[racchabanda] దర్దురక (సుందర) #darduraka (suMdara)#

 

దర్దురక (సుందర) - 

ఆధారము - హేమచంద్రుడు, జయకీర్తి, కవిజనాశ్రయము

దర్దురక (సుందర) - భ/భ/ర/స/లగ 14 శక్వరి 5815

UII UII UI - UII U IU విఱుపుతో - 

ఆనతి నీయుము నాకు - హర్షము నాకదే 
గానము సేతును నీకు - గంగయు నాకదే 
మానసమందున నీవె - మౌనము వద్దురా 
దీనకుఁ గోరిక నీదు - తీయని ముద్దురా 

నామనమందున నీవు - నాట్యము సేయఁగా 
నేమని పాడుదు నమ్మ - యెప్పుడు నీవెగా 
ప్రేమపు దీపము నుంచి - ప్రీతిగఁ బాడనా 
కోమలవల్లిని దల్చి - కూర్మిగ నాడనా 

పాడుకొనుటకు క్రింది విఱుపు బాగుంటుందని న భావన - 

UIIU IIUIU IIUIU విఱుపుతో - 

మందముగా - మలయానిల - మ్మలరించఁగా 
సుందర మీ - స్ఫురదిందు భా-సుర చంద్రికల్ 
చిందిడు నీ - చిఱునవ్వులే - సిరులౌనుగా 
ముందుకు రా - మురిపాలతో - ముదమీయఁగా 

నీనగవే - నిఖిలమ్ములో - నెఱ వెల్గురా 
ఆనన మా - అసితాబ్జమే - హరినీలమే 
మానసమో - మమతాబ్ధియే - మధుపాత్రమే 
కానఁగ రా - కరుణించఁగా - కమలాననా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
darduraka (suMdara) - 

aadhAramu - hEmachaMdruDu, jayakIrti, kavijanASrayamu

darduraka (suMdara) - bha/bha/ra/sa/laga 14 Sakvari 5815

#UII UII UI - UII U IU# vi~ruputO - 

aanati nIyumu nAku - harshamu nAkadE 
gAnamu sEtunu nIku - gaMgayu nAkadE 
mAnasamaMduna nIve - maunamu vaddurA 
dInaku@M gOrika nIdu - tIyani muddurA 

nAmanamaMduna nIvu - nATyamu sEya@MgA 
nEmani pADudu namma - yeppuDu nIvegA 
prEmapu dIpamu nuMchi - prItiga@M bADanA 
kOmalavallini dalchi - kUrmiga nADanA 

pADukonuTaku kriMdi vi~rupu bAguMTuMdani na bhAvana - 

#UIIU IIUIU IIUIU# vi~ruputO - 

maMdamugA - malayAnila - mmalariMcha@MgA 
suMdara mI - sphuradiMdu bhA-sura chaMdrikal 
chiMdiDu nI - chi~runavvulE - sirulaunugA 
muMduku rA - muripAlatO - mudamIya@MgA 

nInagavE - nikhilammulO - ne~ra velgurA 
aanana mA - asitAbjamE - harinIlamE 
mAnasamO - mamatAbdhiyE - madhupAtramE 
kAna@Mga rA - karuNiMcha@mgA - kamalAnanA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: