము తాను సీతాదేవి యొక్క పాతివ్రత్యము గూర్చి అందరికీ నిరూపితము చేయడం కొరకే తాను ఇలా మాట్లాడినట్టు అసలు ఈ ఘట్టము మొట్ట మొదటి శ్లోకములోనే తేటతెల్లముగా ఉన్నది. అది కప్పి పుచ్చి ఈ నాటి పిచ్చకాకి లోకులు కొందరు రాముడి మీదనే అపవాదాలు తీసుకురావడం వారి వెర్రికి పరాకాష్ఠ.

రాముడు తాను ఆ సంధార్భములో పరుషముగా మాట్లాడుతూనే ఒక మాట అంటాడు,
*ప్రాప్త చారిత్ర సందేహా మమ ప్రతిముఖే స్థితా ! దీపో నేత్రాఽఽతుర స్యేవ ప్రతికూలాఽసి మే దృఢమ్ !! (యుద్ధకాండ 118వ సర్గ 17వ శ్లోకం)*
అనగా నీవు రావణుడి అపహరణలో కొంత కాలముండి ఇప్పుడు నా ముందు ఉండడం వలన నీ ప్రవర్తన విషయములో నాకు సందేహం కలుగుతున్నది ఎందుకనగా నేత్ర రోగికి దీపకాంతి ఇష్టము కానట్లు నీ విషయములో నాకు ఇలా కనిపిస్తున్నది అని అంటాడు.. 
దానిలోనే అర్ధమవుతున్నది అసలు సీతాదేవిలో ఏ దోషమూ లేదన్న విషయము తనకి తెలుసునని కానీ ఇంతకు ముందు తను అనుకున్న విధముగా లోకాపవాదములకు భయపడి సీతాదేవికి అంటువంటి అపవాదులు రాకూడదని తనను తానే అనుకుంటున్నట్టుగా ఆ అనబోయే లోకులను అంటూ నేత్ర రోగము ఉన్నవారి కంటికి నిన్ను చూడటం ఇష్టముందడు ఎందుకంటే నీవు దీపపు కాంతివి అనగా నీలో ఎటువంటి దోషమూ లేదు అని రాముడు చెప్పకనే చెప్పాడు. 

ఆ తరువాత జరిగిన సంఘటనలు అందరికీ తెలిసినవే రాముడు సీతమ్మను రావణుడి అపహరణలో ఉన్న తనను రాజుగా స్వీకరించలేను అని అనడము సీతమ్మ దానికి ఆవేదనతో సమాధానము తెలుపడము అగ్ని ప్రవేశము చేయడమూ, శివ బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమయ్యి శ్రీరాముడికి చెబుతునట్టుగా అందరికీ సీతా దేవి యొక్క పాతివ్రత్యము తన యొక్క వైశిష్ట్యము తెలుపడము రామాయణములో చూడవచ్చును. ఆ తరువాత అగ్ని దేవుడు ప్రత్యక్షమయ్యి తాను దహించలేని సీతమ్మ పాతివ్రత్యము గూర్చి ప్రకటితము చేయడము తెలిసినదే.

దేవతలతో సహా అక్కడి వారందరికీ అదే విధముగా రాబోవు కాలములో యుగ యుగాలలో అందరికీ తెలిసేలా తన అసలు ఉద్దేశము తన మాటలలో శ్రీ రాముడు ఈ విధముగా తెలియజేసినది ఏమనగా
*యుద్ధకాండ – 121వ సర్గ – 14, 15, 16, 17 శ్లోకములు*

అవశ్యం త్రిషు లోకేషు న సీతా పాప మఽర్హతి ! దీర్ఘ కాలోషితా చేఽయం రావణాఽన్తః పురే శుభా !!

బాలిశః ఖలు కామాఽత్మా రామో దశరథాఽత్మజః ! ఇతి వక్ష్యన్తి మాం సన్తో జానకీ మఽవిసోధ్య హి !!

అనఽన్య హృదయాం భక్తాం మ చ్చిత్త పరివర్తినీమ్ ! అహ మఽప్యఽవగచ్ఛామి మైథిలీం జనకాఽఽత్మజామ్ !!

ప్రత్యయార్ధం తు లోకానాం త్రయాణాం సత్యా సంశ్రయః |ఉపేక్షే చాపి వైదేహీం ప్రవిశంతీం హుతాశనం ||

అనగా "అగ్నిదేవా సీతాదేవి యందు ఎటువంటి దోషమూ లేదు తను పవిత్రురాలు, కానీ రావణుని అపరహరణలో  ఉండుట చేత లోకాపవాదములు రాకుండగా తన పాతివ్రత్యము ముల్లోకముల వారికీ నిరూపించుటకు ఈ పరీక్ష నెరపవలసి వచ్చినది. ఎటువంటి పరీక్ష లేకుండా నేను స్వీకరిస్తే దశరధ రాముడు మూర్ఖుడు కామాతురుడునని అదే లోకులు నిందిస్తారు. జానకి తన మనస్సు నాయందే నిలిపుకుని నా మనసు ఎరిగే ప్రవర్తించునని నేను కూడా ఎరుగుదును, సత్య వ్రతుడనైన నేను సీతాదేవి శీలమును ముల్లోకములకు విశ్వసించుటకు మాత్రమే సీతా దేవి అగ్ని ప్రవేశము చేస్తున్ననూ ఉపేక్షిస్తున్నాను. అంతే కానీ ఈమెను నేను పరిత్యజించుట అసంభవము. "

ఈ విధముగా రాముడే తన ఉద్దేశములను పరిపూర్ణముగా తేటతెల్లముగా చెప్పినప్పుడు, దానికి సీతమ్మతో కలిసి అందరూ ఆనందించి రాముడిని తన ధర్మనిష్ఠకు అందరూ కీర్తించగా సీతమ్మకే ఆనందము కలిగితే, ఈ కుహానా మేధావులకు కలుగవలసిన మానసిక అశాంతి ఏమీ లేదు. వారి మాటల వెనుక వారి కుళ్లూ కుతంత్ర కుట్రలు ఏమిటో గ్రహించి వారికి తగిన బుద్ధి వెనువెంటనే తెలుపగలరు.
_____________________________________________________

5)*సీతమ్మ వాల్మీకీ మహర్షి ఆశ్రమ ప్రవేశం* :

మొట్ట మొదటిగా సీతమ్మను శ్రీరాముడు అడవులలో వదిలేశాడు అని తెలియక కొందరు అమాయకులూ వారితో పాటు  తెలిసి కూడా కొందరు కుహానా మేధావులూ అంటారు. కానీ శ్రీ రాముడు సీతమ్మను వదిలేయడము కాదు అది, అడవులలో అంతకన్నా కాదు. శ్రీ రాముడు లక్ష్మణుడుతో తమసా నదీ తీరములో గల వాల్మీకీ మహర్షి ఆశ్రమ సమీపములో రధములో తీసుకువెళ్లి విడిచి పెట్టమని చెప్పాడు. అంటే శ్రీ రాముడు తన ప్రాణ సమానురాలైన సీతాదేవిని మహర్షి ఆశ్రమములో నివసింపజేయుటకు నిశ్చయించాడు. అంతే కానీ అది అడవులలో వదిలేయుట కాదు.(ఉత్తరకాండ 45వ సర్గలో 16, 17, 18 శ్లోకములు).

మరి తన ప్రాణ సమానురాలైన భార్యను ఏక పత్నీ వ్రతుడైన శ్రీ రాముడు ఎందుకని ఆశ్రమము వద్ద విడిచి పెట్టమని పరమ దుఃఖముతో చెప్పవలసి వచ్చినదో తెలుసుకోవలసి ఉన్నది.

శ్రీరాముడు తన సభలో ఆసీనుడై రాజ్యములో ప్రజలు తన గురించి ఏమనుకుంటున్నారో సమగ్రముగా తెలుపమని సభలోని భద్రుడను వాడిని ప్రశ్నించగా, భద్రుడు రాముడికి అంజలి ఘటించి నమస్కరించి రాజ్యములోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని తమ పాలనకు ఎంతగానో సంతుష్థులై భోగభాగ్యలతో ఉన్నారని తెలిపాడు. అప్పుడు రాముడు ఉన్నది ఉన్నట్టుగా తెలుపుము రాజుయొక్క గుణదోషాల గూర్చి ప్రజలు చర్చించుకొనుట సహజమే కదా నిర్భయముగా తెలుపమని తిరిగి ప్రశ్నించాడు..

*ఈ సందర్భములో చాలా మంది ఇక్కడ ఒక కులములోని వ్యక్తి చేసిన వ్యాఖ్యగా చిత్రీకరణ చేసుకొని చెప్పుకుంటారు, అది కేవలం సినిమా ప్రభావం మాత్రమే, వాల్మీకి రామాయణములో ఆ విధముగా లేదు.*

అప్పుడు భద్రుడు నమస్కరించి  రాజ్యములో అన్నీ చోట్లా అందరునూ మీ గుణదోషముల గూర్చి ఈ విధముగా మాట్లాడుకుంతటున్నారు "శ్రీ రాముడు అద్భుతమయిన సేతువు నిర్మించాడు, ఎందరో రాక్షసులనూ దుర్జయుడైన రావణుడిని సంహరించాడు. కానీ యుద్ధమున గెలిచి తన రోషమును విడిచి పెట్టి సీతాదేవిని స్వీకరించి ఆమెను మరల భవనమునకు తీసుకు వచ్చాడు.

*అస్మాకమపి దారేషు సహనీయం భవిష్యతి | యధా హి కురుతే రాజా ప్రజాతమనువర్తతే || (ఉత్తరకాండ 43వ సర్గలో 19వ శ్లోకం)*

కొంత కాలము పరుల చెంతన రావణ అపహరణలో ఉన్న భార్యను రాముడు ఎందుకు ఏవగించుకోవడము లేదు? ఇక మనము కూడా మన భార్యల యందు ఇట్టి సహనమునే చూపవలసి వచ్చునేమో,రాజు యొక్క మార్గమునే ప్రజలు అనుసరిస్తారు కదా " అని ఈ విధముగా అనుకుంటున్నారని భద్రుడు తెలిపాడు. 

*తరువాత ఉత్తరకాండ 45వ సర్గలో 11, 12, 13 శ్లోకములలో* శ్రీ రాముడు తన తమ్ములతో భాధతో దుఃఖిస్తూ      పలికిన మాటలు చూస్తే " సీతాదేవి గూర్చి పౌరులలో ప్రజలలో వ్యాపించుచున్న దుర్భర అపవాదము, నా పై వారిలో ఏర్పడిన ఏవగింపు నా హృదయాన్ని ఎంతగానో కలవర పరుస్తున్నది. అందువలన నేను ఎంతగానో దుఃఖిస్తున్నాను.. లోకములో ఎవరికైననూ అపకీర్తి వస్తే ఆ అపకీర్తి నిలిచి ఉన్నంత వరకూ వారు అధోలోకములలో పడిపోతారు, అటువంటి అపకీర్తిని దేవతలు కూడా నిందిస్తారు." అని అంటాడు. దీని అర్ధమేమనగా రాజైన తనకు ఆ అపకీర్తి వలన వచ్చే అధోగతి వలన దేవతలు కూడా నిందించే అపకీర్తి వలన తాను రాజైనందున రాజ్యము పైనా ప్రజల పైన కూడా ఆ ప్రభావము తప్పక పడి రాజ్యములో రాజ్య ప్రజలలో సుఖ సంతోషాలకు బదులు దుఃఖములు కలుగవచ్చునని భాధపడినవాడు ప్రజలకు తండ్రి వంటి రాజైన శ్రీ రాముడు.

తరువాత మళ్ళీ  ఉత్తరకాండ 45వ సర్గలో , 14, 15 శ్లోకములలో* "నేను ఈ లోకాపవాదముల వలన కలుగు భాధతో సోదరులైన మీతో సహా నా ప్రాణములను కూడా త్యజించడానికి వెనుకాడను,ఇక సీతా దేవి విషయము చెప్పనేల? అందువలన అంతులేని శోకములో మునిగి ఉన్న నన్ను గమనించండి. నా దృష్టిలో రాజుగా ఉన్న నాకు ఈ మిగుల దుర్భరమైన లోకాపవాదమునకు మించిన దుఃఖమే ఉండదు" అని అంటాడు శ్రీ రాముడు.

దీని అర్ధమేమనగా రాముడు ఈ లోకాపవాదములకు కలిగే భాధకు తన తమ్ముళ్ళనూ ఆఖరికి తన ప్రాణాలనయినా త్యజించాలని అనిపిస్తున్నదని కాబట్టి లోకాపవాదములకు మించిన దుఃఖమే ఉండదని తెలుపుతూ ఇక్కడ రాముడు తెలియజేస్తున్నదేమనగా,తాను రాజు కావడము చేత ఈ లోకోపవాదాలకు కలిగిన భాధలకు తమ్ముళ్లను కానీ ప్రాణాలను కానీ విడిచిపెట్టిన వాడు అయితే అది రాజ్యానికి తీవ్ర నష్టము. కాబట్టి అటువంటి లోకాపవాదమును త్యజించడమే రాజుగా తన ధర్మము.

ఇక్కడ మనము అర్ధము చేసుకోవలసినది రాముడు సీతను విడిచి పెట్టడానికి గల కారణము ఏమిటంటే రాజ్యములో ప్రజలు భావిస్తున్న విధముగా ఒకవేళ వారి భార్యలు ఎవరి చెంతన అయినా కొంత కాలము ఉండి వస్తే వారు కూడా ఆమోదించవలసి  ఉంటుందేమో ఎందుకంటే  తమ రాజైన రాముడు అలా చేశాడు కదా అని భావించడము. తద్వారా సీతాదేవి అగ్ని పరీక్ష చేసుకుని తనను తాను నిరూపించుకున్ననూ రాముడు అప్పుడు వేదన పడిననూ మరల సీతమ్మకు ఈ లోకాపవాదం తప్పలేదు.

ఇప్పుడు ఆ రాజ్యములో ప్రజలు అనుకుంటున్న విధముగా వారికి సమస్య వస్తే తాను ధర్మము చెప్పవలసి ఉన్నప్పుడు  తన విషయములో జరిగినది వారు గుర్తు చేస్తే తాను ధర్మము చెప్పిననూ అది ప్రజలు ఆమోదింపరు, దానికి కారణము ఏర్పడిన లోకాపవాదము. కనుక ఆ లోకాపవాదములని  అనగా దానికి కారణముగా కనిపిస్తున్న సీతమ్మను ఒక రాజుగా త్యజించక తప్పదు.

ఇక్కడ అసలు విషయం ఇంకొకటి ఏమిటంటే రాముడి ధర్మ నిష్ఠను సీతమ్మ కూడా అర్ధము చేసుకుని ఆమోదించినది అది మనము *ఉత్తరకాండలో 48వ సర్గలో 13, 14 , 15 శ్లోకములలో చూడవచ్చును*. ఆ సందర్భములో సీతా దేవి తనను వాల్మీకీ ఆశ్రమానికి సమీపములో వదిలిన లక్ష్మణుడితో శ్రీరాముడికి చెప్పమని పలికినదేమనగా "శ్రీరామా లోకాపవాదముల వలన నీ పైన వచ్చిన అపనిందను నేనే తొలగించవలసియున్నది, దానికి నీవు నన్ను ఇక్కడ విడిచితివి. నిత్యము ప్రజలను నీ సోదరులవలె ఆత్మీయతతో చూసుకుంటూ ఉండడము నీకు పరమధర్మము. దీని వలన నీకు శాశ్వత కీర్తి లభించును. నీ ధర్మ నిరతిని బట్టి ప్రజలు కూడా ధర్మ పరాయణులే అవుతారు" అని సీతాదేవి పలికినది. దీని వలన తెలిసినది ఏమనగా, విధి ప్రభావమున జరిగిన సంఘటనలకు లోకాపవాదములకు గాను ధర్మమును ఆచరించవలసి ఉన్నది కనుక ఈ విధముగా రాముడు చేయడమే సబబు అని సీతాదేవి కూడా తెలిపినది.

*శ్రీరాముడు సీతమ్మను ఆశ్రమ వాసానికి పంపిననూ ఇంకొక స్త్రీని వివాహము చేసుకొనెనా? లేదు కదా..* తాను ఎన్నో రాజ్యాలకు రాజై ఎందరో సామంతులను పొందిన దక్షిణ నాయకుడు. తాను ఎందరినో పెళ్లి చేసుకోవచ్చును అయినప్పటికీ తాను ఏక పత్నీవ్రతుడే అయి సీతా వియోగముతో జీవిత పర్యంతమూ అందరినీ మించి దుఃఖించినవాడే కానీ వేరొక స్త్రీని కలలో కూడా ఎరుగని ఏక పత్నీవ్రతుడు. ఇందులో శ్రీరాముడు ధర్మముకు కట్టుబడి ఉండడము తప్ప మరియొకటి ఏమీ లేదు. ఇక్కడ సీతాదేవికీ రాముడికీ ఏకాభిప్రాయము కలిగి ఉండగా, అది కూడా ధర్మముగా ఉండగా మరి ఈ విషయము పైన అయోమయము ఎందుకు వస్తున్నది ! దానికి ఆస్కారమే లేదు. ధర్మము కొన్ని సార్లు కఠినముగానే కనిపిస్తుంది. కానీ అదే ఆచరించిన ధర్మము శాశ్వత కీర్తిని తీసుకువస్తుంది.. అందుకే ఆయన శ్రీరాముడైనాడు ఆమె సీతమ్మ అయినది.

ఇక్కడ మనము గమనించవలసినది ఏమనగా అంతకు పూర్వము తన పినతల్లి కైకేయి తన తండ్రిని అడిగిన వరములకు గాను తన తండ్రి రాముడిని వనవాసముకు పంపుతానని మాట ఇచ్చినప్పటికీ, తరువాత రాముడిని వెళ్లవద్దని అయోధ్యలోనే ఉండమనీ రాజ్యము స్వీకరించమని తండ్రీ అంటాడు, తమ్ముడైన భరతుడూ అంటాడు, ఆఖరికి మాట అడిగిన కైకీయీ అంటుంది,మంత్రులూ అలాగే ప్రజలందరూ అడుగుతారు రాముడిని వెళ్లవద్దు ఉండమని. కానీ తాను అలా వెళ్ళక ఉండిపోతే తన తండ్రికి ఇచ్చిన మాటను వదిలిన వాడిగా లోకాపవాదము రావచ్చునని రాముడు క్షత్రియుడుగా ఆ లోకాపవాదమును రాకుండగా దూరము చేయడానికి తనకు తానే అడవులకు వెళ్ళాడు. అదే ఈ సందర్భములో ఆ లోకాపవాదము విధివశాత్తు సీతమ్మ చుట్టూ తిరుగుతున్నందు వలన సీతమ్మను ఆశ్రమవాసానికి పంపక తప్పలేదు. ఇక్కడ రెండు సందర్భములలో రాముడు తన క్షత్రియ ధర్మముతో లోకాపవాదము రాకుండా ధర్మముకు కట్టుబడి ఉండడము అసలు విషయము కానీ వేరొకటి కాదు. ఈ విషయమును ఇంత విశ్లేషణగా చూడవలసి ఉన్నది.

ఈ విషయము పైన సరైన అవగాహన లేకనో లేక అవగాహన ఉండి కూడా కుటిల బుద్ధితో రాముడి పైన ఆరోపణలు చేయు వారికి విశ్లేషణాత్మకంగా చెబితే అదే వారికి చెంప పెట్టు సమాధానం అవుతుంది.

6) *శంబూక వధ* :

ఈ విషయము పైన కుహానా మేధావులు సనాతన ధర్మముకి చెందిన హిందువులలో అంతః కలహాలు సృష్టించి హిందువులలో ఒక వర్గం వారిని పక్కదారి పట్టించడానికి ఎంతో కాలముగా అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కొంత మంది హిందువులు ఈ కుళ్ళు బుద్ధి కలిగి ఉండే కుహానా మేధావుల మాటలకు అదే విధంగా సరిగా అర్ధము చేసుకోలేక పోయిన కొందరు పెద్దల వాఖ్యలకు అమాయకముగా వారి మాటలు నమ్మి ఉన్నప్పటికీ,ఎందరో హిందువులు మన ధర్మములోని విషయములు కేవలం బాహ్యార్ధానికి మాత్రమే అందనివి, సమగ్ర విశ్లేషణ లేనిదే అసలు సరిగా అర్ధమే కానటువంటి ఎంతో నిఘూడమైనవి అని గ్రహించి మన ధర్మముకి కట్టుబడి ఉన్నారు అనేది గ్రహించవలసిన విషయము.

కానీ నేడు ఈ విషయము పైన ఎన్నో అసత్య దుష్ప్రచారాలు జరుగుతున్న తరుణంలో నేను ఈ విషయములోని సూక్ష్మములు ఎందరో అర్ధము చేసుకోవలసిన అవసరము నేడు ఎంతో ఉన్నందున ఆ విషయాన్ని గూర్చి క్లుప్తముగా విశ్లేషించే సాహసము చేయుచున్నాను. 

శంబూక వధను ఒకసారి పరిశీలిస్తే  ఉత్తరకాండ లో 74, 75, 76 వ సర్గలలో ఈ విషయం గూర్చి సమగ్ర వివరణ ఉన్నది. అది ఆ కాలములో త్రేతా యుగములోన యుగ ధర్మానుసారం ఎలా అన్వయమైనది, ఈ కలియుగములో అసలు ఆ విషయములో ఎటువంటి పక్షపాతము లేని నిష్పక్షపాతము అందరికీ అందుబాటులో ఉండే ఈ యుగ ధర్మము గూర్చి కూడా అందులోనే ఉన్న ప్రస్తావనను క్లుప్తముగా పరిశీలిద్దము.

ఒక రాజు ధర్మ పరిపాలన చేస్తే ఆ రాజ్యములో అకాల మరణాలు ఉండవు. ఒకవేళ సంభవిస్తే ఆ రాజ్యములో ఎక్కడో అధర్మము జరిగినది అని అర్ధము. శ్రీ రాముడు తన రాజ్యమును ధర్మ యుక్తముగా పరిపాలిస్తున్న సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తన కుమారుడైన బాలుడు అకాల మృత్యువుకి లోనైనందున దుఃఖిస్తూ రాజైన రాముడు వద్దకు ఆ వృద్ధుడు తన కుమారుడి కళేబరం తీసుకు వచ్చి చూపిస్తాడు.

ఆ మృతుడైన తన కుమారుడుని చూపించి ఓ శ్రీరామ నేనేమి పాపము చేశానో నా కుమారుడు ఇలా అకాల మృత్యువుకి లోనైనాడు, నా పాపముతో పాటు ఈ రాజ్యముకి రాజువైన నీ దోషము కూడా ఇందులో భాగమై ఈ అకాల మృత్యువుకి  కారణము కావచ్చును, ఎందుకనగా ఇతర రాజ్యాలలో ఎటువంటి అకాల మరణాలు లేవు. నీ ఈ రాజ్యములో నీ దృష్టికి రాకుండా ఎక్కడో అధర్మము జరిగి ఉండవచ్చు, కాబట్టి నీవు ఆ అధర్మముని నిర్మూలిస్తే నా పుత్రుడు పునర్జీవితుడవుతాడు ఇది కేవలం అకాల మృత్యువు కనుక, నీవు ఈ కార్యం చేయకున్న నేను నా భార్య ఇక్కడే ప్రాణ త్యాగము చేస్తామని ఆ వృద్ధుడు విలపించెను.

అప్పుడు నారద మహర్షి వచ్చి ఈ బాలుడికి అకాల మృత్యువు ఎలా వచ్చినదో తెలిపెదను వినుము అని
"కృత యుగములో కేవలం బ్రాహ్మణులు మాత్రమే తపస్సులను ఆచరించడానికి యోగ్యులు, వారికి మాత్రమే ఉపదేశముండును,ఇతర మూడు వర్ణముల వారికి ఆ అర్హత ఉండదు.

త్రేతాయుగములో బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా తపశ్చర్యలకు యోగ్యులే అవడంతో వారి ఇరు వర్ణముల వారూ సమానులుగా ఉంటారు ఈ యుగములో, ఇతర వర్ణముల వారికి తపస్సు చేయుటకు అనుమతి ఉపదేశం ఉండదు.

ద్వాపర యుగములో బ్రాహ్మణ క్షత్రియులతో పాటు వైశ్యులకు కూడా అర్హత కలిగి వారు కూడా తాపసులు కావచ్చును.

*భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే | అధర్మః పరమో రాజన్ ద్వాపరే శూద్ర జన్మనః ||(ఉత్తరకాండ 74వ సర్గ – 27వ శ్లోకము)*

అనగా ద్వాపర యుగము అంతక ముందు యుగములలో యాగధర్మాలను అనుసరించి శూద్ర వర్ణం వారికి తపస్సు చేయుటకు అనుమతి లేకున్నది. కానీ కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు."  కాబట్టి యుగ ధర్మమును ఆచరించి నీ రాజ్యము అంతటా సంచరించి ఎవరైనా అధర్మముని ఆచరిస్తూ ఉంటే వారిని రాజుగా సంహరించి ధర్మమును నిలబెట్టుము,తద్వారా అకాల మృత్యువు బారిన పడిన ఇతడు పునర్జీవుతుడు అవగలడు అదే విధంగా ఎటువంటి అకాల మరణములు ఉండబోవు" అని నారద మహర్షి పలికెను.

అది వినిన రాముడు తన రాజ్యమంతటా తిరుగుతూ శంబూకుడు వద్దకు చేరెను. అక్కడ శంబూకుడు అధోముఖుడై తీవ్ర తపస్సును ఆచరించు చుండగా రాముడు వచ్చి ఆయనను ఈ విధంగా ప్రశ్నించెను. "ఓ వ్రత నిష్ఠాగరిష్ఠుడా నీవు ఎంత ధన్యుడవు. తపోవృద్ధుడా నీ జన్మ ఎట్టిది? నీ శక్తి సామర్ధ్యములు ధృడమైనవి కావున కుతూహలముతో ఈ విధంగా అడుగుతున్నాను. నేను దశరధ కుమారుడైన శ్రీ రాముడిని. నీవు ఈ ఘోర తపస్సు ఏమి ఆశించి ఎందుకు చేయుచున్నావు? నీకు కావలసిన వరమేమి?స్వర్గ భోగములు కావలనా వాటికి మించినవా తెలుపుము " అని అడిగెను.

దానికి శంబూకుడు "శ్రీరామా నేను శూద్రుడను నా పేరు శంబూకుడు. ఈ శరీరముతోనే దివ్యత్వమును పొందగోరుచున్నాను. శూద్రుడైన నేను దేవలోకమును జయింపదలచి ఇట్టి ఉగ్రతపస్సును పూనుకుంటిని, నా పలుకులు నిజము" అని తెలుపగా శ్రీరాముడు తనని వధించడం జరిగినది అది కూడా ఆ యుగ ధర్మాలను అనుసరించి రాజుగా తన ధర్మముతో.

ఇక్కడ అందరూ ముఖ్యముగా గ్రహించ వలసినవి కొన్ని ఉన్నవి :

- > శంబూక వధ జరిగినది తను శూద్రుడు అని ఈ కలియుగములో మనము చర్చలు చేసుకోడానికి కాదు. ఆ యుగములోని ధర్మము అది. అది కూడా ఆ యుగములో వారు అటువంటి ఉగ్రతపస్సు చేయడం చేత ధర్మానికి హాని కలుగుతుంది కనుక.

-  > ఇక్కడ శూద్రుడైన శంబూకుడు ఆ యుగ ధర్మముకి విరుద్ధముగా తపశ్సు చేయడం వలన వధ జరిగినది కానీ కేవలం శూద్రుడు కావడం చేత కాదు.. రామ రాజ్యములో ధర్మములో ఉన్న శూద్ర వర్ణము వారు అందరూ ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారు అనే శ్లోకాలు రామాయణములో అనేకము కలవు.

- > శ్రీ రాముడు ఈ సంధర్భములో శంబూకుడుని వధించినది కేవలం ఒకరి వర్ణం వారి కోసమే కాదు లేక ఒక వర్ణం పైన కోపముతోనూ కాదు. తన రాజ్యములో అన్నీ వర్ణాల వారు అకాల మృత్యువులు లేకుండగా ఉండేందుకు. శంబూకుడు అనే అధర్మము చేస్తున్న ఒక్క శూద్రుడుని వధించినది అనేక మంది పిల్లలను అకాల మృత్యువు కలుగకుండా తన ధర్మముతో కాపాడేందుకు, అందులో ఎందరూ శూద్ర వర్ణముకి చెందిన బాలురు కూడా ఉంటారు అదే రాజ్యములో అనేది కూడా గ్రహించవలసిన విషయం. 

- > శ్రీ రాముడు అన్నీ వర్ణాల వారిని సుఖ శాంతులతో జీవించేలా చూసుకున్నాడు అనేది వాల్మీకి రామాయణంలో రామ రాజ్య వర్ణనలో స్పష్టంగా చూడవచ్చును.  ఇక్కడ ఈ సందర్భములో అధర్మముతో ఉన్న ఒక శూద్రుడుని వధించాడు. కానీ అదే రామాయణంలో అధర్మముతో ఉన్న క్షత్రియులనూ సంహరించాడు,అదే రామాయణంలో పరశు రాముడు ఎందరో అధర్మముతో ఉన్న క్షత్రియులను సంహరించిన వృత్తాంతం గురించి కూడా చూడవచ్చును . అదే రామాయణంలో రాముడి ఆదేశానుసారం శత్రుజ్ఞుడు అధర్మము చేసిన గంధర్వుడిని సంహరించడం కూడా చూడవచ్చును.. అదే రామాయణంలో అసలు ఒక బ్రాహ్మణుడైన రావణుడిని చంపడానికే రాముడు పుట్టాడు కదా!! అధర్మపరుడైన ఒక బ్రాహ్మణుడైన సాక్షాత్ బ్రహ్మ వంశముకి చెందిన రావణ బ్రహ్మ అను బ్రాహ్మణుడిని కూడా సంహరించడం జరిగినది. *బ్రహ్మ వంశముకి చెందిన రావణబ్రహ్మ అనబడే రావణుడు బ్రాహ్మణుడు కాదు అనుకోవడం కొందరి అయోమయమో లేక అమాయకమో లేక ఉద్దేశపూర్వక వక్రపు ఆలోచనలో వారికే తెలియాలి మరి. !!*

కాబట్టి శంబూక వధ శూద్రుడిని వధించడంగా కాకుండా అధర్మపరుడిని వధించడం అనీ, ఒకసారి అధర్మ పరుడైన బ్రాహ్మణుడు ఒకసారి అధర్మ పరుడైన శూద్రుడు అలాగే అధర్మ పరులైన క్షత్రియులను ధర్మము కోసం వధించడం జరిగినదని దాని వలన పదకొండు వేల సంవత్సరాలు రాముడు పాలించిన రామరాజ్యంలో అన్నీ వర్ణాల అందరూ ఆనందముగా సుఖ సంతోషాలతో జీవించారు అనేది  తెలుసుకోవడం ఎంతైనా అవసరము అదే ప్రామాణికమైన సత్యము. 

ఇక్కడ రామాయణము ద్వారా మనము ఈ సందర్భములో గ్రహించవలసిన సత్యం ఏమనగా

ఇందాక చెప్పిన విధముగా *" భవిష్యచ్ఛూద్రయోన్యాం వై తపశ్చర్యా కలౌ యుగే – అనగా కలియుగములో శూద్రులకు కూడా తపశ్చర్య ప్రవృత్తి ఏర్పడి అందరూ సమానులుగా ఉందురు."*  కాబట్టి యుగాలలో వేరు వేరుగా ఉండే ధర్మాలను ఈ కుహానా మేధావులు వారికే సరిగా తెలియక లేదా కుట్రతో కుళ్ళు బుద్ధితో  అందరికీ తెలియకుండా దాచి ఉంచి ఈ కలియుగంలో అందరూ సమానులే అనేది మనము గ్రహించకుండా మనలో మనకే వైషమ్యాలు పెంచి వారి వారి స్వలాభాలు పొందుతూ పబ్బం గడుపుకుంటున్నారు.

*లొసుగులు వెతికే వారికి సమాధానముగా కూడా ఇది చెప్పవలసి వస్తున్నది.*

యుగ యాగానికీ మనుష్యుల యొక్క శక్తి క్షీణిస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అన్నియుగములలో అన్నీ వర్ణాల వారూ తమ తమ స్వకర్మలను ఆచరించే వారు, వారిలో హెచ్చుతగ్గులు లేవు. కృత యుగములో మనుష్యులకు ఎక్కువ శక్తి ఉండడము చేత తపశ్చర్యలకు బ్రాహ్మణులు సరిపోవుదురు, త్రేతా యుగములో మనుష్యుల శక్తి కొంత క్షీణించి క్షత్రియులు కూడా తపాశ్చర్య చేయవలసి వచ్చినది. ద్వాపరయుగములో ఇంకొంత శక్తి క్షీణిస్తుంది కాబట్టి వైశ్యులు కూడా తప్శ్చర్య చేయవలసి వచ్చినది, కలియుగము వచ్చేసరికి మనుష్యుల శక్తి మరింత క్షీణించడము చేత అందరూ చేయగలిగిన తపశ్చర్య చేయవలసి ఉన్నది ధర్మము ద్వారా లోకములను కాపాడటము కొరకు.

దీని అర్ధము యే ముందు యుగాలలో మిగతా వారికి ఆ అర్హత లేదా అని కాదు, అవసరము లేదు అని. ఆనాటి వ్యవస్థ వివిధ కర్మలు పనులను బట్టి నడిచే వ్యవస్థలే కానీ రాజ్యాంగములు అనేక ఉద్యోగములు ఉండే వ్యవస్థ కాదు. అలాంటప్పుడు వివిధ పనులకు ఆయా వర్ణములలో వారు మాత్రమే ఆయా పనులు లేదా కర్మలు చేయడం అనేది విధ్యుక్తు ధర్మము లేకపోతే ఆనాటి వ్యవస్థలలో జన జీవనము అచిర కాలములలోనే స్తంభించి పోయేవి. కాబట్టి ఆ విధ్యుక్త ధర్మమును బట్టి ఆచరణ నిర్ణయింపబడి ఉన్నది దానివలనే సృష్టి మరియు మానవ మనుగడ ఆధారపడి ఉన్నది కాబట్టి.  అదే లేకుంటే ఈనాడు ఇవి మాట్లాడుకోడానికి ఇది చదవడానికి కూడా మనము ఈ విధముగా జీవించి ఉండి నాగరికత కలిగి ఉండే వాళ్ళము కాదు. ప్రపంచానికి నాగరికత నేర్పిన సంస్కృతీ సనాతన ధర్మము మనది.

యుగములు ఉన్నాయి అందులో ఆ యుగములో ఇలా జరిగింది అని ఎవరు మాట్లాడుతున్నా ఆయా యుగాలలో మనుష్యుల శక్తులను బట్టి ఆయా యుగలలో ఉండే వ్యవస్థలను బట్టి యుగ ధర్మాలు కూడా ఉంటాయని మనము తప్పక అంగీకరించవలసి ఉంటుంది. యుగాలు ఉంటాయి యుగ ధర్మాలు ఉంటాయి అని అంగీకరించను అని నాస్తికుడైనా లేదా ఇతర నమ్మకానికి చెందిన వాడైనా అనుకున్నప్పుడు అసలు ఈ విషయముల గూర్చి ప్రస్తావించే అర్హత కూడా ఉండదు, వారి ప్రస్తావన అప్పుడు అర్ధరహితము అవుతుంది. ఇది కనీసపు ఇంగిత జ్ఞానము. ఈనాడు ఈ కుతర్కములు చేసేవారికి అయితే ఆలోచనా లోపము కలిగి ఉండాలి లేదా విషయ పరిజ్ఞానము లేకుండాలి లేదా ఇంగిత జ్ఞానము అయినా లేకుండాలి లేదా అన్నీ ఉండి కుటిల పన్నాగాల కుళ్ళు బుద్ధి అయినా ఉండి ఉండాలి. అటువంటి వారికి విశ్లేషణగా ఇంగిత జ్ఞానమురా ఇది అని చూపిస్తూ బుద్ధి చెప్పాలి.

రామో విగ్రహవాన్ ధర్మః – మూర్తీభవించిన ధర్మాత్ముడైన రాముడు ఎవరు తనను నాకు వద్దే  వద్దనినా కానీ మీరు నన్ను వద్దనుకున్నా ధర్మముతో ఉండండి ధర్మములో జీవించండి నాకు అందరూ సమానులే మీకు నేనున్నాను అంటూ శ్రీ రామ రక్షను ప్రసాదిస్తున్నాడు.. అందునా తనను శరణు అనిన వారిని శరణాగత వత్సలుడైన రాముడు తప్పక తన రక్షణలో ఉంచుతాడు.

*నేను ఎంతో కాలముగా పరిశీలన చేసి విశ్లేషణ చేసిన విషయములు పూర్తిగా ఒక రోజు సమయము తీసుకుని రాసిన విషయములను లోకాభిరాముడి గూర్చిన విషయములు కనుక అందరూ అందరికీ చెప్పవచ్చును కానీ నా కృషిని కొంతైనా గుర్తించి నా పేరుని మార్చి మీ పేరులు వేసుకోవద్దని అది ధర్మము కాదని విజ్ఞప్తి. Share చేసుకోగలరు.*

*పలికిన వాడు మునిపల్లె జ్యోతీ స్వరూప్ పలికించిన వాడు పరమేశ్వరుడు*

శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష
🙏🙏🙏
శ్రీరామ జయరామ జయజయ రామ 🙏🙏🙏       
శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః 🙏🙏🙏

*రచయిత
జ్యోతి స్వరూప్ మునిపల్లె*

------------------------------------
Posted by: p_gopi_krishna@yahoo.com
------------------------------------

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.
------------------------------------

Yahoo Groups Links

Sat Jul 7, 2018 2:32 pm (PDT) . Posted by:

"ravi sarva" r_sarva

Sat Jul 7, 2018 5:46 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Whatever scriptures you may study, whatever spiritual efforts (sadhanas) you may practise or pilgrimages you may undertake, unless one succeeds in getting rid of the impurities in the heart, life will remain worthless and meaningless. Purification of the heart is the essence of all scriptural teachings and the basic goal of life. No spiritual study or sadhana can help in purifying your heart unless you makes the effort yourself. And when the heart is purified, it becomes a worthy abode for the Divine. Recognising this fact, the Bhagavad Gita has indicated a three-stage path to Divinity: engaging the body in good deeds, using the mind to develop good thoughts and human qualities, and contemplating on God through Upasana (worship of the Divine). Through this, any individual can reach the stage where, like a river joining the ocean, they merge in the Divine (Brahman).

Sat Jul 7, 2018 9:23 pm (PDT) . Posted by:

swamypvap

Eswara as Sava Vypakam and Anantam and Adviteeyam is Achintyam(beyond intellect).
As Eswara is Chidaananada Rupam and at the same time Eswara is unthinkable, one needs to contemplate on the sixteen virtues of Sri Rama as stated in Srimad Ramayanam by Maharshi Valmiki so as to undergo Eswara Vibhuti(Vimukta Deha Anubhuti)/Nitya Anandam
Thus Rama Charitam depicting the Mahaneeya Gunamulu of Rama as Dharma Swarupam/Maanava Dharmam is Chintyam(spiritual food for spiritual thought process) so as to realize Achintyam (Eswara/Atma). Thus Srimad Ramyanam is a unique signed Cheque showing Parama Artham as Rupees so as to realize/reach the destination Parama Padam(Param)/Eswara /Atma