[racchabanda] రోచి #rOchi#

 

రోచి -

ఆధారము - కల్పితము 
నడక - మిశ్రగతి (4,3 మాత్రలు) 

రోచి - మ/య/ర/త/మ UU UI UU UI - UU UI UU U 
15 అతిశక్వరి 2185 

దేవా మోముఁ జూపన్ రమ్ము - దీప్తుల్ నిండ దివ్యమ్మై 
భావ మ్మందు జీవ మ్మెందు - భవ్యమ్మైన కావ్యమ్మై 
త్రోవన్ గాన లేనే యిందు - రోచుల్ లేవు చీఁకట్లే 
కావన్ రమ్ము కష్ట మ్మందుఁ - గంటన్ నీరు లేనట్లే 

వేదాభ్యాసమం దుండంగఁ - బ్రేమన్ వేద మన్నానా 
నాదాభ్యాసమం దుండంగ - నవ్వున్ నాద మన్నానా 
మేధాభ్యాసమం దుండంగ - మేనుల్ మేధ మన్నానా
వేదమ్మెందు నాదమ్మెందుఁ - బ్రేమమ్మెందు మేధమ్మా 

సత్యార్థమ్ముఁ జిత్తమ్మందు - సాధించంగ నేనెంతున్ 
నిత్యానందు నిర్మోహాత్ము - నిత్యాదర్శమై యుంతున్  - 
చైత్యమ్మయ్యె నాడెందమ్ము - శ్రీలోకేశుఁ బూజింతున్ 
స్తుత్యమ్మయ్యె నారూపమ్ము - సొంపుల్ నిండ నే వ్రాతున్ 

ఇది ఒక కష్తమైన వృత్తము. నా ఉదాహరణములు నాకు పుర్తిగా సంతృప్తి నివ్వలేదు. 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
rOchi -

aadhAramu - kalpitamu 
naDaka - miSragati (4,3 mAtralu) 

rOchi - ma/ya/ra/ta/ma #UU UI UU UI - UU UI UU U# 
15 atiSakvari 2185 

dEvA mOmu@M jUpan rammu - dIptul niMDa divyammai 
bhAva mmaMdu jIva mmeMdu - bhavyammaina kAvyammai 
trOvan gAna lEnE yiMdu - rOchul lEvu chI@MkaTlE 
kAvan rammu kashTa mmaMdu@M - gaMTan nIru lEnaTlE 

vEdAbhyAsamaM duMDaMga@M - brEman vEda mannAnA 
nAdAbhyAsamaM duMDaMga - navvun nAda mannAnA 
mEdhAbhyAsamaM duMDaMga - mEnul mEdha mannAnA
vEdammeMdu nAdammeMdu@M - brEmammeMdu mEdhammA 

satyArthammu@M jittammaMdu - sAdhiMchaMga nEneMtun 
nityAnaMdu nirmOhAtmu - nityAdarSamai yuMtun  - 
chaityammayye nADeMdammu - SrIlOkESu@M bUjiMtun 
stutyammayye nArUpammu - soMpul niMDa nE vrAtun 

idi oka kashtamaina vRttamu. nA udAharaNamulu nAku purtigA saMtRpti nivvalEdu. 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___