[racchabanda] ఆలోల - లీలా #aalOla - lIlA#

 

ఆలోల - 

ఆధారము - కల్పితము 
దీనిని కొందఱు తెలుగు లాక్షణికులు వాతోర్మి అని పిలిచినారు. ఇది వాతోర్మి కాదు. అందువలన నేను వేఱు పేరును ఉంచినాను. ఈ వృత్తమ్ములో ఒక విశేషము ఏమనగా - మొదటి భాగపు (UUUU), చివరి భాగపు (UUIIU) లయ ఒక్కటే. ఈ రెండు భాగములను రెండు లఘువుల వంతెన కలుపుతుంది. క్రింద నా ఉదాహరణములు - 

ఆలోల - మ/భ/త/లగ UUUU - II - UUIIU (యతి, ప్రాసయతి) 
11 త్రిష్టుప్పు 817

ప్రేమాకారా - ప్రియ - శ్యామా యననా 
కామార్థమ్మా - కల - నా మాధురియా 
శ్యామమ్మందున్ - సఖ - నా మన్మథుఁడా 
సోమమ్మిత్తున్ - సుఖ - ధామమ్మున నేన్ 

రావా నాకై - రతి - నీవే కలయా 
భావాంభోధీ - వర - జీవామృతమా 
పూవుల్ నీకే - భువిఁ - ద్రోవల్ మనవే 
ప్రావృట్ధారా - రస - రావమ్ముల రా 

లీలాకారా - ప్రియ - వేళయ్యెనురా 
నీలాంగా రా - నిను - గేలన్ గొలుతున్ 
బాలా రా నా - వన - మాలీ త్వరగా 
ఆలోలమ్మే - హరి - నాలోఁ దలఁపుల్ 

పై పద్యములను మధ్యలోని వరణములు లేక కూడ వ్రాయ వీలగును. అవి - 

లీలా - మ/మ/స UUUU - UUIIU 
9 బృహతి 193

ప్రేమాకారా - శ్యామా యననా 
కామార్థమ్మా - నా మాధురియా 
శ్యామమ్మందున్ - నా మన్మథుఁడా 
సోమమ్మిత్తున్ - ధామమ్మున నేన్ 

రావా నాకై - నీవే కలయా 
భావాంభోధీ - జీవామృతమా 
పూవుల్ నీకే - ద్రోవల్ మనవే 
ప్రావృట్ధారా - రావమ్ముల రా 

లీలాకారా - వేళయ్యెనురా 
నీలాంగా రా - గేలన్ గొలుతున్ 
బాలా రా నా - మాలీ త్వరగా 
ఆలోలమ్మే - నాలోఁ దలఁపుల్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aalOla - 

aadhAramu - kalpitamu 
dInini koMda~ru telugu lAxaNikulu vAtOrmi ani pilichinAru. idi VAtOrmi kAdu. aMduvalana nEnu vE~ru pErunu uMchinAnu. ee vRttammulO oka viSEshamu EmanagA - modaTi bhAgapu (#UUUU#), chivari bhAgapu (#UUIIU#) laya okkaTE. ee reMDu bhAgamulanu reMDu laghuvula vaMtena kaluputuMdi. kriMda nA udAharaNamulu - 

aalOla - ma/bha/ta/laga #UUUU - II - UUIIU# (yati, prAsayati) 
11 trishTuppu 817

prEmAkArA - priya - SyAmA yananA 
kAmArthammA - kala - nA mAdhuriyA 
SyAmammaMdun - sakha - nA manmathu@MDA 
sOmammittun - sukha - dhAmammuna nEn 

rAvA nAkai - rati - nIvE kalayA 
bhAvAMbhOdhI - vara - jIvAmRtamA 
pUvul nIkE - bhuvi@M - drOval manavE 
prAvRTdhArA - rasa - rAvammula rA 

lIlAkArA - priya - vELayyenurA 
nIlAMgA rA - ninu - gElan golutun 
bAlA rA nA - vana - mAlI tvaragA 
aalOlammE - hari - nAlO@M dala@Mpul 

pai padyamulanu madhyalOni varaNamulu lEka kUDa vrAya vIlagunu. avi - 

lIlA - ma/ma/sa #UUUU - UUIIU# 
9 bRhati 193

prEmAkArA - SyAmA yananA 
kAmArthammA - nA mAdhuriyA 
SyAmammaMdun - nA manmathu@MDA 
sOmammittun - dhAmammuna nEn 

rAvA nAkai - nIvE kalayA 
bhAvAMbhOdhI - jIvAmRtamA 
pUvul nIkE - drOval manavE 
prAvRTdhArA - rAvammula rA 

lIlAkArA - vELayyenurA 
nIlAMgA rA - gElan golutun 
bAlA rA nA - mAlI tvaragA 
aalOlammE - nAlO@M dala@Mpul 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 14

 

శ్లోకాలలో కొత్త లోకాలు - 14

శ్లోకమ్మా క్రొత్త లోకమ్మా 
నాకమ్మా నవ్వు మైకమా 
శోకమ్మా నాకశోకమ్మా 
నాకిష్టమగు పాకమా 

జీవితమది యింతేనా 
భావము చిఱు గంతేనా 
దైవ మన్నది తంతేనా 
నీవు నేనొక వింతేనా 
(వక్త్రా) 

మనమందున శూన్యమ్మా 
దినమందున దైన్యమా 
ప్రణవ మ్మొక మంత్రమ్మా 
ప్రణయ మ్మొక తంత్రమా 

వెన్నెల పాలసంద్రమ్మా 
వెన్నెలవలెఁ గన్నెలా 
కన్నెల మానసమ్మందుఁ  
గన్నులవిల్తుఁ డెవ్వరో 

మొగమే కానరాదయ్యెన్ 
సగమైతిని నేనిటన్ 
సుగమే శూన్యమా నాయీ 
జగమే మాయ యయ్యెనా 

సందియమ్ములు వద్దింక 
యెందుకే నీకు తొందర 
సుందరుండిక వచ్చునే 
వంద ముద్దుల నిచ్చునే 
(విపరీతా) 

విధేయుడు - మోహన 

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___