Re: [racchabanda] వందనాలర్పింతు..

 

ఎంత బావున్నాయో పద్యాలు !!👌👌
సుప్రభ గారికి సమ్మోహిత వందనములు.

On Fri 24 Aug, 2018, 20:06 suprabha u saarada@yahoo.com [racchabanda], <racchabanda@yahoogroups.com> wrote:
 

వందనాలర్పింతు..
---------------------------

--

ద్విపద  (చతుష్పదలుగా)

--

చేదుకోవమ్మరో శ్రీ లక్ష్మి మమ్ము
ఆదుకోవమ్మరో హరిపత్ని దయను
పాదుకొల్పుక యుండు పద్మాక్షి వెలసి
శ్రీదవై నిత్యమ్ము గృహమందు మెఱసి

--

పూజించుకొందుమే పూలతో నిన్ను
రాజిల్లవే వచ్చి రంగుగా రమణి
నాకాధిపతి వోలె నయముగాఁ బొగడ
లేకుండెనని పల్కు క్లేశమీబోకు

--

పూలు, పండ్లే గాని ముదముగా నీయ
మేలైనవింకేవి మెచ్చి తేలేను 
ఆలపింతును కొన్ని యల్లి పద్యాల
వాలు భక్తిని నీకు, వనరుహాలయకు

--

అందాల తల్లివై యతివేగ రమ్ము
గంధమాల్యాదులన్ గానుకల్ సేసి
యందించి హారతుల్ హర్షిణీ నీకు
విందు సేసెద నమ్మ వీలైన యటుల 

--

స్థిరనివాసము సల్పి చెలువుగా నింట
మురిపించుమోయమ్మ మురవైరి రాణి
హరితోడ నీవింట నతిశయించంగ
మఱి కోరనేముండు మాకైన నింక

--

అష్టలక్ష్ముల రీతినందగించంగ
నిష్టమై మాయింట యిందిరా దేవి
కష్టనష్టాలింక కనుపించఁ గలవ
దృష్టికెచ్చటనైన, దిగులు గూర్చంగ

--

కరుణించుమా వచ్చి కందర్పజనని
సిరులిచ్చు మాతల్లి శ్రీమహాలక్ష్మి
వరలక్ష్మివై కోరు భాగ్యాల నిమ్ము 
మెఱుగైన భక్తియున్ మేటి జ్ఞానమును

--

వందనాలర్పింతు వైష్ణవీ నీకు 
చిందించి చిరునవ్వు చెలిమితో రమ్ము 
అందించి యనువుగా నర్థించు సిరుల
నందుకో నాపూజలనయమ్ము మురిసి

--

సుప్రభ
9:26 AM
08-24-2018


__._,_.___

Posted by: =?UTF-8?B?4LCV4LCC4LCm4LCw4LGN4LCqIOCwleCxg+Cwt+CxjeCwoyDgsK7gsYvgsLngsKjgsY0=?= <telugumohan@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4758

1 Message

Digest #4758

Message

Thu Aug 30, 2018 8:58 am (PDT) . Posted by:

telugubhaktipages

https://www.youtube.com/watch?v=UnzUUSgc7rE https://www.youtube.com/watch?v=UnzUUSgc7rE

1 'అహం'- అన్నారు ఆదిశంకరులు 'సోsహం'- అన్నారు రామానుజులుwww.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] అనుష్టుప్పు విపరీతా #anushTuppu viparItA#

 

అనుష్టుప్పు విపరీతా - 

సూత్రము - ఓజే విపరీతాదిః 
బేసి పాదములు - 5,6,7 అక్షరములు జ-గణము
సరి పాదములు - 5,6,7 అక్షరములు య-గణము
ఇది అనుష్టుప్పు పథ్యా పాదముల తారుమారు. 

అనుష్టుప్పు విపరీతా - జ / య (5,6,7 అక్షరములు) 

మనస్సులో సుధామయీ 
అనంతరూపిణీ నీవే 
వినమ్రమై తలంతు నిన్ 
వినోదినీ విశ్వానందా 

ప్రేమలోని ప్రియంవదా 
కామరాగ కళాంభోధీ 
కోమలాంగీ కుముద్వతీ 
నామదిలో నవాంభోజా 

అనాయకైక నాయకా 
వినాయకా గణాధ్యక్షా 
అనాథులను బ్రోవరా 
అనంతా గిరిజాపుత్రా 

హరీ హారీ హరప్రియా 
వరేణ్యా వరదా దేవా 
మురారీ హరిణీప్రియా 
నిరంతరము గొల్తున్ నిన్  

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
anushTuppu viparItA - 

sUtramu - OjE viparItAdi@h 
bEsi pAdamulu - 5,6,7 axaramulu ja-gaNamu
sari pAdamulu - 5,6,7 axaramulu ya-gaNamu
idi anushTuppu pathyA pAdamula tArumAru. 

anushTuppu viparItA - ja / ya (5,6,7 axaramulu) 

manassulO sudhAmayI 
anaMtarUpiNI nIvE 
vinamramai talaMtu nin 
vinOdinI viSvAnaMdA 

prEmalOni priyaMvadA 
kAmarAga kaLAMbhOdhI 
kOmalAMgI kumudvatI 
nAmadilO navAMbhOjA 

anAyakaika nAyakA 
vinAyakA gaNAdhyakshA 
anAthulanu brOvarA 
anaMtA girijAputrA 

harI hArI harapriyA 
varENyA varadA dEvA 
murArI hariNIpriyA 
niraMtaramu goltun nin  

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___