[racchabanda] ఆపాతళికా ఉదీచ్యవృత్తి #aapAtaLikA udIchyavRtti#

 

ఆపాతళికా ఉదీచ్యవృత్తి - 

బేసి పాదములు - IUIU లేక IUIII + భ/గగ 
సరి పాదములు - 8 మాత్రలు + భ/గగ 

విరాజితము - ప్రేమయు నీపై 
సరసిజలోచన - చారు శుభాంగీ 
వరమ్ము లా - వాణిని గీతుల్ 
సురుచిర దేహా - సుందర రూపా 

మధూదయము - మానిని నీకై 
ముదమిడు పూవులు - ముచ్చట భంగుల్ 
ప్రదర్శనము - రమ్యము గాదా 
హృదయము నిండెను - హృద్యము రంగుల్ 

సుకమ్ము లీ - సొంపున లేవే 
వికలము డెందము - వేదన మెండై 
వికాసమున - వెల్గులు నిండన్ 
సకియ వసంతము - సంతస మీదే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aapAtaLikA udIchyavRtti - 

bEsi pAdamulu - #IUIU# lEka #IUIII# + bha/gaga 
sari pAdamulu - 8 mAtralu + bha/gaga 

virAjitamu - prEmayu nIpai 
sarasijalOchana - chAru SubhAMgI 
varammu lA - vANini gItul 
suruchira dEhA - suMdara rUpA 

madhUdayamu - mAnini nIkai 
mudamiDu pUvulu - muchchaTa bhaMgul 
pradarSanamu - ramyamu gAdA 
hRdayamu niMDenu - hRdyamu raMgul 

sukammu lI - soMpuna lEvE 
vikalamu DeMdamu - vEdana meMDai 
vikAsamuna - velgulu niMDan 
sakiya vasaMtamu - saMtasa mIdE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4738

1 Message

Digest #4738

Message

Fri Aug 3, 2018 5:08 pm (PDT) . Posted by:

telugubhaktipages

దుర్గా సూక్తం
ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేదః|
స నః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాఽత్యగ్నిః||
జాతవేదసే సునవామ సోమ = అగ్నిదేవా సోమరసాన్ని పిండి అర్పిస్తాము.
వేదః అరాతీయతః నిదహాతి = అగ్ని దేవుడు మా అడ్డంకులను తొలగించు గాక.
నావా సింధుం ఇవ నః విశ్వా దుర్గాణి పర్షదతి = సముద్రాన్ని పడవ ఎలా దాటిస్తుందో అలా దుర్గాదేవి మమ్మల్ని కష్టాలనుంచి దాటించు గాక.
అగ్నిః దురితా అతి = అగ్నిదేవుడు మమ్మల్ని సమస్త పాపముల నుంచి గట్టెంకించాలి.
జాతం జాతం వేత్తి ఇతి జాతవేదః. పుట్టిన ప్రతివాడి గురించి తెలిసిన వాడు జాతవేదుడు. అగ్ని దేవుడు అందరి శరీరాలలోను ఉష్ణరూపంలో ఉండి కాపాడేవాడు. జాతవేదాః! నీకు సోమరసాన్ని పిండి అర్పిస్తాము. అగ్ని దేవుడు మా అడ్డంకులను తొలగించు గాక. అగ్నిదేవుడు మమ్మల్ని సమస్త పాపముల నుంచి గట్టెంకించాలి. సముద్రాన్ని పడవ ఎలా దాటిస్తుందో అలా దుర్గాదేవి మమ్మల్ని కష్టాలనుంచి దాటించు గాక.


తామగ్నివర్షాం తపసా జ్వలతీం వైరోచనీ కర్మఫలేషు జుష్టామ్‌||
దుర్గాం దేవీగ్ం శరణమహం ప్రపద్యే సుతసితసే తరసే నమః||
అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం = అగ్ని వర్ణం గలది, తపస్సు ద్వారా ప్రకాశించేదీ, భగవంతునకు చెందినది,
కర్మఫలేషు జుష్టామ్‌ దుర్గాం దేవీ = కర్మ ఫలాల్లో శక్తిగా నెలకొన్న దుర్గామాతను,
అహం ప్రపద్యే = నేను వేడుకొంటున్నాను.
తరసే సుతరసి నమః = తీరానికి చేర్చే ఓ మాతా నన్ను కడతేర్చు, నీకివే నా నమస్కారాములు.
అగ్ని వర్ణం గలది తపస్సు ద్వారా ప్రకాశించేదీ, భగవంతునకు చెందినది, కర్మ ఫలాలనివ్వడంలో శక్తిగా నెలకొన్న దుర్గామాతను, నేను వేడుకొంటున్నాను. తీరానికి చేర్చే ఓ మాతా నన్ను కడతేర్చు, నీకివే నా నమస్కారాములు..


అగ్నే త్వం పారయా నవ్యో అస్మాంథ్సస్తిభిరతి దుర్గాణి విశ్వా|
పూశ్చ పృథ్వి బహులా న ఉర్వీ భవా తోకాయ తనయాయ శంయోః||
అగ్నే త్వం నవ్యః = హే అగ్నిదేవా! నువ్వు కీర్తింప తగిన వాడవు.
స్వస్తిభిః అస్మాన్‌ విశ్వా దుర్గాణి అతిపారయ = సంతోషకరమైన మార్గాల ద్వారా మమ్మల్ని సమస్త దుఃఖాలనుండి సుదూరంగా తీసుసుకువెళ్ళు.
నః భూః పృథ్వీ ఉర్వీ చ బహులా = మా ఊరు, దేశమూ, ప్రంపంచమూ పోషింపబడుగాక.
తోకాయ తనయాయ శంయోః = మా పిల్లలకు వారి పిల్లలకు సుఖసంతోషాలనియ్యి.
హే అగ్నిదేవా! నువ్వు కీర్తింప తగిన వాడవు. సంతోషకరమైన మార్గాల ద్వారా మమ్మల్ని సమస్త దుఃఖాలనుండి సుదూరంగా తీసుసుకువెళ్ళు. మా ఊరు, దేశమూ, ప్రంపంచమూ పోషింపబడుగాక. మా పిల్లలకు వారి పిల్లలకు సుఖసంతోషాలనియ్యి.


విశ్వాని నో దుర్గహా జాతవేదః సింధూన్న నావా దురితా తిపర్‌షి|
అగ్నే అత్రివన్మనసా గృణానోఽస్మాకం బోధ్యవితా తనూనామ్‌||
జాతవేదః విశ్వాని దుర్గహా = జాతవేదుడా! సమస్త దుఃఖాలను హరించేవాడా.
సింధుం నావా దురితాః అతిపర్షి = భవసాగరంలో నుండి, దురితాల నుంచి మోక్షమనే తీరానికి చేర్చు.
అగ్నే అస్మాకం తనూనాం అవితా = హే అగ్ని దేవా! మా శరీరాలను కాపాడు/రక్షించు.
మనసా ఘృణానః అత్రివత్‌ బోధి = పురాణాలు పదే పదే చెప్పుతున్న అత్రిమునిని మనస్సు ద్వారా గుర్తుచేసుకో, మమ్మల్ని కాపాడు.
జాతవేదుడా! సమస్త దుఃఖాలను హరించేవాడా. భవసాగరంలో నుండి, దురితాల నుంచి మోక్షమనే తీరానికి చేర్చు. హే అగ్ని దేవా! మా శరీరాలను కాపాడు/రక్షించు. పురాణాలు పదే పదే చెప్పుతున్న అత్రిమునిని మనస్సు ద్వారా గుర్తుచేసుకో, మమ్మల్ని కాపాడు.


పృతనా జితగ్ం సహమానముగ్రమగ్నిగ్ం హువేమ పరమథ్సధస్థాత్‌|
స నః పర్‌షదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాఽత్యగ్నిః||
పృతనా జితగ్‌ం సహమానం ఉగ్రం అగ్నిం = శత్రుసైన్యాన్ని నాశనం చేసేవాడు, ఉగ్రమైనవాడు అయిన అగ్ని దేవుణ్ణి;
పరమాత్‌ సథస్థాత్‌ హువేమ = అతి ఉన్నత స్థానం నుండి ఆహ్వానిస్తున్నాం..
సః విశ్వా దుర్గాణి క్షామాత్‌ దురితాత్‌ అతి పరిషత్‌ = మా సమస్త క్లేశాలను, పాపాలను నశింప చేసి మమ్మల్ని కాపాడుగాక.
శత్రుసైన్యాన్ని నాశనం చేసేవాడు, ఉగ్రమైనవాడు అయిన అగ్ని దేవుణ్ణి అతి ఉన్నత స్థానం నుండి ఆహ్వానిస్తున్నాం. ఆ అగ్నిదేవుడు మా సమస్త క్లేశాలను, పాపాలను నశింప చేసి మమ్మల్ని కాపాడుగాక.


ప్రత్నోషి కమీడో అధ్వరేషు సనాచ్ఛ హోతా నవ్యశ్చ సత్సి|
స్వాంచాఽగ్ని తనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ||
అగ్నే అధ్వరేషు ఈఢ్యః కం ప్రత్నోషి = యాగాలలో కీర్తంపబడుతున్న ఓ అగ్నిదేవా! మా ఆనందాన్ని ఇనుమడింపచేయి.
హోతా సనాత్‌ చ నవ్య చ సత్సి = యాగం చేసేవారిలో సనాతనుడిగా నవ్యుడిగా ఒప్పారుతున్నావు.
స్వాం తనువం చ సౌభగం ఆయుజస్వ = నీ స్వరూపంగా ఉన్న మాకు సంతోషాన్ని సౌభాగ్యాన్ని అన్నివైపుల నుండి యివ్వు.
యాగాలలో కీర్తింపబడుతున్న ఓ అగ్నిదేవా! మా ఆనందాన్ని ఇనుమడింపచేయి. యాగం చేసేవారిలో సనాతనుడిగా నవ్యుడిగా ఒప్పారుతున్నావు. నీ స్వరూపంగా ఉన్న మాకు సంతోషాన్ని సౌభాగ్యాన్ని అన్నివైపుల నుండి యివ్వు.


గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణోరనుసంచరేమ|
నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవీం లోక ఇహమాదయంతామ్‌||
ఇంద్రః ఆయుజః = హే భగవంతుడా! పాపరహితుడా!
విష్ణోః గోభిః జుష్ఠ నిషిక్తం తవ అనుసంచరేమ = సకలం వ్యాపించినవాడా పశువులతో పరమానందం అపరిమితంగా పొందగోరి నిన్ను వెంబడిస్తున్నాము.
పృష్ఠం అభి నా కస్య సంవవస్యానః వైష్ణవీ ఇహ మాదయంతాం = ఉన్నతమైన దేవలోకంలో నివసించే వైష్ణవీ మాత మాకు సంతోషాన్ని ప్రసాదించు గాక.
హే భగవంతుడా! పాపరహితుడా! సకలం వ్యాపించిన వాడా! పశువులతో పరమానందం అపరిమితంగా పొందగోరి నిన్ను వెంబడిస్తున్నాము.ఉన్నతమైన దేవలోకంలో నివసించే వైష్ణవీ మాత మాకు సంతోషాన్ని ప్రసాదించు గాక.


ఓం కాత్యాయనాయా విధ్మహే కన్యకుమారి ధీమహి|
తన్నో దుర్గి ప్రచోదయాత్‌||
ఓం శాంతి శాంతి శాంతి||
కాత్యాయనాయ విద్మహే = కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము.
కన్యకుమారి ధీమహి = కన్యాకుమారిని ధ్యానిద్దాం.
తత్‌ దుర్గిః నః ప్రచోదయాత్‌ = దుర్గాదేవి మా బుద్ధిని ప్రచోదనం చేయు గాక.

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. కన్యాకుమారిని ధ్యానిద్దాం. దుర్గాదేవి మా బుద్ధిని ప్రచోదనం చేయు గాక. ఓం శాంతి శాంతి శాంతి||


www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] ఔపచ్ఛందసికా ఉదీచ్యవృత్తి #aupachChaMdasikA udIchyavRtti#

 

ఔపచ్ఛందసికా ఉదీచ్యవృత్తి - 

బేసి పాదములు - IUIU లేక IUIII + ర/య 
సరి పాదములు - 8 మాత్రలు + ర/య 

మనమ్ములో - మాధవున్ దలంచన్ 
వనజాక్షుఁడు నా-వైపు చూచినాఁడో 
వనమ్ములో - వాని జూడ నేగన్ 
వినిపించెను నా - వీనులందు గితుల్ 

వియోగినిని - ప్రేమ దూరమయ్యెన్ 
ప్రియుఁ డెక్కడనో - రేయియందు నొంటిన్ 
బ్రయాణమున - వాఁడు డస్సె నేమో 
భయమగుచున్నది - వాఁడు లేని యింటన్ 

వరమ్ములను - వాణి యిచ్చు నాకున్
గరములతో నా - కంజనేత్ర గాచున్ 
సరస్వతిని - జాల ప్రస్తుతింతున్ 
నిరత మ్మామెయు - నేర్పు నాకుఁ గైతల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aupachChaMdasikA udIchyavRtti - 

bEsi pAdamulu - #IUIU# lEka #IUIII# + ra/ya 
sari pAdamulu - 8 mAtralu + ra/ya 

manammulO - mAdhavun dalaMchan 
vanajAxu@MDu nA-vaipu chUchinA@MDO 
vanammulO - vAni jUDa nEgan 
vinipiMchenu nA - vInulaMdu గితుల్ 

viyOginini - prEma dUramayyen 
priyu@M DekkaDanO - rEyiyaMdu noMTin 
brayANamuna - vA@MDu Dasse nEmO 
bhayamaguchunnadi - vA@MDu lEni yiMTan 

varammulanu - vANi yichchu nAkun
garamulatO nA - kaMjanEtra gAchun 
sarasvatini - jAla prastutiMtun 
nirata mmAmeyu - nErpu nAku@M gaital 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] వైతాళీయ ఉదీచ్యవృత్తి #vaitALIya udIchyavRtti#

 

వైతాళీయ ఉదీచ్యవృత్తి - 

ఇందులో వైతాళీయమునందలి బేసి పాదముల 6 లఘువులు IUIII లేక IUIU రూపములో ఉంటాయి. మిగిలిన లక్షణములు వైతాళీయమువలెనే. క్రింద నా ఉదాహరణములు - 

వైతాళీయ ఉదీచ్యవృత్తి - 
బేసి పాదములు - IU + 3 మాత్రలు + ర/లగ 
సరి పాదములు - 8 లఘువులు + ర/లగ

విలాసముల - ప్రేమ నాట్యముల్ 
కళలకు పెన్నిధి - కామినీ ప్రియా 
జ్వలించె నా - భావదీపముల్ 
వలపుల కావ్యము - వ్రాయఁ దల్చితిన్ 

సరోజమో - చారు నేత్రముల్ 
విరియఁగఁ జేసెడు - వేధ యెక్కడే 
మరాళమో - మానినీగతుల్ 
మెఱుపుల నిండిన - మేఘ మెక్కడే 
(వేధ = సూర్యుడు) 

ముదాకరా - మోదకప్రియా 
పదములఁ గొల్తును - బాపు విఘ్నముల్ 
సుధాహృదయ - శోభితాననా 
సదమల కాంతులఁ - జల్లు మాపయిన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహనస్ రావు
#
vaitALIya udIchyavRtti - 

iMdulO vaitALIyamunaMdali bEsi pAdamula 6 laghuvulu #IUIII# lEka #IUIU# rUpamulO uMTAyi. migilina laxaNamulu vaitALIyamuvalenE. kriMda nA udAharaNamulu - 

vaitALIya udIchyavRtti - 
bEsi pAdamulu - #IU + 3# mAtralu + ra/laga 
sari pAdamulu - 8 laghuvulu + ra/laga

vilAsamula - prEma nATyamul 
kaLalaku pennidhi - kAminI priyA 
jvaliMche nA - bhAvadIpamul 
valapula kAvyamu - vrAya@M dalchitin 

sarOjamO - chAru nEtramul 
viriya@Mga@M jEseDu - vEdha yekkaDE 
marALamO - mAninIgatul 
me~rupula niMDina - mEgha mekkaDE 
(vEdha = sUryuDu) 

mudAkarA - mOdakapriyA 
padamula@M goltunu - bApu vighnamul 
sudhAhRdaya - SObhitAnanA 
sadamala kAMtula@M - jallu mApayin 

vidhEyuDu - jejjAla kRshNa mOhanas rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___