[racchabanda] Re: [Chandassu] నవరాత్రి - 2 - ఆర్యా #navarAtri - 2 - aaryA#

> చివరి రెండు పాదములలో ఐదు మాత్రలు
చివరి రెండు పాదములలో ఐదు చతుర్మాత్రలు

#
> chivari reMDu pAdamulalO aidu mAtralu, 
chivari reMDu pAdamulalO aidu chaturmAtralu, 
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] నవరాత్రి - 2 - ఆర్యా #navarAtri - 2 - aaryA#

నవరాత్రి - 2 - ఆర్యా - 

ఆర్యా సంస్కృతములో ద్విపద. తెలుగులో కందమువలె వ్రాయవలెను. మొదటి రెండు పాదములలో ఏడు చతుర్మాత్రలు, ఒక గురువు. చివరి రెండు పాదములలో ఐదు మాత్రలు, ఒక లఘువు, చివర ఆఱు మాత్రలు. మొత్తము పద్యములో 57 మాత్రలు. ప్రాకృతములో దీనినే గాథా అంటారు. 

ఆర్యాంబా తప్పక మా 
కార్యమ్ముల జయము నిమ్ము - కరుణాబ్ధీ 
ధైర్యస్థైర్యమ్ముల మా-
ధుర్యమ్ము నొసగు మ-తులితమ్మై 

నవరాత్రులు శుభరాత్రులు 
నవశోభను గూర్చు నిలను - నవనవమై 
కవితలతో సుందరమగు 
నవరసములఁ గూర్చ - నందమ్మే 

అమ్మా మాకీ యిలపై 
సొమ్మేలకొ యండ నుండ - సొంపిడుచున్ 
జిమ్ముము సుధలను మాపైఁ  
గొమ్మీ దండలను - గుతుకముతో 

బొమ్మల కొలువులలో నొక 
బొమ్మై మాయింట నుండు - మోదముతో 
బొమ్మలు మాపాపలు నీ 
విమ్మా వారలకు - నిమ్ము నుడుల్ 

దీపము నుంతుము నీస-
ద్రూపమునకు ముందు తల్లి - దోషములన్ 
బాపములను మన్నించుము 
కాపాడుము మమ్ము - కల్పలతా 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
navarAtri - 2 - aaryA - 

aaryA saMskRtamulO dvipada. telugulO kaMdamuvale vrAyavalenu. modaTi reMd'u pAdamulalO EDu chaturmAtralu, oka guruvu. chivari reMDu pAdamulalO aidu mAtralu, oka laghuvu, chivara aa~ru mAtralu. mottamu padyamulO 57 mAtralu. prAkRtamulO dIninE gAthA aMTAru. 

aaryAMbA tappaka mA 
kAryammula jayamu nimmu - karuNAbdhI 
dhairyasthairyammula mA-
dhuryammu nosagu ma-tulitammai 

navarAtrulu SubharAtrulu 
navaSObhanu gUrchu nilanu - navanavamai 
kavitalatO suMdaramagu 
navarasamula@M gUrcha - naMdammE 

ammA mAkI yilapai 
sommElako yaMDa nuMDa - soMpiDuchun 
jimmumu sudhalanu mApai@M  
gommI daMDalanu - gutukamutO 

bommala koluvulalO noka 
bommai mAyiMTa nuMDu - mOdamutO 
bommalu mApApalu nI 
vimmA vAralaku - nimmu nuDul 

dIpamu nuMtumu nIsa-
drUpamunaku muMdu talli - dOshamulan 
bApamulanu manniMchumu 
kApADumu mammu - kalpalatA 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAVu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] శ్లోకాలలో కొత్త లోకాలు - 15

శ్లోకాలలో కొత్త లోకాలు - 15 

రంగుల చెల్మి తెలుపే
రంగుల లేమి శ్యామమే 
రంగులే బ్రతుకు రుచుల్ 
రంగులే రమ్య దీపముల్ 
(చపలా) 

అమ్మవారిని గొల్వంగా 
నమ్మవారు గ్రహించునో 
యిమ్మహిన్ గల స్త్రీలెల్ల 
నమ్మవారికి యంశలే 

మత్తకోకిల పాడంగాఁ 
జిత్తమందున గానమే 
మత్తమయూరి యాడంగాఁ 
జిత్తమందున నాట్యమే 

దోసముతోడ డీఎన్ఏ
వేసము చేయు జన్యువే 
మోసము చేసె డీఎన్ఏ
వ్రాసిన గీత క్యాన్సరే 

నడిరేతిరి నిద్రించన్ 
విడి వెళ్లితి వెందుకో 
ముడి వేసితి నాకొంగున్ 
ముడి విప్పుట భావ్యమా 

విధేయుడు - మోహన 

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] లలితా #lalitA#

లలితా - 

ఆధారము - జయదామన్ 
ఇతర నామములు - ధీరలలిత, ప్రముదితా, మాహిషీ 
నడక - షణ్మాత్రలు (రూపక తాళము) 

లలితా - భ/ర/న/ర/న/గ UIIU IUIII - UIUI IIU
16 అష్టి 30167 

ఆలయమే గదా మదియు - నమ్మ నిన్ను నిలుపన్ 
శ్రీలలితా దయాకలిత - ప్రేమతోడఁ గనుమా 
మేలిడుమా నిరంతరము - మేము నీదు నిసుఁగుల్ 
పూలివిగో పదమ్ములకుఁ - బూజ సేయ నిపుడే 

చారుమతీ సరోజముఖి - చంద్ర సూర్య నయనా 
తీరని మా విచారములఁ - దీర్చు మమ్మ గరుణన్ 
వేఱెవ రీప్రపంచమునఁ - బ్రేమఁ జూపఁగలరే
శ్రీరమణీ కళామయము - సేయవమ్మ బ్రతుకున్ 

మీటుము నీ విపంచిఁ గల - మెట్లపైన మృదువై 
పాటలతో జపించు వర - వారిజాక్షి కృపకై 
మాటలతో స్మరించు మన-మందు భక్తి విరియన్ 
నాటక మీ చరాచరము - నాట్య మామె సలుపున్ 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
lalitA - 

aadhAramu - jayadAman 
itara naamamulu - dhIralalita, pramuditA, mAhishI 
naDaka - shaNmAtralu (rUpaka tALamu) 

lalitA - bha/ra/na/ra/na/ga #UIIU IUIII - UIUI IIU#
16 ashTi 30167 

aalayamE gadA madiyu - namma ninnu nilupan 
SrIlalitA dayaakalita - prEmatODa@M ganumA 
mEliDumA niraMtaramu - mEmu nIdu nisu@Mgul 
pUlivigO padammulaku@M - bUja sEya nipuDE 

chArumatI sarOjamukhi - chaMdra sUrya nayanA 
tIrani mA vichAramula@M - dIrchu mamma garuNan 
vE~reva rIprapaMchamuna@M - brEma@M jUpa@MgalarE
SrIramaNI kaLaamayamu - sEyavamma bratukun 

mITumu nI vipaMchi@M gala - meTlapaina mRduvai 
pATalatO japiMchu vara - vArijAxi kRpakai 
mATalatO smariMchu mana-maMdu bhakti viriyan 
nATaka mI charAcharamu - nATya mAme salupun 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu