[racchabanda] వినుతులొసఁగి వేడుచుంటి

వినుతులొసఁగి వేడుచుంటి
========================

--

కొండవీటి సీమలోనఁ  గొదమ సింగమొక్కటి 
బండపైనఁ  గూరుచుండెఁ బ్రజలతీరునెంచుచు 
మెండుగాను ధైర్యమున్న మేటి శూరమయ్యును 
గుండెలోనఁ గలఁగ సాగెఁ గుపితమగుచు మఱిమఱి  
--
జరుగుచున్నవన్ని దలఁచి జగతినందు పదెపదె 
హరుసమందలేకయుండె నావగింజ యంతయు 
సరిగఁ జేయు తెరవు గనక శాంతి లేక యెడఁదను 
బరముఁడైన విభునిఁ దల్చి ప్రణుతి చేయ సాగెను.

--
ఉత్సాహ 
--

భక్తవరద! ఆర్తరక్ష! ప్రాణనాథ! శ్రీహరీ!
యుక్తి చాలకుండె నాకు యోగివంద్య! లోకపా! 
శక్తినిచ్చి కావవయ్య చక్రహస్త!కేశిహా! 
భక్తిమీఱఁ గొలుచువాఁడ పరమ! నీదు పదములే
--
వేడుకవదు మనికి యిపుడు పృథ్వి పైన నే గతిన్  
పాడుపనులఁ జేయుచుంద్రు ప్రజలు బుద్ధిలేనటుల్ 
చూడలేక లోకమిటుల స్రుక్కుచుంటినెంతయో
నేడు జరుగువన్ని దెలిసి నీవు మిన్నకుందువా 
--
అంపరాద విజ్ఞునొకని నవనికిడఁగ బోధలన్ 
పెంపు సేసి భక్తినదియు వృద్ధి గాఁగ ధర్మమున్
సొంపుగాను మార్చ మరల క్షోణినంత ముదముగాఁ 
జంపుకొనక యొకరినొకరు స్వార్థపరతతో జనుల్ 
--
విజ్ఞులెవరిఁ గానకున్న విధిగ నీవె రాదగున్ 
అజ్ఞతనిటఁ బాపుటకయి యవతరించ ధర్మమే
యజ్ఞములును బ్రార్థనలును నధికమవఁగ శాంతికై 
యజ్ఞదేవ! నేర్పవచ్చు ననువుగాను స్వయముగా 
--
ఇలను మించు దౌష్ట్యమణఁచి యిడఁగ శాంతిసౌఖ్యముల్ 
వెలసినావు పూర్వమీవె వివిధమైన రూపులన్ 
తలఁపవలెను స్వామి మరల ధరణి యొక్క శ్రేయమున్ 
వెలుఁగునిండి జనుల యెదల విశ్వశాంతి నెలకొనన్
--
నీవుదక్క లేరెవరును నిఖిలలోకవందితా! 
కావమమ్ము, భూతతతినిఁ గరుణతోడ రయముగా  
నీవె దిక్కు మాకటంచు నిర్మలాత్మ! వేడెదన్
బ్రోవుమో యనాథనాథ! భూతపాల! మాధవా!  
--
వినుతులొసఁగి వేడుకొందు విశ్వనేత! యార్తితో 
వినయమొప్పఁ  గోరుచుంటిఁ  బెంపునదియె జగతికై 
ఘనతమీఱ నభయమిచ్చి యవనిజనుల కెల్లెడన్ 
వనరుహాక్ష!భక్తపోష! వసుధకిడవె రక్షణన్ 
--

సుప్రభ 
10:55 
08-09-2018
 
__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] గానయోగ్యమైన వైతాళీయ ప్రవృత్తకము #gAnayOgyamaina vaitALIya pravRttakamu#

గానయోగ్యమైన వైతాళీయ ప్రవృత్తకము - 

రెండు పాదములను చేర్చి చదువుచు, రెండవ పాదములోని మొదటి రెండు లఘువులను ఊతగా ఉపయోగించి, రెండు పాదములకు ఒకే లయ కలిగించి పాడుకొనుటకై వ్రాసినది. నా ఉద్దేశములో ఇది గానయోగ్యము. 

వైతాళీయ ప్రవృత్తకము - 

సరస్వతీ - శారదోన్ముఖీ - వా
క్సరస్సులో - శారదాంబుజా 
చిరమ్ముగాఁ - జిద్విలాసముల్ - నీ 
కరమ్ములో - ఘంటమే కదా 

విలాసినీ - ప్రేమరూపిణీ - నీ 
విలాస మా - ప్రేమ రూపమే 
కళామయీ - కామవర్ధినీ - నీ 
గళమ్ములోఁ - గాకలీ ధ్వనుల్ 

విపంచికను - వేగ మీటుమా - నా 
ప్రపంచ మా - రాగమే కదా 
జపింతు నా - సర్వనామముల్ - నా 
కపార మా - హర్ష యోగముల్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
gAnayOgyamaina vaitALIya pravRttakamu - 

reMDu pAdamulanu chErchi chaduvuchu, reMDava pAdamulOni modaTi reMDu laghuvulanu ootagA upayOgiMchi, reMDu pAdamulaku okE laya kaligiMchi pADukonuTakai vrAsinadi. nA uddESamulO idi gAnayOgyamu. 

vaitALIya pravRttakamu - 

sarasvatI - SAradOnmukhI - vA
ksarassulO - SAradAMbujA 
chirammugA@M - jidvilAsamul - nI 
karammulO - ghaMTamE kadA 

vilAsinI - prEmarUpiNI - nI 
vilAsa mA - prEma rUpamE 
kaLAmayI - kAmavardhinI - nI 
gaLammulO@M - gAkalI dhvanul 

vipaMchikanu - vEga mITumA - nA 
prapaMcha mA - rAgamE kadA 
japiMtu nA - sarvanAmamul - nA 
kapAra mA - harsha yOgamul

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] వైతాళీయ ప్రవృత్తకములో ఒక ప్రత్యేకత విదాహినీ #vaitALIya pravRttakamulO oka pratyEkata vidAhinI#

వైతాళీయ ప్రవృత్తకములో ఒక ప్రత్యేకత విదాహినీ - 

ఆధారము - ఛందోరచనా 

బేసి పాదములు - జ/త/ర - IUIU - UIUIU
సరి పాదములు - ర/న/ర/లగ -  UIUIII - UIUIU 

క్రింద నా ఉదాహరణములు - 

సుకేశినీ - సుందరమ్ముగా 
నాకురుల్ మదిని - నాపి కట్టెనే 
సుకమ్ములన్ - జూప రావొకో 
నాకు నీకు నిఁక - నాకమే గదా 

విదాహినిన్ - బ్రేమవారికై 
మోదబిందువుల - మోము వేచెనే 
ముదమ్ముగా - మోహనా సఖా 
బాధఁ దీర్చగను - వత్తువా దరిన్ 

హలా చెలీ - హయి నీయ రా
తేలిపోదు నిఁక - తెల్లమేఘమై 
విలాసినీ - ప్రీతి నీయ రా 
వ్రాలిపోదు నిఁక - పాదసీమలో 

విధేయుడు = జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
vaitALIya pravRttakamulO oka pratyEkata vidAhinI - 

aadhAramu - ChaMdOrachanA 

bEsi pAdamulu - ja/ta/ra - #IUIU - UIUIU#
sari pAdamulu - ra/na/ra/laga -  #UIUIII - UIUIU# 

kriMda nA udAharaNamulu - 

sukESinI - suMdarammugA 
nAkurul madini - nApi kaTTenE 
sukammulan - jUpa rAvokO 
nAku nIku ni@Mka - nAkamE gadA 

vidAhinin - brEmavArikai 
mOdabiMduvula - mOmu vEchenE 
mudammugA - mOhanA sakhA 
bAdha@M dIrchaganu - vattuvA darin 

halA chelI - hayi nIya rA
tElipOdu ni@Mka - tellamEghamai 
vilAsinI - prIti nIya rA 
vrAlipOdu ni@Mka - pAdasImalO 

vidhEyuDu = jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] వైతాళీయ ప్రవృత్తక #vaitALIya pravRttaka#

వైతాళీయ ప్రవృత్తక - 

బేసి పాదములు - లగ + 3 - ర/లగ
సరి పాదములు - 3 + గ + 3 - ర/లగ 

నా ఉదాహరణములు - 

మనమ్మదియు - మర్కటమ్మవన్ 
దాను దల్చునటు - దాఁటుచుండునో 
క్షణమ్మదియు - జారుచుండఁగాఁ  
నీవు నేనిలను - నేస్తమే సదా

విలాసముల - వింత దీప్తిలో 
కాల మయ్యదియుఁ - గాలిపోవునో 
కలల్ గనుచుఁ - గామవర్ధనిన్ 
మేలమాడఁగను - మేలు గల్గునో 

స్మరించగను - జారుహాసినిన్ 
సారసాక్షి నను - జాలిఁ జూడునో 
తరించగను - ధ్యాన చింతలో  
దారి కానదే - దైవ మెక్కడో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vaitALIya pravRttaka - 

bEsi pAdamulu - laga + 3 - ra/laga
sari pAdamulu - 3 + ga + 3 - ra/laga 

nA udAharaNamulu - 

manammadiyu - markaTammavan 
dAnu dalchunaTu - dA@MTuchuMDunO 
xaNammadiyu - jAruchuMDa@MgA@M  
nIvu nEnilanu - nEstamE sadA

vilAsamula - viMta dIptilO 
kAla mayyadiyu@M - gAlipOvunO 
kalal ganuchu@M - gAmavardhanin 
mElamADa@Mganu - mElu galgunO 

smariMchaganu - jAruhAsinin 
sArasAxi nanu - jAli@M jUDunO 
tariMchaganu - dhyAna chiMtalO   
dAri kAnadE - daiva mekkaDO 