సొబగుల సోన -
ఇది కన్నడ ఛందస్సునందలిది. ఇది ఒక అర్ధసమగీతి. ఇట్టి అమరికలో ఒక త్యాగరాజ కృతి గలదు (కనుక్కోండి).
సొబగులసోన - ఇం/ఇం - ఇం/ఇం (గోమేధిక-1) // ఇం-ఇం-ఇం (నీల-1) ఇం - ఇంద్ర గణము
నిను గొల్తు రామయ్య - వినవేల నాగోడు
కన రమ్ము వేగమే కరుణతో
దినమెల్ల నీసేవ - ధనమెల్ల నీవెగా
మనమందు నీరూపు మవ్వమే
తనువన్న గృహములో - కనుదోయి దివ్వెలన్
నిను జూచు భాగ్యమే నిల్చుఁగా
ఘననీల దేహుఁడా - చిన నవ్వు నవ్వరా
నను నేను మఱతురా నందమై
వనజాక్ష నీధ్యాన - మనిశమ్ము వంతలో
నిను దల్తు ముదములో నేనెప్డు
ఇనవంశ దీపమా - జనకజానందమా
నను బ్రోవ రావయ్య నాహరీ
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sobagula sOna -
idi kannaDa ChaMdassunaMdalidi. idi oka ardhasamagIti. iTTi amarikalO oka tyAgarAja kRti galadu (kanukkOMDi).
sobagulasOna - iM/iM - iM/iM (gOmEdhika-1) // iM-iM-iM (nIla-1) iM - iMdra gaNamu
ninu goltu rAmayya - vinavEla nAgODu
kana rammu vEgamE karuNatO
dinamella nIsEva - dhanamella nIvegA
manamaMdu nIrUpu mavvamE
tanuvanna gRhamulO - kanudOyi divvelan
ninu jUchu bhAgyamE nilchu@MgA
ghananIla dEhu@MDA - china navvu navvarA
nanu nEnu ma~raturA naMdamai
vanajAxa nIdhyAna - maniSammu vaMtalO
ninu daltu mudamulO nEnepDu
inavaMSa dIpamA - janakajAnaMdamA
nanu brOva rAvayya nAharI
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___