[racchabanda] మరువరాదు...

 

మరువరాదు...

--------------------

సీ.

--

పలుకుతల్లిని నేను నలువ రాణిని నేను 
కలువకంటిని నేను దెలివి నేను
--
చెలఁగు శక్తిని నేను శివుని చెల్వను నేను
మలయవాసిని నేను మహిమ నేను 
--
జలధికన్యక నేను చక్రి రామను నేను
కలుములమ్మను నేను జెలువు నేను
--
అలరి యందఱు నైన యాదిశక్తియు నేను
తెలియఁజాలఁగలేని వెలుఁగునేను

--
ఆ.వె.
--

నిలిచియుందునేను నిత్యమై సత్యమై
కలఁత లేక దేని వలనఁ గాని
పలువిధాలనేను బ్రకటించుకొనుచున్నఁ
దలఁపులందుఁ గూడ మెలఁగుచుందు

--

మార్గదర్శినౌదు మహినెల్ల జనులకు 
దుర్గమాంబనగుదు దునుమ ఖలుల 
భర్గుఁడైన మెచ్చు వైనమే నిత్యమ్ము
వర్గభేదమెంచు ప్రకృతి లేదు

--

ఎట్టి రూపు నైన నెలమిఁ గొల్వఁగవచ్చుఁ
గట్టలేరు గాని పట్టి నన్ను
పెట్టవచ్చుఁ దినఁగఁ బ్రేమతో నున్నదే
తిట్టఁ బలురకాలఁ బెట్టకున్న

--
తే.గీ.
--

భక్తులున్నట్టి చోట నావాసముందు 
శక్తి కొలఁదిగఁ బూజించ సంతసమ్ము
భక్తి భావన లేకున్న భజన వృథయె
భక్తవత్సల నేనన్న పలుకు నిజము

--

సర్వ మతముల సారమ్ము సత్యమగును
సర్వజన హితమెంచుటే సమ్మతమ్ము
ఉర్విజనులకుఁ బీడగా నుండువారి 
గర్వమంతయు నాశమౌ కాలగతిని

--

గురుత మీఱఁగ నడువక గుణయుతులయి
ధరకుఁ జేటును గూర్చుట తగని విధము
నరకుఁడేగిన దారినే యరుగఁగలరు
చరిత నేర్పెడి పాఠాలు మరువ రాదు

--

12:27 PM
08-01-2018

--

** పలికించే శక్తి చెప్పిన మాటలు.

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] ఆపాతళికా-ప్రాచ్యవృత్త్యపరాంతికా #aapAtaLikA-prAchyavRttyaparAMtikA#

 

ఆపాతళికా-ప్రాచ్యవృత్త్యపరాంతికా - 

ఇందులో పూర్వార్ధములో 3+U+3 మాత్రలు, ఉత్తరార్ధములో భ/గగ గణములు. ఈ అమరికలు స్వాగతవృత్త వర్గమునకు చెందినవి. క్రింద మూడు విధములైన ప్రాచవృత్యపరాంతికలకు తేడాలు -

3+U+3 మాత్రలు + ర/లగ - వైతాళీయ-ప్రా.అ.
3+U+3 మాత్రలు + ర/య - ఔపచ్ఛందసికా-ప్రా.అ.
3+U+3 మాత్రలు + భ/గగ - ఆపాతళికా-ప్రా.అ. 

క్రింద నా ఉదాహరణములు - 

ఆపాతళికా-ప్రాచ్యవృత్త్యపరాంతికా - 3+U+3 మాత్రలు + భ/గగ

ధ్యానమందుఁ బ-ద్యమ్ములు నీవే 
ప్రాణమందు ను-చ్ఛ్వాసము నీవే 
వాణిలోని స-ద్వాక్కులు నీవే 
గానమందు గం-గాఝరి నీవే 

రాగవీణలో - రాగము నీవే
భోగశయ్యలో - మోహము నీవే 
యోగనిద్రలో - యుగ్మము నేనే 
వేగ రమ్మురా - వేంకటనాథా 

కనకమంజరీ - కానుక తేనా 
వినఁగఁ బాడనా - ప్రీతిగ గీత 
మ్మనుపమమ్ముగా - నందము చిందన్ 
ప్రణయదేవతా - ప్రాణసఖీ రా 

స్వాగతవృత్తమువలె ఒక అపరాంతిక - 

స్వాగతము - ర/న/భ/గగ UIUIII - UII UU
11 త్రిష్టుప్పు 443

స్వాగతించెదను - స్వామిని యీ సూ-
ర్యాగమంపు సొగ-సైన దినానన్ 
యోగనిద్ర యిఁక - యొప్పదు నీకున్ 
వేగ లెమ్మిలయు - వేచెను నీకై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aapAtaLikA-prAchyavRttyaparAMtikA - 

iMdulO pUrvArdhamulO 3+#U#+3 mAtralu, uttarArdhamulO bha/gaga gaNamulu. ee amarikalu svAgatavRtta vargamunaku cheMdinavi. kriMda mUDu vidhamulaina prAchavRtyaparAMtikalaku tEDAlu -

3+#U#+3 mAtralu + ra/laga - vaitALIya-prA.a.
3+#U#+3 mAtralu + ra/ya - aupachChaMdasikA-prA.a.
3+#U#+3 mAtralu + bha/gaga - aapAtaLikA-prA.a. 

kriMda nA udAharaNamulu - 

aapAtaLikA-prAchyavRttyaparAMtikA - 3+#U#+3 mAtralu + bha/gaga

dhyAnamaMdu@M ba-dyammulu nIvE 
prANamaMdu nu-chChvAsamu nIvE 
vANilOni sa-dvAkkulu nIvE 
gAnamaMdu gaM-gAjhari nIvE 

rAgavINalO - rAgamu nIvE
bhOgaSayyalO - mOhamu nIvE 
yOganidralO - yugmamu nEnE 
vEga rammurA - vEMkaTanAthA 

kanakamaMjarI - kAnuka tEnA 
vina@Mga@M bADanA - prItiga gIta 
mmanupamammugA - naMdamu chiMdan 
praNayadEvatA - prANasakhI rA 

svAgatavRttamuvale oka aparAMtika - 

svAgatamu - ra/na/bha/gaga #UIUIII - UII UU#
11 trishTuppu 443

svAgatiMchedanu - svAmini yI sU-
ryAgamaMpu soga-saina dinAnan 
yOganidra yi@Mka - yoppadu nIkun 
vEga lemmilayu - vEchenu nIkai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4736

7 Messages

Digest #4736
2
Ganapathi Prarthana by telugubhaktipages
3.1
Quotable Quote by p_gopi_krishna
3.2
Quotable Quote by p_gopi_krishna
3.3
Quotable Quote by p_gopi_krishna
3.4
Quotable Quote by p_gopi_krishna
4.1
Sri Satya Sai Baba by p_gopi_krishna

Messages

Tue Jul 31, 2018 5:43 am (PDT) . Posted by:

telugubhaktipages

ఏప్రిల్ 2009లో జరిగిన సంఘటన. నేను ఢిల్లీ నుంచి విమానంలో తిరిగి వస్తున్నాను. నా పక్కనే రామకృష్ణ మఠానికి చెందిన ఒక స్వామీజీ కూర్చుని ఉన్నారు. అటుపక్కన అమెరికాకు చెందిన ఒక విలేకరి ఉన్నారు. ముందుగా అనుకున్న ప్రకారం స్వామి పక్కన ఉన్న విలేకరి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు. విలేకరి: "స్వామీజీ ఇంతకుముందు మీరు ఇచ్చిన ఉపన్యాసంలో బంధాలు అనుబంధాల గురించి వివరించారు. నాకు సరిగా అర్థం కాలేదు మళ్ళీ వివరించగలరా?" దానికి స్వామీజీ నవ్వుతూ ప్రశ్నను దాటవేస్తూ విలేకరిని తిరిగి ఇలా ప్రశ్నించారు "మీరు న్యూయార్క్ నుంచి వస్తున్నారా?" విలేకరి: "అవును." స్వామీజీ : "మీ ఇంటిలో ఎవరుంటారు?" ఈ ప్రశ్న పూర్తిగా వ్యక్తిగతము మరియు అసంబద్ధం కావడంతో విలేకరి స్వామీజీ తన ప్రశ్నను దాటవేస్తున్నారు అనుకున్నారు.. అయినప్పటికీ విలేకరి చెప్పసాగాడు "అమ్మ చనిపోయారు. నాన్న అక్కడే ఉంటున్నారు. ఇంకా నాకు ముగ్గురు సోదరులు, ఒక సోదరి ఉన్నారు. అందరికీ వివాహం అయింది." ముఖంలో చిరునవ్వు చెదిరిపోకుండా స్వామీజీ గారు మళ్లీ ఇలా అడిగారు "నీవు మీ నాన్నగారితో మాట్లాడుతున్నావా?" విలేకరి ముఖకవళికలు మారటం మొదలైంది. స్వామీజీ: "ఆఖరిసారి ఎప్పుడు మాట్లాడావు?" జేవురించిన ముఖంతో విలేకరి ఇలా చెప్పాడు "సుమారు ఒక నెల అయి ఉండొచ్చు.". స్వామి గారి ప్రశ్నల పరంపర కొనసాగింది. "మీ అన్న చెల్లెళ్ళ ను ఎంత తరచుగా కలుసుకుంటారు? ఆఖరిసారిగా కుటుంబమంతా ఎప్పుడు కలిసి ఉన్నారు?" ఆ సమయంలో విలేకరి నుదుట నుంచి చెమట కారణం స్పష్టంగా కనిపించింది. అక్కడ ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నారో అర్థం కాకుండా ఉంది. స్వామీజీ నా? లేక విలేకరా? నాకైతే స్వామీజీ విలేకరిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా అనిపించింది. ఒక నిట్టూర్పు తో విలేకరి చెప్పాడు "సుమారు రెండు సంవత్సరాల క్రితం … క్రిస్మస్ సందర్భంలో మేమందరము కలిశాము." స్వామీజీ : "మీరందరూ కలిసి ఎన్ని రోజులు ఉన్నారు?" నుదుటన స్వేదబిందువులు తుడుచుకుంటూ విలేకరి అన్నాడు "మూడురోజులు." స్వామీజీ : "ఎంతకాలం మీ నాన్నగారితో గడిపావు? ఆయన పక్కనే ఎంతకాలం కూర్చున్నావు?" ముఖం కందగడ్డలా మారిన విలేకరి కాగితంపై పిచ్చిగీతలు గీయడం మొదలుపెట్టాడు. స్వామీజీ : "నీవు ఎప్పుడైనా మీ నాన్నగారితో కలిసి భోజనంచేసావా? ఆయన ఎలా ఉన్నారని ఎప్పుడైనా అడిగావా? మీ తల్లి చనిపోయిన తర్వాత ఆయన రోజులు ఎలా గడుపుతున్నారో అడిగావా?" విలేకరి కంటినుంచి కన్నీరు కారటం స్పష్టంగా కనిపించింది. అప్పుడు స్వామీజీ విలేకరి చేతిని ప్రేమతో అందుకని ఇలా అన్నారు "బాధపడకు. నిన్ను తెలియకుండా బాధించి ఉంటే క్షమించు. కానీ నీవడిగిన బంధం అనుబంధాలకు సమాధానం ఇదే. మీ నాన్నగారితో నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు. అనుబంధం అంటే హృదయానికి హృదయం కలిసిపోవడం. కలిసి ఉండడం. కలిసి భోజనం చేయడం. ఒకరిపై ఒకరు ప్రేమ చూపించడం; స్పర్శించటం.. చేతులు కలపడం… కళ్ళలోకి సూటిగా చూడగలగటం… కలిసి సమయాన్ని గడపడం. మీ సోదరులందరితో కూడా నీకు బంధం ఉంది. కానీ అనుబంధం లేదు." ఆ విలేకరి కన్నీళ్ళు తుడుచుకుంటూ స్వామీజీతో అన్నారు "బంధం అనుబంధాల గురించి ఇంత అద్భుతమైన బోధన చేసినందుకు ధన్యవాదాలు."
ఇదీ నేటి వాస్తవికత. సమాజంలో గానీ, ఇంటిలోగానీ అందరికీ బోలెడు బంధాలు ఉన్నాయి. కానీ అనుబంధాలు కనుమరుగయ్యాయి. ఎవరితో ఎవరికీ సంబంధం లేకుండా, ఎవరి ప్రపంచంలో వారు జీవిస్తున్నారు. మనం కూడా బంధాలకు కాకుండా అనుబంధాలకు ప్రాముఖ్యతను ఇద్దాం. పరస్పర ఆప్యాయతలతో కలిసి మెలిసి ఉందాం,

వాట్సాప్ లో వచ్చిన ఒక ఆంగ్ల సందేశానికి తెలుగు అనువాదం


Tue Jul 31, 2018 6:15 am (PDT) . Posted by:

telugubhaktipages


శ్రీగణపతి ప్రార్థన
ఓం గణానాం త్వా గణపతిగ్‌ం హవామహే
కవిం కవీనాముపమశ్రవస్తమమ్‌|
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆ నః
శ్రుణ్వన్నూతిభిస్సీద సాదనమ్‌||
ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ|
ధీనామవిత్య్రవతు| గణేశాయనమః|
సరస్వత్యైనమః| శ్రీ గురుభ్యోనమః|
హరిః ఓమ్‌ ||
ఓం శాంతిః శాంతిః శాంతిః

త్వా హవా మహే = నిన్ను కీర్తించి, ఆహ్వానిస్తున్నాము.
గణానాం గణపతిమ్‌ = గణాలలో గణపతివి.
కవిః కవీనామ్‌ = మేధావులలో మేధావంతుడవు..
ఉపమ శ్రవః తమమ్‌ = సాటిలేని ఖ్యాతి గలవాడవు.
జ్యేష్ఠరాజమ్‌ = ప్రధానులలో శ్రేష్ఠతముడవు.
బ్రహ్మణాం బ్రహ్మణస్పతః = వేదాలలో వేదనాయకుడవు.
ఆ నః శృణ్వన్‌ ఊతిభిః సీదసానమ్‌ = ఇక్కడకు వేంచేసి మా ప్రార్థనలు విని సత్వరం మమ్ములను కాపాడుము.
మహాగణపతియే నమః = మహాగణపతికి నమస్కారము.
వాజేభిః వాజినీవతీ = ప్రణమిల్లే వారిని కాపాడేదానవు
దేవీ సరస్వతీ = సరస్వతీ దేవీ
ప్రనః = మమ్ములను కాపాడాలి
ధీనాం అవిత్య్రవతు = మా ధీః శక్తిని జాగృతం చేయుగాక.

హే గణనాథా! నిన్ను కీర్తించి, ఆహ్వానిస్తున్నాము. నువ్వు గణాలలో గణపతివి. మేధావులలో మేధావంతుడవు. సాటిలేని మేటి ఖ్యాతి గలవాడవు. ప్రధానులలో శ్రేష్ఠతముడవు. వేదాలలో వేదనాయకుడవు. ఇక్కడకు వేంచేసి మా ప్రార్థనలు విని సత్వరం మమ్ములను కాపాడుము.మహాగణపతికి నమస్కారము.

సరస్వతీ దేవీ! ప్రణమిల్లే వారిని కాపాడేదానవు. మమ్ములను కాపాడాలి.మా ధీః శక్తిని జాగృతం చేయుగాక. మా గురుదేవులకు నమస్కారములు.
ఓం శాంతి శాంతి శాంతి

Tue Jul 31, 2018 9:39 am (PDT) . Posted by:

p_gopi_krishna

DON'T BROOD OVER THE PAST. DON'T CARE FOR THE MORROW. DON'T PLAN YOUR FUTURE. DON'T EXPECT, DON'T HOPE. DON'T BUILD CASTLES IN THE AIR. (Swami Sivananda)
जो बीत गया, उस पर शोक मत करो। कल के लिए विचार न करो। भविष्य की योजना मत बनाओ। कोई चाहत मत रखो, न ही कोई आशा। कल्पनाओं के किले न बांधो।Tue Jul 31, 2018 10:53 am (PDT) . Posted by:

p_gopi_krishna

Life is just like a sea,

we are moving without end.

Nothing stays with us,

what remain is just the

memories of some people


who touched us as Waves.Tue Jul 31, 2018 10:57 am (PDT) . Posted by:

p_gopi_krishna

YOU R BLESSED ALWAYS
You may not have the house, car or job

that you want --- but you know you are still

blessed.
You may not have someone to call you

sweetheart --- but you know you are still blessed,

worthy and whole.
You may not like the way your body feels or looks

right now --- but you know you are still blessed and

beautiful.
You may be achieving slow progress with your

goal --- but you still feel determined.
You may find fault in yourself and others --- and

yet, you continue to teach your heart to heal and

live with wisdom, discernment and love.You may struggle with issues of anger,

resentment, depression or worry --- but you know

you are too blessed to be stressed.
You may feel stuck between "when and why" ---

and yet, you remain grateful, hopeful and

proactive.
People may misunderstand you, drain you,

criticize you or ignore you --- and yet, your self-

esteem, courage and peace of mind


remain in tact.Tue Jul 31, 2018 11:54 am (PDT) . Posted by:

p_gopi_krishna

One of the handicaps that have to be overcome is weak faith in oneself (Avishwasam). Today you gladly and willingly place all faith in the body and its accessories but not in your inner motivator, the charioteer. In particular, youth today have faith in unreal, transient, momentary pleasures and pastimes. They have no knowledge of the eternal, the changeless, and the ever-blissful. Precious years of life are thus wasted in worthless pursuits. That is why your faith falters when even a minor calamity happens! Contemplate deeply on the impermanence of wealth, fame, worldly friendship, and so on. Cultivate faith in the value of service; believe that love can overcome hatred. Have faith in righteousness and the moral life. This is called righteous living (dharma). Never stray into wrong paths, enticed by sensual desires and plans for self-aggrandisement. Sri Satya Sai Baba.www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] ఔపచ్ఛందసికా-ప్రాచ్యవృత్యపరాంతికా #aupachChaMdasikA-prAchyavRtyaparAMtikA#

 

ఔపచ్ఛందసికా-ప్రాచ్యవృత్యపరాంతికా - 

ఇది ఒక సమ చతుష్పది. ప్రతి పాదములో 3+U+3 మాత్రలు + ర/య గణములు. క్రింద నా ఉదాహరణములు - 

ఔపచ్ఛందసికా-ప్రాచ్యవృత్యపరాంతికా - 3+U+3 + ర/య

సందెవేళ యిది - చైత్రమాసమందున్
వంద రంగు లట - భానువీథిలోనన్ 
సుందరమ్ము గన - సోయగమ్మె యెందున్ 
నందనందనుని - నామనస్సు దల్చెన్ 

కరుణలేని యిల - కాటువేయుఁగాదా 
తరుణ మెప్పుడో - తప్పకుండ వచ్చున్ 
విరస జీవముల్ - వేగ నిండుఁ గాంతిన్ 
దెరువులందుఁ గడు - తెల్లనైన దివ్వెల్ 

మఱలఁ బిల్చునని - మానసమ్ము వేచెన్ 
హరుస మిచ్చునని - యంతరంగ మెంచెన్ 
విరుల మాల నిటఁ - బ్రేమతోడ నల్లన్ 
దరుణుఁ డెక్కడే - తామసమ్ము లేలా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aupachChaMdasikA-prAchyavRtyaparAMtikA - 

idi oka sama chatushpadi. prati pAdamulO 3+#U#+3 mAtralu + ra/ya gaNamulu. kriMda nA udAharaNamulu - 

aupachChaMdasikA-prAchyavRtyaparAMtikA - 3+#U#+3 + ra/ya

saMdevELa yidi - chaitramAsamaMdun
vaMda raMgu laTa - bhAnuvIthilOnan 
suMdarammu gana - sOyagamme yeMdun 
naMdanaMdanuni - nAmanassu dalchen 

karuNalEni yila - kATuvEyu@MgAdA 
taruNa meppuDO - tappakuMDa vachchun 
virasa jIvamul - vEga niMDu@M gAMtin 
deruvulaMdu@M gaDu - tellanaina divvel 

ma~rala@M bilchunani - mAnasammu vEchen 
harusa michchunani - yaMtaraMga meMchen 
virula mAla niTa@M - brEmatODa nallan 
daruNu@M DekkaDE - tAmasammu lElA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___