భారతి -
ఆధారము - కల్పితము
సార్థకనామ గణాక్షర వృత్తము - (భ)2-ర-(త)3
భారతి - భ/భ/ర/త/త/త UII UII UIU - UUI UUI UUI
18 ధృతి 149687
భారతి బ్రహ్మమనోహరీ - భావమ్ముతో నింపు పద్యమ్ము
కోరుదు నా మదిలో సదా- కొండంత భావాల చిత్రమ్ము
చారుమతీ రసమంజరీ - సానందరూపా కళాదీప
నీరజలోచన నిశ్చలా - నిన్ గొల్తు నోదివ్య నిక్షేప
ఈ వనమందున నీవెగా - హృద్యమ్ముగా మ్రోఁగు రాగమ్ము
శ్రావణమందున నీవెగా - చక్కంగ వర్షించు మేఘమ్ము
భావనమందున నీవెగా - భద్రమ్ముగానుండు దీపమ్ము
జీవనమందున నీవెగా - చిత్తములోనుండు రూపమ్ము
ఏమని పాడెద నోసఖీ - యీరాత్రి యేకాంతమై యుండె
నామనమందున నెందుకో - నాదమ్ము మౌనమ్ములో నిండె
ఆమని రంగుల యందముల్ - హర్షమ్ము నాకివ్వదే నేఁడు
కోమలమౌ నును వెన్నెలల్ - కుందించె నన్ లేక తోడు
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
bhArati -
aadhAramu - kalpitamu
sArthakanAma gaNAxara vRttamu - (bha)2-ra-(ta)3
bhArati - bha/bha/ra/ta/ta/ta #UII UII UIU - UUI UUI UUI#
18 dhRti 149687
bhArati brahmamanOharI - bhAvammutO niMpu padyammu
kOrudu nA madilO sadA- koMDaMta bhAvAla chitrammu
chArumatI rasamaMjarI - sAnaMdarUpA kaLAdIpa
nIrajalOchana niSchalA - nin goltu nOdivya nixEpa
ee vanamaMduna nIvegA - hRdyammugA mrO@Mgu rAgammu
SrAvaNamaMduna nIvegA - chakkaMga varshiMchu mEghammu
bhAvanamaMduna nIvegA - bhadrammugAnuMDu dIpammu
jIvanamaMduna nIvegA - chittamulOnuMDu rUpammu
Emani pADeda nOsakhI - yIrAtri yEkAMtamai yuMDe
nAmanamaMduna neMdukO - nAdammu maunammulO niMDe
aamani raMgula yaMdamul - harshammu nAkivvadE nE@MDu
kOmalamau nunu vennelal - kuMdiMche nan lEka tODu
vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#
__._,_.___
Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post | • | Reply to sender | • | Reply to group | • | Start a New Topic | • | Messages in this topic (1) |
Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.
To Post a message, send it to: racchabanda@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com
SPONSORED LINKS
.
__,_._,___
No comments:
Post a Comment