www.telugubhakti.com Digest Number 4732

12 Messages

Digest #4732
2.1
Quotable Quote by p_gopi_krishna
2.2
Quotable Quote by p_gopi_krishna
3.1
Spiritual by p_gopi_krishna
3.2
Spiritual by p_gopi_krishna
3.3
Spiritual by p_gopi_krishna
4.1
Srimad Bhagavad Gita by p_gopi_krishna
7a
Guru Purnima by p_gopi_krishna
9.1
Sri Satya Sai Baba by p_gopi_krishna

Messages

Fri Jul 27, 2018 4:46 am (PDT) . Posted by:

telugubhaktipages

గురు స్తోత్రమ్
అఖణ్డమణ్డలాకారం వ్యాప్తం యేన చరాచరమ్,
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః.
చరాచర వ్యాప్తమైనది, అఖండమైనది, పూర్ణమైనది ఐన ఆ పరమాత్మ తత్త్వం కరతలామలకం చేసిన గురువర్యులకు వందనములు.


అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాఞ్జనశాలాకయా,
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః.
అజ్ఞానం చేత మా కళ్ళు చీకటి పొరలు కమ్మాయి. జ్ఞానాంజనంతో అజ్ఞానం తొలగించి మా కళ్ళు తెరిపించిన గురుదేవులకు మా నమస్కారములు.


గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః,
గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః.
గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువే పరమాత్మ. ఆ గురుదేవునకు మా నమస్సుమాంజలులు.


స్థావరం జంగమం వ్యాప్తం యత్ కిఞ్చిత్ సచరాచరమ్,
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః.
స్తావర జంగమాలలోనూ, చేతన అచేతనాల్లోనూ, చరాచర ప్రపంచమంతటా ఆ పరమాత్మను దర్శింపచేసిన ఆ పరమ గురువులకు మా ప్రణామములు.


చిన్మయం వ్యాపి యత్ సర్వం త్రైలోక్యం సచరాచరమ్,
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః.
త్రిలోకాల్లోనూ చిద్రూపంగా సర్వత్రా వ్యాపించిన అ భగవద్ తత్త్వాన్ని దర్శింప చేసిన ఆ గురుదేవునకు మా నమస్సుమాంజలులు.


సర్వశ్రుతిశిరోరత్న విరాజితపదాంబుజ,
వేదాంతాంబుజసూర్యో యః తస్మై శ్రీ గురవే నమః.
సర్వవేదాంత సారమనే రత్నాలను శిరస్సున ధరించిన వారు, వేదాంత కుసుమాలను వికసింప చేసే సూర్యుని వంటి తేజోరాశియైన మా గురువులకివే మా నమస్సుమాంజలులు.


చైతన్యః శాశ్వతః శాన్తో వ్యోమాతీతోనిరఞ్జనః,
బిన్దునాదకలాతీతస్తస్మై శ్రీగురవే నమః.
దేశ కాల వస్తువులకు అతీతమైనవారు, శుద్ధమూ, చైతన్య స్వరూపులు, ప్రశాంత చిత్తులు ఐన మా గురువులకివే ప్రణామములు.


జ్ఞానశక్తిసమారూఢస్తత్త్వమాలావి భూషితః,
భుక్తిముక్తిప్రదాతా చ తస్మై శ్రీగురవే నమః.
జ్ఞానమూ, శక్తి కలిగినవారు, తత్త్వమనే మాలను అలంకారముగా ధరించి మాకు జ్ఞానసంపద, ముక్తిని ప్రసాదించే మా గురుదేవులకు సాష్టాంగ నమస్కారములు.


అనేకజన్మసమ్ప్రాప్తకర్మ బన్ధనవిదాహినే,
ఆత్మజ్ఞానప్రదానేన తస్మై శ్రీగురవే నమః.
అనేక జన్మలనుంచి పోగుపడ్డ కర్మలను జ్ఞానాగ్నిచే దగ్ధం చేయించగల సమర్దుడైన మా గురు వరేణ్యులకు మా శతకోటి వందనములు.


శోషణం భవసిన్ధోశ్చ ప్రాపణం సారసమ్పదః,
గురో పాదోదకం సమ్యక్ తస్మై శ్రీగురవే నమః.
భవ సాగరాన్ని యింకింప చేయగల సమర్దుడూ, అపారమైన జ్ఞాన సంపదనొసగేవారు, మా గురువు. వారి పాదోదకం మమ్మల్ని సంసార బంధాల నుంచి తొలగిస్తుంది. మా గురువుల పాదపంకజములకు మా నమస్కారములు..


న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః,
తత్త్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః.
గురువును మించిన తత్త్వం లేదు. గురువాక్యాలపై అచంచల విశ్వాసమును మించిన తపస్సు లేదు. గురువుకు తెలియని తత్త్వజ్ఞానం లేదు. అటువంటి మా గురువులకు మా ప్రణామములు.


మన్నాథః శ్రీజగన్నాథో మద్గురుః శ్రీజగద్గురుః,
మదాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీగురవే నమః.
మా గురువే నాకు నాథుడు, అంతేకాదు జగత్తుకు కూడ నాథుడు. నా గురువు జగద్గురువు. నా ఆత్మే సర్వ భూతరాశిలోను నెలకొని ఉంది. ఈ తత్త్వం తెలియబరిచిన మా గురువరేణ్యులకు మా వందనాలు.


గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతమ్,
గురోః పరతరం నాస్తి తస్మై శ్రీగురవే నమః.
గురువే అన్నిటికి మూలం. గురువే పరమ దైవం. గురువును మించినది మరొకటి లేదు. ఆ గురుదేవులకు మా ప్రణామములు.


బ్రహ్మానన్దం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిమ్,
ద్వన్ద్వాతీతం గగనసదృశం తత్త్వమస్యాదిలక్ష్యమ్,
ఏకం నిత్యం విమలమచలం సర్వధీసాక్షీభూతమ్,
భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి.
తను బ్రహ్మానందమును అనుభవిస్తూ మమ్ములను ఆ బ్రహ్మానందాన్ని ఆనుభవింపచేసే మా గురువు, జ్ఞానానికి ప్రతీక, ద్వంద్వాలకి అతీతుడు,
ఆకాశం వలె అసంగులు, తత్త్వమసి మహావాక్యాలను ఆకళింపు చేసుకుని బ్రహ్మనిష్టలో ఉన్నవారు, ఏకం, నిత్యం, నిర్మలం, అచలం, సాక్షీభూతం, భావాతీతం, సత్వ రజ స్తమో గుణాలకు ఆతీతులు, సదా ఆత్మ యందే చరించువారు ఐన మా సద్గురువులకు ఇవే పాదాభివందనములు.


త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ,
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ్ సర్వం మమ దేవ దేవ.

హే గురో! తల్లీ నువ్వే, తండ్రి నువ్వే, బంధువు నువ్వే, మిత్రుడు నువ్వే, విద్యా నువ్వే, ధనం నువ్వే, నాకు సమస్తం నువ్వే గురుదేవా.


Fri Jul 27, 2018 1:26 pm (PDT) . Posted by:

p_gopi_krishna

The solution to the problem of suffering lies in understanding the Divine Will, by becoming aware of the Divine Presence and by sublimating ego, discarding anxious self-concern and having faith in Divine Love and Care. (Guru Granth Sahib)Fri Jul 27, 2018 1:38 pm (PDT) . Posted by:

p_gopi_krishna

"Discipleship is a golden key to blessedness if the disciple enables the guru to live and manifest through his personality and life. The light of the guru should shine through the disciple every moment of his living, wakeful life. Then, indeed, every moment the disciple will move forward and benefit himself. He will be the gainer and progress towards the great Goal. This is the truth about true discipleship—that one makes oneself a centre in and through which the guru manifests and shines." - Swami ChidanandaFri Jul 27, 2018 1:28 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Harih Om. Dayananda Panchakam, written in Honor of Pujya Swamiji by Swami Paramarthananda ji. Rendered beautifully by Vidita Kannikshttps://www.youtube.com/watch?v=yqxfKgZAT5s https://www.youtube.com/watch?v=yqxfKgZAT5sFri Jul 27, 2018 1:43 pm (PDT) . Posted by:

p_gopi_krishna

What is God? by Swami Dayananda Saraswati.


https://www.youtube.com/watch?v=rIsxGJw-ELM https://www.youtube.com/watch?v=rIsxGJw-ELMFri Jul 27, 2018 2:03 pm (PDT) . Posted by:

p_gopi_krishna

A WHOLE PERSON- NOT A SEEKER
- Pujya Swamiji Dayananda Saraswati: 'Who am I?' Part 4
Experientially, if I did not have the knowledge of being free, of being happy, I would not have been able to come to a judgment that I am unhappy. Nor could I ever say that all is not well with me. To make a judgment, I must have a norm. No judgment can be made without. An action is lawful or unlawful if there is a law. If there is no law, there is nothing lawful or unlawful. If I do not have the norm, I cannot judge whether something is good or bad

To judge, I must know what the standard is. Let us take the example of coffee. If I have a standard cup of coffee in my mind, I can judge whether this coffee that I am sipping is good coffee or bad coffee. If I have no standard for coffee in my view, how can I make a judgment about it?
If this is the first time that I am tasting coffee and the host asks me "how do you like this coffee" I would say "This is the first cup of coffee I am taking and I cannot make my judgement about it.. This is coffee; that is all I know". But if Ive had rounds of coffee and in my mind there is a standard, I can then judge a cup of coffee even from the smell of it. I need not even taste it. Why? Because I have a standard to judge I feel that everything is not well with me, that there is some lack, there is some want.
This sense of dissatisfaction itself reveals that I have some standard, I have an ideal. I know something as the most as the most desirable: and I know it only experientially. At those moments when I pick up joy I do see myself as a whole person and not a seeker any more. At that time the seeker-sought division resolves
I find myself to be one or non-dual. Nobody loves dvaita, duality. Mere presence of two things does not make dvaita. Husband and wife, even though they are two, do not make dvaita. It is only when they do not agree with each other that they create dvaita. My two hands also do not make dvaita, really speaking. We do not understand what dvaita is and what advaita is.
Anyway, at these moments of joy, I have this experience of seeing myself as a person who does not want anything. Hence I would like to be that person at other moments too. So I begin to struggle like that person.
It is something like an Indian musician, who renders a melody and has to reach the peak, the octave. He has reached that point, the panchama, or the 'pa' and now he has to make finally and the audience is also worked up. That svara is on the top the nisAda, the saptama. He wants to reach there, from panchama to saptama and for this he has already reached a platform. But now he feels there is a frog in his throat. He has a bad throat. He has elaborately prepared the ground. He thought that the threat would clear up and he would be able to reach. But now he finds that if he tries further he would screech. He does not want to spoil his name - being a good musician he cannot accept it. So he quietly comes down with a hope of preparing himself again for the same thing. Then his throat would be clear and he would reach the point. But again he finds he is not confident. Then do you know what he does? He simply raises his hand up and makes you all see, as if the svara is up there. You seem to be happy and he is also vicariously happy; for he knows his heights
Once you know your height, you cannot settle for anything less. That is what the struggle is about. Whether it is in cooking, in writing a letter, in writing an article, in doing a job or even in typing a letter- once you know your height, you cannot settle for anything less, because you know you can do better. You have done better in the past.
She has cooked so well, no doubt, that everybody praises her cooking. But she is shy because she knows her height. Others do not know. For them this is fine. But she has done better in the past and therefore cannot really accept these praises. She just shies away. Once we know our height we cannot settle for anything less.Fri Jul 27, 2018 1:41 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Helping one person may not change the world, but it can change that person's world
When we aspire to become an agent of positive change in the world, our mind internally and our acquaintances externally may discourage us, "What can you alone do? The world is such a big, bad place."
However, the world is not some amorphous, evil abstraction; it is made of people, all essentially like us. If we can help even one of them, at least their world will change.
While helping others, the Gita reveals how we can be a part of a plan far bigger than us. Though we can help people in various valuable ways, we can help them best by connecting them with the one who can offer the greatest help, Krishna. We all are his parts, and he is everyone's greatest benefactor. If we play our role as his parts by serving him and by helping others to connect with him, he can act through us, empowering us far beyond our finite capacities. On realizing that we can be a part of a divine master plan, we feel sublimely energized in our efforts to help others. Even if we can help one person by connecting them with Krishna, their world will change. Pertinently, the Gita (18.68) lauds those who share its message of divine love that inspires people to connect with Krishna.
What if people aren't receptive to the Gita? If they just hear its message even once, in their heart will be planted a spiritual seed that will blossom sooner or later. More importantly for us, we ourselves will be enriched by the deep contemplation necessary for sharing its message – as happened to Sanjaya on sharing the Gita with unreceptive Dhritarashtra (18.76).
Thus, studying, savoring and sharing the Gita empower us to change the world, one person's world at a time.
Think it over:
How can we avoid discouragement while trying to be an agent of change in the world?

While helping others, how can we be a part of bigger plan?

If people aren't receptive to the Gita, how is sharing its message still beneficial?

Read more https://www.gitadaily.com/helping-one-person-may-not-change-the-world-but-it-can-change-that-persons-world/ https://www.gitadaily.com/helping-one-person-may-not-change-the-world-but-it-can-change-that-persons-world/Fri Jul 27, 2018 2:04 pm (PDT) . Posted by:

p_gopi_krishna

దర్భను ఎందుకు పవిత్రమైనదిగా ప్రతిపాదిస్తారు ...
🌾దర్భ యొక్క ప్రాముఖ్యం🌾
*************************
మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన "దర్భ" ముఖ్యమయినది. ఈ దర్భలో చాలా జాతులున్నాయి.
(i) దర్భ జాతి దర్భను #అపరకర్మలకు https://www.facebook.com/hashtag/%E0%B0%85%E0%B0%AA%E0%B0%B0%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81?source=feed_text,
(ii) కుశజాతి దర్భను #శుకర్మలకు https://www.facebook.com/hashtag/%E0%B0%B6%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81?source=feed_text,
(iii) బర్హిస్సు జాతి దర్భను #యజ్ఞయాగాది https://www.facebook.com/hashtag/%E0%B0%AF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%AF%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE%E0%B0%A6%E0%B0%BF?source=feed_text శ్రౌత క్రతువులకు,
(iv) శరము (రెల్లు) జాతి దర్భను #గృహనిర్మాణాలకు https://www.facebook.com/hashtag/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81?source=feed_text వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు.
(1) కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది..
(2) వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువుశరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి ,భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
#వీటికి_దేన్నయినా_శుద్ధిచేసేశక్తి_ఉందనినమ్మిక https://www.facebook.com/hashtag/%E0%B0%B5%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF_%E0%B0%A6%E0%B1%87%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%B6%E0%B1%81%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B1%87%E0%B0%B6%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF_%E0%B0%89%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%BF%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BF%E0%B0%95?source=feed_text.
ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు.
అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.
అసలు దర్భ అన్న పదం వినగానే మనకు గుర్తుకొచ్చేది #గ్రహణకాలం https://www.facebook.com/hashtag/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%A3%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%82?source=feed_text. ఆ సమయంలో అన్నిటి మీదా #దర్భను_ఉంచడం_మనకు_అలవాటు https://www.facebook.com/hashtag/%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%A8%E0%B1%81_%E0%B0%89%E0%B0%82%E0%B0%9A%E0%B0%A1%E0%B0%82_%E0%B0%AE%E0%B0%A8%E0%B0%95%E0%B1%81_%E0%B0%85%E0%B0%B2%E0%B0%B5%E0%B0%BE%E0%B0%9F%E0%B1%81?source=feed_text.
కానీ అలా చేయటం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటంటే::::
సూర్య, చంద్రగ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రంనిరూపిస్తోంది. ఇలాంటి #వ్యతిరేక_కిరణాలు https://www.facebook.com/hashtag/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B1%87%E0%B0%95_%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81?source=feed_text దర్భల కట్టల #మధ్యలోంచిదూరివెళ్ళలేకపోతున్నాయని https://www.facebook.com/hashtag/%E0%B0%AE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%B2%E0%B1%8B%E0%B0%82%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A6%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF%E0%B0%B5%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%B2%E0%B1%87%E0%B0%95%E0%B0%AA%E0%B1%8B%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A8%E0%B0%BF?source=feed_textఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది.
అందుకే ఆఫ్రికా ప్రాంతంలోని కొన్ని ఆటవిక జాతులు తమ #గృహాలను https://www.facebook.com/hashtag/%E0%B0%97%E0%B1%83%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81?source=feed_text పూర్తిగా దర్భగడ్డితోనే నిర్మించుకుంటున్నారు.
ఈ విషయాన్ని మన సనాతన మహర్షులు గూడా గుర్తించి, గ్రహణ సమయంలో, ముఖ్యంగా సూర్యగ్రహణ సమయంలో ఇళ్ళ కప్పులను #దర్భగడ్డితోకప్పుకొమ్మని_శాసనం https://www.facebook.com/hashtag/%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%97%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B%E0%B0%95%E0%B0%AA%E0%B1%8D%E0%B0%AA%E0%B1%81%E0%B0%95%E0%B1%8A%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%A8%E0%B0%BF_%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B0%A8%E0%B0%82?source=feed_text చేశారు (బహుశా అందుకనే గడ్డితో ఇంటి పైకప్పుని ఎక్కువగా కప్పుకునేవారు). కాలక్రమంలో ఆ శాసనం మార్పులు చెంది, ఇంటి మధ్యలో రెండు దర్భ పరకలు పరచుకొని తూ తూ మంత్రంలా కానిచ్చేస్తున్నారు.
ఇలాకాక, కనీసం #పిడికెడు_దర్భలైనా_ప్రతివ్యక్తీ_గ్రహణసమయాలలో_శిరస్సుమీద https://www.facebook.com/hashtag/%E0%B0%AA%E0%B0%BF%E0%B0%A1%E0%B0%BF%E0%B0%95%E0%B1%86%E0%B0%A1%E0%B1%81_%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AD%E0%B0%B2%E0%B1%88%E0%B0%A8%E0%B0%BE_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%95%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B9%E0%B0%A3%E0%B0%B8%E0%B0%AE%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8B_%E0%B0%B6%E0%B0%BF%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%81%E0%B0%AE%E0%B1%80%E0%B0%A6?source=feed_text కప్పుకొంటే, #చెడుకిరణాల https://www.facebook.com/hashtag/%E0%B0%9A%E0%B1%86%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%BF%E0%B0%B0%E0%B0%A3%E0%B0%BE%E0%B0%B2?source=feed_text ప్రభావం వుండదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట.
దీనికి కారణం దర్భల కొనలుతేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి.
"శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం అని భగవద్గీతలో చెప్పబడింది.
అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు.
అలానే తైత్తరీయోపనిషత్తులో బర్హిషావై ప్రజాపతి: అని ఉంది. అనగా బర్హిష అనే గడ్డిని పరిచి దాని పైన ప్రజలను ఉత్పన్నం చేయటం, వృద్ధి పరచటం చేసేవారని చెప్పబడింది.
ఋగ్వేదంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. ఈ రకమయిన గడ్డి ఎక్కువగా ఉండే ద్వీపాన్ని కుశ ద్వీపం అని కూడా అంటారు.
వీటిని గూర్చి మన వేమన గారు ఏమన్నారో చూడండి:
"దాతగానివాని తఱచుగా వేఁడినవాడుఁ
దాతయగునె వసుధలోనఅవురు
దర్భ యౌనె యబ్ధిలో ముంచిన
విశ్వదాభిరామ వినర వేమ!"
అనగా దానము అంటే ఎరుగని వాడిని ఎన్నిసార్లు అడిగినా వాడు దానము ఇస్తాడా? దాత అవుతాడా? అదే విధముగా ఇంటిపై కప్పు గడ్డిని పవిత్రమైన సముద్రములో ముంచినంత మాత్రాన దాని రూపు మారి దర్భ అవుతుందా? అని. కానీ ఇక్కడ ఇంటిపైకప్పు గడ్డి అన్నది రెల్లు గడ్డి కాదని గుర్తుంచుకోమని మనవి.
ఈ విధముగా దర్భలు ఆధ్యాత్మికతతో పాటూ సాహిత్యంలో కూడా చోటు సంపాదించుకున్నాయి.
(i) వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది.
(ii) చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని,
(iii) శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని,
(iv) అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని,
(v) పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది.
అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.
దర్భల కొనలు విడుదల చేసే తేజము - దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి.
"సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణింఅన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి.
ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు.
అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు. వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట.
ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది.
దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో #సత్వగుణం_పెరుగుతుంది https://www.facebook..com/hashtag/%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%97%E0%B1%81%E0%B0%A3%E0%B0%82_%E0%B0%AA%E0%B1%86%E0%B0%B0%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF?source=feed_text.
ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట.
వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:
"విరించినా సహోత్పన్న పరమేష్ఠి
నిసర్గజనుద సర్వాణి పాపాని .
దర్భ స్వస్తికరో భవ"
ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి.
దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయని నిందలు భరించినా అవి మాత్రం మనకు ఎన్నో విధాలుగా మంచి చేస్తూ, సహకరిస్తూనే ఉన్నాయి.


వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లోఉండేలా చూసుకోవడం మరువకండి.


Fri Jul 27, 2018 2:06 pm (PDT) . Posted by:

p_gopi_krishna

గురు పూర్ణిమ సందేశం
అంధకారంలో మగ్గుతున్న జీవులను ఉద్ధరించడం కోసం ఈశ్వరుడు ఈ సృష్టి చేశాడు. జీవుల కర్మక్షయం కోసం జన్మల పరంపరను ఏర్పరిచాడు. అన్నీ తానే చేసినా, తాను అన్నిటికి సాక్షిగా ఉండాలని, జీవుల మీద ప్రేమతో వారికి దగ్గరగా ఉండాలని అంతర్యామియై అంతటా, అన్నిటి యందు ఉన్నాడు. ఇది అర్దం చేసుకున్న జీవుడు, ఈ జీవితం భౌతికమైన సుఖాల కోసం కాదని, అంతర్యామియైన భగవానుని తెలుసుకోనుటకేనని నిశ్చయించుకుని ఆయనను వెతకడం ప్రారంభిస్తాడు. భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. మరి ఈశ్వరుని గురించి తెలిపే వారెవరు? నా గురించి ఏదైనా చెప్పుకుంటే నేనే చెప్పుకోవాలి. మీ గురించి చెప్పుకుంటే మీరే చెప్పుకోవాలి.. ఇతరులు మన గురించి చెప్తే, అది అసంపూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈశ్వరుని గురించి కూడా. అందుకే ఈశ్వరుడే రహస్యంగా గురు రూపంలో భూమిపై తిరుగుతూ, తన గురించి తెలుసుకోవాలనే తపన కలిగిన వారికి తన తత్వం చెప్తాడు. అందుకే శాస్త్రం 'ఈశ్వరః గురు రూపేణ గూఢఛ్ఛరతి భూతలే' అంటుంది. వారి వారి స్థాయిని అనుసరించి, వారి సంస్కారాన్ని అనుసరించి వారికి తగిన విధంగా అర్దమయ్యేలా తత్వం బోధ చేస్తాడు. అందుకే లోకంలో అనేకమంది గురువులు ఉన్నారు.

ఈశ్వరుడు ఒక్కో యుగంలో ఒక్కో మహాగురువుగా అవతరించాడు కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా.......... కానీ రాబోయే కలియుగాన్ని, అందులో మానవుల కష్టనష్టాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భగవానుడే ద్వాపరయుగాంతంలో వేదవ్యాస మహర్షిగా అవతరించారు. వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు. వేదాలను గ్రంధస్థం చేయుటయే కాక, అనేక మన్వంతరాలు, కల్పాలు, ఇతర సృష్టిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్న ధర్మసూక్ష్మాలను మానవాళికి అందించి, వారి ఉద్ధతి కోసం 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించారు. బ్రహ్మసూత్రాలను అందించారు. తాను బ్రహ్మనిష్ఠుడై ఉండీ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పటికి, మానవాళి మీద ప్రేమతో క్రిందకు దిగి వచ్చి ఈ రచనలు చేశారు. అంతమేలు చేసిన వ్యాసునికి కృతజ్ఞత ఆవిషకరించడం కోసమే వ్యాసజయంతిని వ్యాసపూర్ణిమగా, గురు పూర్ణిమగా జరుపుకుంటాం.
గురుపూర్ణిమ రోజున చేసే పూజ చేతనే వ్యాసుడు సంతృప్తి చెందుతాడా అంటే కాదనే చెప్పాలి. ఆయన అంత శ్రమపడి ఇచ్చిన వాటిని పాటించకుండా ఉంటే ఆయనకు ఎంత బాధ కలుగుతుంది? వ్యాసుడు ఇచ్చిన పురాణలను ఆకళింపు చేసుకుని నిత్య జీవితంలో అనుష్ఠించాలి. ధర్మాన్నే పాటించాలి. వేదాలను, పురాణేతిహాసాలను రక్షించుకోవాలి. అదే వ్యాసుడికి చేసే నిజమైన గురుపూజ. గురువు చెప్పినదాన్ని పాటించడం చేతనే గురువు సంతోషిస్తాడు. గురుపూర్ణిమ మనలో అలాంటి మార్పును తీసుకురావాలి. నేను ధర్మాన్నే పాటిస్తాను, ధర్మాన్ని రక్షిస్తాను అని సంకల్పించుకుని దాన్ని అమలుపరచాలి. అప్పుడే మనపై వేదవ్యాసమహర్షి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.
సద్గురు శివానందమూర్తి గారు మొదలగు అనేకమంది సిద్ధపురుషులు, యోగుల యొక్క అమృతవాక్కుల సమాహారం ఇది.
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః


గురుపూర్ణిమ విశిష్టత ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు..?
గుకారశ్చంధకారస్తు రుకారస్తన్ని రోధక:
అజ్జాన గ్రాసకం బ్రహ్మ గురురేవ న సంశయ: //
భాం: ''గు'' అంటే అంధకారం/ చీకటి అని అర్థం. ''రు'' అంటే తొలగించడం అని అర్థం. అజ్ఝానమనే చీకటిని తొలగించి గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదు.
అద్వితీయమైన గురు పరంపరలకు అలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే ఉత్కష్టమైన సంస్కతి మనది. గురుకుల విద్యా విధారనం అమలులో ఉన్న కాలంలో గురువులు దైవంతో సమానంగా పూజింపబడేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. నేటి కాలంలో అంతటి గొప్ప గురు శిష్య సంబంధాలు చాలా అరుదు.
గురిపూర్ణిమ ఎందుకు జరుపుకుంటాము?
ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణిమినాడు సప్తర్షులకు జ్ఝానబోధ చేశాడని శివపురాణం చెబుతున్నది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఝాన బోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతీ శంతనులకు జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను బుక్, యజుస్, సామ, అధర్వణ వేదాలుగా విభజించాడనీ ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురుస్కరించుకుని ఆషాడ పౌర్ణమి నాడు గురుపూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము.
గురుపౌర్ణమి విశిష్ఠత
గురుర్ర్బహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురుపౌర్ణమి' లేదా 'వ్యాసపౌర్ణమి' అని అంటారు.ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు.
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు.
అసలు ఈ ఆసాఢ శుద్ధపౌర్ణమి యొక్క విశిష్ఠత ఏమిటో? తెలుసుకుందాం. దీనికి ఒక చక్కని ప్రాచీన గాధకలదు.పూర్వం వారణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన సతీమణి పేరు 'వేదవతి'. వీరిరువురు ఎల్లప్పుడూ చక్కని ఆధ్యాత్మిక చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవించేవారు. ఇంకా సంతాన భాగ్యము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది.
ఒకనాడు వేదనిధికి ప్రతిరోజూ మధ్యాహ్న సమయమందు వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి స్నానానికై వస్తూ ఉంటారని తెలుస్తుంది. ఎలాగైనా సరే వ్యాసమహర్షి దర్శనం పొందాలని ప్రతిరోజు వేయికళ్ళతో వెతక నారంభిస్తాడు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి దర్శిస్తాడు. వెంటనే వేదనిధి వారి పాదాలను ఆశ్రయిస్తాడు. దానికి ఆ భిక్షువు చీదరించుకుని కసురుకుంటాడు. అయినా సరే పట్టిన పాదాలను మాత్రము విడువకుండా మహానుభావా తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుచేతనే మిమ్మల్ని శరణు పొందగోరుచున్నాను అంటాడు.
ఆ మాటలు విన్న ఆ భిక్షువు గంగానది ఒడ్డువైపునకు నలుదిశలా బిత్తరి చూపులు చూస్తూ, ఇంకాతనను ఎవరైనా చూస్తున్నారేమోనని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాయంగా చేరదీసి, ఏమి కావాలో కోరుకోమంటారు..ఈ క్రమంలో రేపు నా తండ్రిగారి పితృకార్యము. దానికి తమరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పక దయచేయాలని వేడుకుంటాడు. అందుకు ఆ మహర్షి వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరిస్తాడు..
అనంతరం ఎంతోసంతోషంగా ఇంటికి చేరుకున్న వేదనిధి తన సతీమణికి గంగానదీతీరాన జరిగిన వృత్తాంతమంతా వివరిస్తాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వారిగృహానికి విచ్చేసిన వ్యాస మహర్షిని ఆ దంపతులు సాదరంగా లోనికి ఆహ్వానించి అతిథి సత్కారము చేసి పూజిస్తారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాలు, పువ్వులను సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతోశుచిగా వంటకాలను సిద్ధపరిచి శ్రాద్ధవిధులను విధి విధానంగా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భగవానునికి సాష్టాంగ నమస్కారం చేస్తారు.
వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠులైన ఆ ముని శ్రేష్ఠుడు.. ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అంటాడు. ఎన్ని నోములు, వ్రతాలు చేసినా సంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదు. అని బదులు పలుకుతారు. అందుకు త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతి కలుగుతుందని ఆశీర్వదిస్తాడు. ఈ క్రమంలో వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసముని అనుగ్రహంతో సుఖసంతోషాలు, అంత్యమున విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.
కాబట్టి వ్యాసపూర్ణిమ రోజున ఆ మహామునిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదుముగాక! వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు. షిరిడీ సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.


#గురుపూర్ణిమ https://www.facebook.com/hashtag/%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A3%E0%B0%BF%E0%B0%AE?source=feed_text శుభాకాంక్షలు🙏
Fri Jul 27, 2018 2:07 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Guru Purnima
Gururbrahmaa gururvishnuh gururdevo Maheswarah |
Guruh-saakshaat parabrahma tasmai shrigurave namah |
Devotional worship of the Guru - the preceptor - is one of the most touching and elevating features of the Hindu cultural tradition. The auspicious moment of Vyaasa Poornima, chosen for observing this annual festival, is no less significant. It was the great sage Vyasa, son of a fisherwoman, who classified the accumulated spiritual knowledge of the Vedas under four heads - Rig, Yajur, Saama and Atharva. To him goes the credit of composing the authentic treatise of Brahma-sootras to explain the background of Vedas. He also wrote the eighteen Puranas, the stories of our great heroes and saints, to carry the spiritual and moral precepts contained therein to the common masses.
The greatest of epics of all times and of all climes - Mahaabhaarata - embodying the immortal song of God, the Bhagavad Geeta, also in it, is also the priceless gift of Vyasa. The Bhaagavata, the thrilling and devotional story of Sri Krishna, was also his contribution. It is in the fitness of things that Vyasa should be looked upon as the supreme preceptor of mankind. Offering of worship to him signifies the worship of all the preceptors of all times.
The Guru in the Hindu tradition is looked upon as an embodiment of God himself. For, it is through his grace and guidance that one reaches the highest state of wisdom and bliss. "My salutations to the Guru who is Brahma, Vishnu and Maheswara. The Guru is Parabrahma incarnate"
Various have been the great sages and saints who have been the spiritual and religious preceptors to countless individuals down the centuries. But is there any one who can be looked upon as the preceptor for the entire Hindu people - for all their past, present and future generations? Obviously, no individual can play that role. A human being is after all mortal and, however great, has his own limitations. He cannot be a permanent guide for the entire nation for all time to come. The preceptor for a whole society should be able to act as a perennial source of inspiration to the people, embodying the highest and the noblest national values and ethos. To the Hindu people, such a Guru can be no other than the sacred Bhagava Dhwaj.
No one knows when and how this flag came into being. It is an ancient as the Hindu people themselves. It has flown over the hermitages of the seers and sanyaasins and also over the celestial palaces of emperors. It ha flown triumphantly over the battlefields of freedom struggle and has symbolized the immortal spirit of freedom in the Hindu mind. It is the one supreme symbol held in universal reverence by all sects and castes, and all creeds and faiths of the Hindu people. It is in fact the greatest unifying symbol of the entire Hindu world.
The color of the Bhagava Dhwaj - the saffron, depicting renunciation and service, epitomizes the culture of Bharat. The flames rising from the yajna are saffron in color and indeed reflect this spirit. The concept of yajna is extraordinarily unique to Hindu culture and tradition.. Yajna is not merely a physical ritual. That is only symbolic. The Bhagavad Geeta describes the concept of yajna as the sacrificial offering of one's self to the good of all beings. "Not mine, but thine" is the true message of yajna. Whatever one achieves in this life in terms of physical prosperity and knowledge, one has to offer them back to the society. The Ishaavaasya Upanishad declares:
Ishaa Vaasyamidam sarvam, yatkincha jagatyaam jagat |
Tena tyaktena bhunjeethaah maa gridhah kasyaswiddhanam ||
"God is the lord of all creation. After offering to Him, enjoy only that which is left over by Him. Do not rob what belongs to others."
Acquiring of wealth is no sin but utilizing all of it for one's own self and one's own family is very much so. In the Bhagavad Geeta Sri Krishna warns: "He who eats all by himself without first offering to others eats only sin". However much one may earn, only the minimum things necessary for one's physical sustenance have to be utilized and the rest offered in service to the society. This is the Hindu way of tackling the challenge of harmonizing economic progress with social justice. This attitude, even while giving full scope to individual initiative, effectively neutralizes the evils of individual capitalism. Also, while it ensures social justice for the lowliest in society, the tragedy of state capitalism of the communist type is obviated and the sanctity of individual freedom upheld.
The superiority of the concept of individual freedom implied in this trusteeship principle lies in its freedom to sacrifice for the social good with a high spiritual motivation, along with the commonly understood freedom to earn and acquire wealth. How is this transformation in individual's attitude to be effected?
"Herein comes the genius of the Hindu viewpoint which prepares the individual's mind for this adjustment. He is educated and enlightened with regard to the true nature of happiness. The goal that is kept before him is not merely one of physical enjoyment; that is not going to give him lasting happiness. For that, he has to rise beyond his dependence on the physical objects and plunge into the depths of his own being and discover the eternal and boundless ocean of joy and bliss within. He will then realize that the people around him are also manifestations of the same spirit and the enjoyment of the fruits of his labor by them is equivalent to his own enjoyment. It is against the background of this life-attitude that a balance could be achieved."
The pride of place given to men of sacrifice in the Hindu tradition was reflected in every stratum and aspect of life. The sages and saints, who had kept themselves away from the portals of pelf and power and had solely and wholly dedicated themselves to the temporal as well as spiritual enlightenment of the people, were looked upon as the leaders of par excellence of the society. They were in fact the lawgivers and the king was only the executive head to carry out those laws. This was how the political authority was held in check, and the moral and spiritual held sway in the affairs of the life of people.
The Upanishads declared -
Na karmanaa, na prajyaa dhanena tyaagenaike amritatwamaanashuh.
It is not through actions, progeny or wealth but through renunciation alone that immortality is attained. Needless to say, it is not the physical abandonment of these aspects of human life that is advocated here. It is mental detachment and a spirit of considering his family life, his wealth and all his actions as so many means of worshipping God in the form of society that is set forth as the ideal. It is this unique philosophical trait of renunciation and service which can form the basis for the highest evolution of the individual combined with the happiness, harmony and progress of the society as a whole.
The Bhagawa Dhwaj is the most resplendent emblem of this sublime philosophy.. And, worship of this holy flag on this Guru Poornima Day is intended to instil in us this positive Hindu attitude towards life. The ceremonial worship of the flag through flowers accompanied by monetary offering is just an external expression of this attitude of surrender to the ideal. Real worship, for a Hindu, lies in becoming an image of the idea himself. Shivo bhootwa shivam yajet - one has to become Shiva Himself if one has to worship Shiva.
The annual function of Sri Guru Pooja presents a moment of introspection for us to check up how far we have progressed in this path over the last one year, and take lessons from it and resolve to march faster in the current year.


ramnath ramnath <ramnath1949@gmail.com>


Fri Jul 27, 2018 2:08 pm (PDT) . Posted by:

p_gopi_krishna

[vedānta-dharma] Guru Purnima Greetings
Harih Om!
Shastra instructs- tad vijñānārthaṁ sa gurum evābhigacchet samit-pāṇiḥ śrotriyam brahma-niṣṭhama. Immensely grateful to these Gurus whom I would like to Honor today on Guru Purnima. Salutations to:

*Sri Dakshinamurti Bhagavan; Guru of all Gurus, the Primeval Teacher,
*Sri Adi Shankaracharya; Dakshinamurti bhagavan in human form who descended to re-establish our lost connection to ancient wisdom,
*Sringeri Jagadguru Sri Abhinavavidyateerth Mahaswamigal,
*Pujya Swami Dayananda Saraswati ji;
*Puri Jagadguru Swami Nischalananda ji;
*Maharajshri Akhandananda ji;
*Swami Divya Chaitanya ji,
*And to the one and only Sri Veda Vyasa, after whom this fond remembrance of Gurus (also known as Vyasa Purnima) is commemorated.
To them, who showered the nectar of advaita jnana and bhakti rasa upon us, koti koti pranam.
Prashant Parikh https://www.facebook.com/parikhprashant?fref=gs&dti=624552704316163&hc_location=group <prashantparikh@gmail.com>
vedanta-study@googlegroups.comFri Jul 27, 2018 4:48 pm (PDT) . Posted by:

p_gopi_krishna

Once you have secured a Guru, leave everything to him, even the desire to achieve liberation. He knows you more than you yourself ever can. He will direct you as much as is good for you. Your duty is only to obey and to smother the tendency to drift away from Him. There is no need then for getting a Name or mantra from the Guru and repeating it. The command of the Guru or the Lord is even more important than the Name of the Guru or the Name of the Lord. Of what use is the repetition of the Name, without at the same time purifying the impulses by the observance of His commands. You must make the best use of the Guru, as you must of this Puttaparthi itself.. You must acquire here the skills for winning shanti and santosha (peace of mind and bliss), the grace of God, the lessons of spiritual practices, and the fruits of satsang (company of the holy); do not fritter away your energy and time, seeking sensory satisfaction in ungodly company. Sri Satya Sai Babawww.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.