[racchabanda] జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) #jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI)#

 

జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) 

ఆధారము - జయకీర్తి, హేమచంద్రుడు, వృత్తరత్నాకరము
పాదములో 15 గుర్వక్షరములు! 

జ్యోతిస్ (మిత్ర, కామక్రీడా, లీలాఖేల, సారంగీ) - (మ)5
15 అతిశక్వరి 1 

లీలాఖేలా దివ్యజ్యోతీ - లీలల్ సూపన్ రావేలా 
బాలుండీవా నోటన్ జూపన్ - బ్రహ్మాండమ్ముల్ దోచెన్గా 
నీలాకారా శీలీ మాలీ - నీవేగాదా సర్వ మ్మీ 
నేలన్ నింగిన్ నీరూపమ్మే - నిత్యానందమ్మై నిల్చెన్ 

దేవీ దీప్తిన్ వెల్గించంగా - దివ్యమ్మై యీ జీవమ్మున్ 
భావాతీతా భావాంభోధీ - వాగర్థమ్మై భవ్యమ్మై 
శ్రీవిశ్వేశీ విశ్వామిత్రీ - చిద్రూపమ్మై శీఘ్రమ్మై 
ప్రోవన్ రావా కావన్ రావా - త్రోవన్ జూపన్ తృప్తమ్మై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI) 

aadhAramu - jayakIrti, hEmachaMdruDu, vRttaratnAkaramu
pAdamulO 15 gurvaxaramulu! 

jyOtis (mitra, kAmakrIDA, lIlAkhEla, sAraMgI) - (ma)5
15 atiSakvari 1 

lIlAkhElA divyajyOtI - lIlal sUpan rAvElA 
bAluMDIvA nOTan jUpan - brahmAMDammul dOchen&gA 
nIlAkArA SIlI mAlI - nIvEgAdA sarva mmI 
nElan niMgin nIrUpammE - nityAnaMdammai nilchen 

dEvI dIptin velgiMchaMgA - divyammai yI jIvammun 
bhAvAtItA bhAvAMbhoedhI - vAgarthammai bhavyammai 
SrIviSvESI viSvAmitrI - chidrUpammai SIghrammai 
prOvan rAvA kAvan rAvA - trOvan jUpan tRptammai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] పారిజాతము - 64 మాత్రల షట్పది #pArijAtamu - 64 mAtrala shaTpadi#

 

పారిజాతము - 64 మాత్రల షట్పది 

ఆధారము - కల్పితము 

పారిజాతము - 5,6 / 5,6 / 5,5 మాత్రలు 

వారిజాతేక్షణుండు  
పారిజాతమ్ము గొనఁగఁ  
దూరుపుకు ఱేనితోఁ  
బోరు సతితోడ సలిపి 
నీరేజనయన యింట 
నేరుపునఁ దరువుంచె 

ఆనందనందనుండు 
వేణునాదమ్ము సేయ 
వీనులకుఁ దేనియలు 
ధేనువుల కగును బిలుపు 
లానాగములకు నిత్య 
మానందదాయియగు 

శ్యామలాంబరపు నీడఁ  
గోమలిని వెదకుచుంటిఁ  
బ్రేమలోఁబడి నేను 
నామానసమ్ములోన 
నామెయే కూరుచుండెఁ 
బ్రేమ సామ్రాజ్ఞిగా 

ఎన్ని విధములుగ నిన్ను 
సన్నుతించంగ నగును 
కన్నయ్య చెప్పుమా 
వెన్నపూసను భుజించు 
కన్నియల నేడిపించు 
వెన్నుఁడా చెప్పుమా 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
pArijAtamu - 64 mAtrala shaTpadi 

aadhAramu - kalpitamu 

pArijAtamu - 5,6 / 5,6 / 5,5 mAtralu 

vArijAtExaNuMDu  
pArijAtammu gona@Mga@M  
dUrupuku ~rEnitO@M  
bOru satitODa salipi 
nIrEjanayana yiMTa 
nErupuna@M daruvuMche 

aanaMdanaMdanuMDu 
vENunAdammu sEya 
vInulaku@M dEniyalu 
dhEnuvula kagunu bilupu 
lAnAgamulaku nitya 
mAnaMdadAyiyagu 

SyAmalAMbarapu nIDa@M  
gOmalini vedakuchuMTi@M  
brEmalO@MbaDi nEnu 
nAmAnasammulOna 
nAmeyE kUruchuMDe@M 
brEma sAmrAj~nigA 

enni vidhamuluga ninnu 
sannutiMchaMga nagunu 
kannayya cheppumA 
vennapUsanu bhujiMchu 
kanniyala nEDipiMchu 
vennu@MDA cheppumA 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] అర్ధసమ వృత్తము ఇలా #ardhasama vRttamu ilA#

 

అర్ధసమ వృత్తము ఇలా - 

ఆధారము - హేమచంద్రుడు

ఇలా - స/లగ // స/స/లగ 

అలనాఁడు నీ 
విల హస్తములన్ గొనన్ 
జెలి రాధ కె-
ట్టుల నుండెనొ మాధవా 

మధుసూదనా 
మధుమాసములోన నీ 
వదనమ్ములో 
హృదయమ్మును గంటి నేన్ 

నిను జూడఁగా 
మనమందున దివ్వెలే 
నిను దాఁకగాఁ 
దనువందునఁ బువ్వులే 

వరపుష్పముల్ 
విరియంగ వనమ్ములో
స్వరమాధురుల్ 
గురియంగ గళమ్ములో 

చెలి మన్కిలో 
వలపొక్క వసంతమా 
కలగీతిలోఁ 
దలఁపొక్క ప్రసూనమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ardhasama vRttamu ilA - 

aadhAramu - hEmachaMdruDu

ilA - sa/laga // sa/sa/laga 

alanA@MDu nI 
vila hastamulan gonan 
jeli rAdha ke-
TTula nuMDeno mAdhavA 

madhusUdanA 
madhumAsamulOna nI 
vadanammulO 
hRdayammunu gaMTi nEn 

ninu jUDa@MgA 
manamaMduna divvelE 
ninu dA@MkagA@M 
danuvaMduna@M buvvulE 

varapushpamul 
viriyaMga vanammulO
svaramAdhurul 
guriyaMga gaLammulO 

cheli man&kilO 
valapokka vasaMtamA 
kalagItilO@M 
dala@Mpokka prasUnamA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

www.telugubhakti.com Digest Number 4919

1 Message

Digest #4919

Message

Tue Jul 16, 2019 7:22 am (PDT) . Posted by:

telugubhaktipages

గురుపూర్ణిమ శుభాకాంక్షలు..


స్వామీ పరమార్థానందజీ జీవిత పరమార్థానందాన్ని శాస్త్రంలోంచి రంగరించి పోశారు.వేదాంతిక్‌ స్నాక్స్‌ పేరిట ఎన్నో ప్రసంగాలు చేశారు. వాటిలో కొన్నింటిని ఏర్చికూర్చి స్వామీజీ సలహామేరకు వేదాంత జీవన విధానం పేరిట పుస్తకరూపంలో తీసుకు రావటం జరిగింది. ఆ పుస్తకాన్ని మరి రెండు పుస్తకాలతో కలిపి గురుపూర్ణిమ సందర్భంగా విడుదల చేస్తున్నాము. ఇది అందరూ తప్పని సరిగా చదవదగిన పుస్తకం. మనలో కలిగే అనేక సందేహాలకు శాస్త్రవిహితమైన సమాధానమే ఈ పుస్తకం. దేవుడున్నాడా - అనే మౌలికమైన ప్రశ్న నుంచి జీవ ఈశ్వర ఐక్య వాక్యవిచారణ అనే పరాకాష్ఠకు తీసుకు వెళుతుంది.
ఈ పుస్తకం పోస్టులో కావాలను కునేవారు వారి పోస్టల్‌ ఎడ్రస్‌ 9849092368కు పంపితే ఉచితంగా పంపబడును. (This offer is only valid upto 31 July 2019 and only within INDIA)వేదాంత జీవన విధానం సాఫ్ట్‌ కాపీ ఫ్రీ డవును లోడ్‌ కోసం http://telugubhakti.com/telugupages/Adwaitam/Adwaitam.htm చూడండిwww.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

[racchabanda] రచ్చబండ కవితలు

 

Futile

 

రచించనేటికి రమించు వేళల

సుఖించు జాముల లిఖించనేలా?

 

మన మదనాతురతల అతిరేకములను

కుదించగలనా కురుచ పంక్తులలొ?

 

ప్రియుడా! సురత స్వరాలు

కుంజరయూధము మన కుత్తుకలందున

 

అలిమగునా అవి ఏ వాయిద్యానికి    

వచించగలదా వాఙ్మయము!

 

Lyla


__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (186)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] భాస్కరవిలసితము #bhAskaravilasitamu#

 

భాస్కరవిలసితము - 

ఆధారము - కవిజనాశ్రయము 

భాస్కరవిలసితము - భ/న/జ/య/భ/న/న/స/గ 
UII IIII UII UU - UII IIII IIII UU
25 అభికృతి 8381311 

వానిని గనఁగను వెల్గుల వానల్ - భాస్కరవిలసిత వదనమునందున్ 
శ్రేణిగ నగవుల కాంతులు గాన-శ్రీలిడు స్వరముల గమకము లెందున్ 
మానవులను సురకోటినిఁ దానే - మాయల మునుచును దదుపరి తేల్చున్ 
ప్రాణము నొసఁగును దీయును గానన్ - రక్షకుఁ డటులనె ఖలులను గూల్చున్

ఇందులో గర్భితమైన కంద పద్యములు - 
UII IIII UII 
UU UII IIII - IIII UU

వానిని గనఁగను వెల్గుల 
వానల్ భాస్కరవిలసిత - వదనమునందున్ 
శ్రేణిగ నగవుల కాంతులు 
గానశ్రీలిడు స్వరముల - గమకము లెందున్ 
మానవులను సురకోటినిఁ 
దానే మాయల మునుచును - దదుపరి తేల్చున్ 
ప్రాణము నొసఁగును దీయును 
గానన్ రక్షకుఁ డటులనె - ఖలులను గూల్చున్

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhAskaravilasitamu - 

aadhAramu - kavijanASrayamu 

bhAskaravilasitamu - bha/na/ja/ya/bha/na/na/sa/ga 
#UII IIII UII UU - UII IIII IIII UU#
25 abhikRti 8381311 

vAnini gana@Mganu velgula vAnal - bhAskaravilasita vadanamunaMdun 
SrENiga nagavula kAMtulu gAna-SrIliDu svaramula gamakamu leMdun 
mAnavulanu surakOTini@M dAnE - mAyala munuchunu dadupari tElchun 
prANamu nosa@Mgunu dIyunu gAnan - raxaku@M DaTulane khalulanu gUlchun

iMdulO garbhitamaina kaMda padyamulu - 
#UII IIII UII 
UU UII IIII - IIII UU#

vAnini gana@Mganu velgula 
vAnal bhAskaravilasita - vadanamunaMdun 
SrENiga nagavula kAMtulu 
gAnaSrIliDu svaramula - gamakamu leMdun 
mAnavulanu surakOTini@M 
dAnE mAyala munuchunu - dadupari tElchun 
prANamu nosa@Mgunu dIyunu 
gAnan raxaku@M DaTulane - khalulanu gUlchun

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

[racchabanda] కుందమాల (పొగడసరము) #kuMdamAla (pogaDasaramu)#

 

కుందమాల (పొగడసరము) - 

మాగురువులు శ్రీ వేదం వేంకటకృష్ణ శర్మగారు దిఙ్నాగుని కుందమాలను తెలుగులో అనువాదము చేసినారు. వారికి స్మృత్యంజలిగా ఈ కుందమాల వృత్తమును ఒకప్పుడు కల్పించినాను. చంపకమాలలోని యత్యక్షరమైన గురువు రెండు లఘువులైనవి ఈ వృత్తములో. 

కుందమాల (పొగడసరము) - న/జ/భ/న/స/స/జ/గ  IIII UIU III - IIII UII UIUIU 
22 ఆకృతి 1425328

గురువును వేడెదన్ బగితి - గురువులె పాఠము నేర్పుచుందు రా
గురువులె సానబెట్టెదరు - కుతుకము మీఱఁగ బుద్ధి వెల్గఁగా 
నరుసముతోడి జీవితము - నవనిని వారి వరమ్ము వారి యా  
చరణసరోరుహమ్ములకు - సముదమునిత్తును గుందమాలలన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kuMdamAla (pogaDasaramu) - 

mAguruvulu SrI vEdaM vEMkaTakRshNa SarmagAru di~mnAguni kuMdamAlanu telugulO anuvAdamu chEsinAru. vAriki smRtyaMjaligA ee kuMdamAla vRttamunu okappuDu kalpiMchinAnu. chaMpakamAlalOni yatyaxaramaina guruvu reMDu laghuvulainavi ee vRttamulO. 

kuMdamAla (pogaDasaramu) - na/ja/bha/na/sa/sa/ja/ga  #IIII UIU III - IIII UII UIUIU# 
22 aakRti 1425328

guruvunu vEDedan bagiti - guruvule pAThamu nErpuchuMdu rA
guruvule sAnabeTTedaru - kutukamu mI~ra@Mga buddhi velga@MgA 
narusamutODi jIvitamu - navanini vAri varammu vAri yA  
charaNasarOruhammulaku - samudamunittunu guMdamAlalan 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___