[racchabanda] ఆభాస కందము లేక అష్టమాత్రా కందము #aabhAsa kaMdamu lEka ashTamAtrA kamdamu#

 

ఆభాస కందము లేక అష్టమాత్రా కందము - 

ఆభాస కందములో అక్కడక్కడ రెండు చతుర్మాత్రలకు బదులు ఒక అష్టమాత్ర వస్తుంది. నల/జ గణములో మార్పు ఉండదు. 

చందనమ్ముతోఁ దనువు సు-
గంధమయము నందతనయుఁ - గానఁగా మదిన్ 
వందపుష్పములు పూయును 
విందగున్ వెన్నెల నవ్వు - ప్రేమ కాంతిలో 

వెన్నెలలో వికసించెను 
కన్నుల కింపైన రెండు - కంజపత్రముల్ 
వన్నెలన్ వెలుఁగు సొబగుల 
కన్నె నామనసు హరించె - కౌముదివేళన్ 

పాడనా నేను గీతిని 
వేడుకగా నీకు నీదు - వీనులకింపై 
నాడనా నీకు తోడుగ 
నీడగా నేరుపు మీఱ - నిండైన నిశిన్ 

విధేయుడు - జెజ్జల కృష్ణ మోహన రావు
#
aabhAsa kaMdamu lEka ashTamAtrA kamdamu - 

aabhAsa kaMdamulO akkaDakkaDa reMDu chaturmAtralaku badulu oka ashTamAtra vastuMdi. nala/ja gaNamulO mArpu uMDadu. 

chaMdanammutO@M danuvu su-
gaMdhamayamu naMdatanayu@M - gAna@MgA madin 
vaMdapushpamulu pUyunu 
viMdagun vennela navvu - prEma kAMtilO 

vennelalO vikasiMchenu 
kannula kiMpaina reMDu - kaMjapatramul 
vannelan velu@Mgu sobagula 
kanne nAmanasu hariMche - kaumudivELan 

pADanA nEnu gItini 
vEDukagA nIku nIdu - vInulakiMpai 
nADanA nIku tODuga 
nIDagA nErupu mI~ra - niMDaina niSin 

vidhEyuDu - jejjala kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: