[racchabanda] భద్రికా గీతి #bhadrikAgIti#

 

భద్రికా గీతి - 

ఆధారము - సీతారామ కెదిల్లాయ ఛందోదర్పణము (కన్నడములో)
ఆర్యా భేదమైన గీతిలో మూడవ, ఏడవ గణములు ర-గణములు ఇందులో. మొత్తము పద్యములో 64 మాత్రలు, కాని అది కందపు నడక కాదు. 

భద్రికాగీతి - గీతిలో మూడవ, ఏడవ గణములు ర-గణములుగా -

నీతలఁపె సదా భూమిపైఁ 
బ్రాతఃసంధ్యలను నిజము - రాధికేశా 
ప్రీతిగ వ్రాసితి భద్రికా 
గీతిని నీకొఱకు వినుము - కేశవా నన్ 

నమ్మితి నిన్నే మాధవా 
రమ్మిట వేగమ్ము నీవు - రాత్రి వేచెన్ 
వమ్ముగఁ జేయకు మాశలన్ 
జెమ్మగిలును గనులు నాకుఁ - జెల్మి లేమిన్ 

ఆనందముతో రమ్మురా 
ప్రాణ మ్మిట వేచె నీకుఁ - బక్షివోలెన్ 
గానంగా నిను నోసకా 
గానమ్ములు లేచు నెడఁద - గంగవోలెన్ 

రాధామాధవ లీలలే 
యీధరణికి నిండుదనము - నిచ్చుచుండున్ 
ఖేదమ్ములలో మోదమై 
మోదమ్ములఁ జేయు నెంతొ - మోహనమ్మై 

వ్యావహారిక భాషలో - 

సంసార మొక్క సాగరం 
కంసారికి కూడ నీఁదఁ - గష్టమేగా 
హంసలవలె మన మిద్దరం 
సంశయములు లేక వేగ - సాగిపోదాం 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhadrikA giiti - 

aadhAramu - sItArAma kedillAya ChaMdOdarpaNamu (kannaDamulO)
aaryA bhEdamaina gItilO mUDava, EDava gaNamulu ra-gaNamulu iMdulO. mottamu padyamulO 64 mAtralu, kAni adi kaMdapu naDaka kAdu. 

bhadrikAgIti - gItilO mUDava, EDava gaNamulu ra-gaNamulugA -

nItala@Mpe sadA bhUmipai@M 
brAta@hsaMdhyalanu nijamu - rAdhikESA 
prItiga vrAsiti bhadrikA 
gItini nIko~raku vinumu - kESavA nan 

nammiti ninnE mAdhavA 
rammiTa vEgammu nIvu - rAtri vEchen 
vammuga@m jEyaku mASalan 
jemmagilunu ganulu nAku@M - jelmi lEmin 

aanaMdamutO rammurA 
prANa mmiTa vEche nIku@M - baxivOlen 
gAnaMgA ninu nOsakA 
gAnammulu lEchu neDa@Mda - gaMgavOlen 

rAdhAmAdhava lIlalE 
yIdharaNiki niMDudanamu - nichchuchuMDun 
khEdammulalO mOdamai 
mOdammula@M jEyu neMto - mOhanammai 

vyAvahArika bhAshalO - 

saMsAra mokka sAgaraM 
kaMsAriki kUDa nI@Mda@M - gashTamEgA 
haMsalavale mana middaraM 
saMSayamulu lEka vEga - sAgipOdAM 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: