[racchabanda] ధన్యతమము ...

ధన్యతమము ...
----------------------

--
ఆ.వె
--

ధన్యతమము బ్రతుకు దైవముం దలపోసి 
చింతలేక మదిని సేవలిడఁగ 
మాన్యతఁగొను నటులె మహిలోన నిత్యమ్ము 
శాంతి పెంపుఁజేయ సహనమొప్ప
--
కోర్కెలన్ని విడిచి కుదురైన గుండెతో 
కర్మ సేయునపుడె కలుగు సుఖము
ఆశ వీడకున్న ననిశమ్ము దుఃఖమే 
తృప్తి సుంతయేని ప్రాప్తిలేక 
--
ప్రాప్తమైన దానఁ బ్రముదమ్ము నొందుట
ముఖ్యమైన గుణము మునులకైన
ఇంద్రియమ్ము లణఁచి హితమైన తీరులోఁ 
దపము సేసికొనుట తగినదగును 
--
వనముకేఁగవలయు పనిలేదు తపముకై 
మనము నిగ్రహించి ఘనత మీఱ 
దృష్టిలోనికంపఁ దెలియఁగా వీలౌను 
సృష్టి మర్మమేదొ హృష్టి మిగుల 
--
వీడఁబోకె నరులు వృత్తి ధర్మములేవి 
చూడవచ్చు వెలుఁగు శుభము గూర 
చేరి తగిన గురుని సేవించ భక్తితోఁ 
గోరి యతఁడె చూపు తీరులన్ని 
--
బోధ సేయఁబూను బూర్వకర్మములెంచి 
యుక్తమైన విధిని, రక్తి చూపి
ఆత్మనెఱుఁగనైన నందించు సాయమ్ము 
మార్పులవియుఁ దెచ్చి యోర్పు మించి 
--
శ్రద్ధ యున్నఁ జాలు సహనమ్ముతో నేర్పు 
వృద్ధి చేయు తానె బుద్ధి బలము
గురువు కన్న హితుల ధరణిపై కనఁజాల 
మరసి చూడ నెట్టి తరుణమందు 
--
దొరుక నట్టి యొజ్జ కరుగు మోహము లన్ని 
దొరుక నట్టి గురువు విరియు నెదయు 
దొరుకనట్టి తరణి దరికి జేరఁగ నౌను
దొరుకనట్టి త్రాత చిరమె శాంతి 

--

2:06 AM
12-17-2018

__._,_.___

Posted by: suprabha u <saarada@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కర్ణాట చతుష్పద - పంచమాత్రల ద్విపద #karNATa chatushpada - paMchamAtrala dvipada#

కర్ణాట చతుష్పద - పంచమాత్రల ద్విపద -

నాకు నచ్చిన ఛందస్సులలో ఇది ఒకటి. కాని తెలుగులో దీని వాడుక మృగ్యము. దీని లక్షణములను కూడ లాక్షణికులు సరిగా చెప్పలేదు. ప్రతి పాదములో దీనికి మూడు పంచమాత్రలు, ఒక త్రిమాత్ర. పొత్తపి వేంకటరమణకవి, చివరి గణమును నాలుగు మాత్రలుగా పేర్కొన్నాడు, అది సరి కాదు. కాని రమణకవి అంత్యప్రాసను ఉపయోగించాడు, మిగిలినవారు దానిని పాటించలేదు. ఇది ఒక విధముగా ద్విపద వంటిది. ద్విపదలోని ఇంద్రగణములకు బదులు ఇందులో పంచమాత్రలు ఉన్నాయి. పాదాంత విరామ యతి ముఖ్యము. కన్నడములో అంత్యప్రాస కూడ ఉన్నది. దీనినే కన్నడములో మహానవమి చౌపద అంటారు. తెలుగులో పాదమునకు నాలుగు చతుర్మాత్రల ఛందము మహానవమి చౌపది అని కవితాసాగరములో చెప్పబడినది, అది సరి కాదు. కన్నడములో దీనిని కొందఱు రెండు ద్విపదలుగా కూడ వ్రాసియున్నారు (అనగా రెండేసి పాదములకు ప్రాసతో). ఒక విధముగా వృత్తములలో ఇది వనమయూర వర్గమునకు చెందినదని చెప్పవచ్చును. క్రింద నా ఉదాహరణములు - 

కర్ణాట చతుష్పద - 5/5 - 5/3 మాత్రలు, ప్రాస, అంత్యప్రాస

ఆననముఁ జూపు మది - యందముల ప్రోవు 
మానసము నిన్ను గన - మైమఱచి పోవు
వీణియలు మ్రోఁగు మది - వెలుఁగుతో నిండుఁ  
దేనియల నది పారుఁ - దీపి హృది నుండు 

మాధవా యన వెలుఁగు - మదిలోనఁ బ్రాఁకు 
మోదము సుగంధ మిడు - పూలయ్యె నాకు 
శ్రీధరా యన సిరుల - చెలువములు దోఁచు 
నాదముల మారుతము - నయముగా వీచు 

వారములు గడచెఁ జెలి - వాఁడు గనరాఁడు 
భార మీ బ్రతుకయ్యె - వంత నాతోడు 
చేర నను వచ్చునో - చెలికాఁడు నేఁడు 
కారు చీఁకటుల నా - కంపనము చూఁడు 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
karNATa chatushpada - paMchamAtrala dvipada -

nAku nachchina ChaMdassulalO idi okaTi. kAni telugulO dIni vADuka mRgyamu. dIni laxaNamulanu kUDa lAxaNikulu sarigA cheppalEdu. prati pAdamulO dIniki mUDu paMchamAtralu, oka trimAtra. pottapi vEMkaTaraman'akavi, chivari gaNamunu nAlugu mAtralugA pErkonnADu, adi sari kAdu. kAni ramaNakavi aMtyaprAsanu upayOgiMchADu, migilinavAru dAnini pATiMchalEdu. idi oka vidhamugA dvipada vaMTidi. dvipadalOni iMdragaNamulaku badulu iMdulO paMchamAtralu unnAyi. pAdAMta virAma yati mukhyamu. kannaDamulO aMtyaprAsa kUDa unnadi. dIninE kannaDamulO mahAnavami chaupada aMTAru. telugulO pAdamunaku nAlugu chaturmAtrala Chamdamu mahAnavami chaupadi ani kavitAsAgaramulO cheppabaDinadi, adi sari kAdu. kannaDamulO dInini koMda~ru reMDu dvipadalugA kUDa vrAsiyunnAru (anagA reMDEsi pAdamulaku prAsatO). oka vidhamugA vRttamulalO idi vanamayUra vargamunaku cheMdinadani cheppavachchunu. kriMda nA udAharaNamulu - 

karNATa chatushpada - 5/5 - 5/3 mAtralu, prAsa, aMtyaprAsa

aananamu@m jUpu madi - yaMdamula prOvu 
mAnasamu ninnu gana - maima~rachi pOvu
vINiyalu mrO@Mgu madi - velu@MgutO niMDu@M  
dEniyala nadi pAru@M - dIpi hRdi nuMDu 

mAdhavA yana velu@Mgu - madilOna@M brA@Mku 
mOdamu sugaMdha miDu - pUlayye nAku 
SrIdharA yana sirula - cheluvamulu dO@Mchu 
nAdamula mArutamu - nayamugA vIchu 

vAramulu gaDache@M jeli - vA@MDu ganarA@MDu 
bhAra mI bratukayye - vaMta nAtODu 
chEra nanu vachchunO - chelikA@MDu nE@MDu 
kAru chI@MkaTula nA - kaMpanamu chU@MDu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: jkmrao@yahoo.com

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>