[racchabanda] అర్ధసమ వృత్తము - కళాపూర్ణ #ardhasama vRttamu - kaLApUrNa#

 

అర్ధసమ వృత్తము - కళాపూర్ణ 

బేసి పాదములు - భుజంగప్రయాతము - (య)4
సరి పాదములు - భుజంగి - (య)3/లగ

కళాపూర్ణ - IUU IUU - IUU IUU // IUU IUU - IUUIU

విలాసాలతో రా - వినోదాలతో రా 
కలాపాలతో రా - కళాపూర్ణమై 
లలిన్ నింపఁగా రా - లతాపుష్పమై రా 
శిలాచిత్రమై రా - చెలీ నాదరిన్ 

సరోజంపు వంపై - సరాగాల యింపై 
స్మరించంగ సొంపై - సమీపించవా 
అరాళమ్ము లాశా - స్వరూపమ్ము గాదా 
మరాళమ్మువోలెన్ - మదిన్ నిల్వ రా 

నిదాఘమ్ములోనన్ - నిరాశా సుమమ్ముల్  
మదిన్ జ్వాలలోనన్ - మసిన్ మారునా 
నదుల్ వట్టిపోయెన్ - నభమ్మయ్యె బీడై 
ముదమ్మీ నదిన్ బు-ద్బుదమ్మా సదా  

దీనిని షట్పదిగ కూడ వ్రాయవచ్చును.. కాని ఈ షట్పదికి ఎదురు నడక! రెండవ ఉదాహరణము షట్పదికి సరిపోతుంది. 

సరోజంపు వంపై  
సరాగాల యింపై 
స్మరించంగ సొంపై - సమీపించవా 
అరాళమ్ము లాశా  
స్వరూపమ్ము గాదా 
మరాళమ్మువోలెన్ - మదిన్ నిల్వ రా 

షట్పదికి మఱొక ఉదాహరణము - 

నిసుంగున్ గనంగా 
రసింతున్ సదా నే 
నసీమమ్ము మోద - మ్మదే హాయిగా 
వసించున్ హృదిన్ దా
హసించన్ రవమ్ముల్ 
స్పృశించున్ మనమ్మున్ - మృదూద్గీతియై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu - kaLApUrNa 

bEsi pAdamulu - bhujaMgaprayAtamu - (ya)4
sari pAdamulu - bhujaMgi - (ya)3/laga

kaLApUrNa - #IUU IUU - IUU IUU // IUU IUU - IUUIU#

vilAsAlatO rA - vinOdAlatO rA 
kalApAlatO rA - kaLApUrNamai 
lalin niMpa@MgA rA - latApushpamai rA 
SilAchitramai rA - chelI nAdarin 

sarOjaMpu vaMpai - sarAgAla yiMpai 
smariMchaMga soMpai - samIpiMchavA 
arALammu lASA - svarUpammu gAdA 
marALammuvOlen - madin nilva rA 

nidAghammulOnan - nirASA sumammul  
madin jvAlalOnan - masin mArunA 
nadul vaTTipOyen - nabhammayye bIDai 
mudammI nadin bu-dbudammA sadA  

dInini ShaTpadiga kUDa vrAyavachchunu. kAni ee shaTpadiki eduru naDaka! reMDava udAharaNamu shaTpadiki saripOtuMdi. 

sarOjaMpu vaMpai  
sarAgAla yiMpai 
smariMchaMga soMpai - samIpiMchavA 
arALammu lASA  
svarUpammu gAdA 
marALammuvOlen - madin nilva rA 

shaTpadiki ma~roka udAharaNamu - 

nisuMgun ganaMgA 
rasiMtun sadA nE 
nasImammu mOda - mmadE hAyigA 
vasiMchun hRdin dA
hasiMchan ravammul 
spRSiMchun manammun - mRdUdgItiyai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___