వనప్రియ -
ఆధారము - కల్పితము
నడక - మిశ్రగతి (3, 4 మాత్రలు)
వనప్రియ - జ/జ/భ/ర/స/జ/లగ IU IIU IU IIU - IU IIU IU IIU
20 కృతి 439726
వనమ్ములలో వసంతములా - పదమ్ములతోఁ బ్రదర్శనలా
స్వనమ్ములలోఁ బ్రమోదములా - ప్రసూనములన్ బ్రహారములా
వనప్రియమా భరించను నీ - స్వరమ్ముల నన్ వధించకుమా
వినోదములా విలాసములా - విహారములా వియోగినికిన్
(వనప్రియ = కోకిల)
సదా నిను నే స్మరించితిఁగా - సరాగముతోఁ జరించితిఁగా
వ్యధల్ మిగిలెన్ వరమ్ములుగాఁ - బతంగములై పడెన్ భువిపై
మధూదయమే మరీచికలా - మనమ్మది సంశయమ్ములతో
నిదే వలపా యిదే తలఁపా - యిదే మలుపా యిదే బ్రతుకా
(పై రెండు పద్యములలో ఏడేడు మాత్రలకు యతిని ఉంచినాను)
వరించితిరా ప్రియా నిను నీ - బ్రయాణములో జయమ్మె గదా
తరించఁగ రా విలాసములే - తలంపులుగాఁ గలాపినిలో
విరుల్ గురిసెన్ వసంతములో - విశిష్టముగా హసన్ముఖులై
చరించఁగ రా వనమ్ములలో - జనించఁగ సుస్వనమ్ములతో
(పై పద్యములో ప్రతి పాదములో రెండవ, మూడవ, నాలుగవ సప్తమాత్రలకు ప్రాసయతి కూడ ఉన్నది)
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vanapriya -
aadhAramu - kalpitamu
naDaka - miSragati (3, 4 mAtralu)
vanapriya - ja/ja/bha/ra/sa/ja/laga #IU IIU IU IIU - IU IIU IU IIU#
20 kRti 439726
vanammulalO vasaMtamulA - padammulatO@M bradarSanalA
svanammulalO@M bramOdamulA - prasUnamulan brahAramulA
vanapriyamA bhariMchanu nI - svarammula nan vadhiMchakumA
vinOdamulA vilAsamulA - vihAramulA viyOginikin
(vanapriya = kOkila)
sadA ninu nE smariMchiti@MgA - sarAgamutO@M jariMchiti@MgA
vyadhal migilen varammulugA@M - bataMgamulai paDen bhuvipai
madhUdayamE marIchikalA - manammadi saMSayammulatO
nidE valapA yidE tala@MpA - yidE malupA yidE bratukA
(pai reMDu padyamulalO EDEDu mAtralaku yatini uMchinaanu)
variMchitirA priyA ninu nI - brayANamulO jayamme gadA
tariMcha@Mga rA vilAsamulE - talaMpulugA@M galApinilO
virul gurisen vasaMtamulO - viSishTamugA hasanmukhulai
chariMcha@Mga rA vanammulalO - janiMcha@Mga susvanammulatO
(pai padyamulO prati pAdamulO reMDava, mUDava, nAlugava saptamAtralaku prAsayati kUDa unnadi)
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___