[racchabanda] కవికంఠభూషణము #kavikaMThabhUshaNamu#

 

కవికంఠభూషణము - 

ఆధారము - అప్పకవీయము 
నడక - మిశ్రగతి (అష్టమాత్ర) 

కవికంఠభూషణము - స/జ/స/స/స/జ/గ 
19 అతిధృతి 177900

IIUI UIII - UII UII UIUIU విఱుపుతో - 

కవికంఠ భూషణము - కమ్మని కావ్యపు కల్పనాకృతుల్ 
రవి గాంచకుండు పలు - రమ్య జగమ్ములఁ జూసి యాకవుల్ 
భువనమ్ము వెల్గులిడు - పూర్ణశశాంకుని ముందు నుంచి స-
త్కవనాంబరమ్మునను - గానము నింపుదు రీధరిత్రిపై 

నాకేమో అప్పకవి యతి నచ్చలేదు. ఇది ఒక తాళ వృత్తము. దీనిని ప్రాసయతితో క్రింది విధముగా వ్రాస్తే బాగుంటుంది - 

IIUI UI - IIUI IU - IIUI UIU విఱుపుతో - 

మనమార నిన్ను - గనఁ గోర్కె సకీ - నను వేగఁ జూడవా 
ప్రణయంపు గీతి - వినఁ గోర్కె చెలీ - నును గీతిఁ బాడవా 
యినుఁ డస్తమించెఁ - గనఁ జంద్రుని క-మ్మని రాత్రి నందమై 
యనుమాన మేల - మనమిర్వుర కా-మన దీరు బంధమై 

మలపైన మంచు - చలి నిండెను గం-బళ మొండు కావలెన్ 
జలిలోన వేడిఁ - గలిగించఁగఁ గౌ-గిలి నాకు నీవలెన్ 
మెలెమెల్లగాను - నళిణేక్షణ న-న్నలరించ రావలెన్ 
జలి పారిపోవు - వలపందున వె-న్నెలఁ జిల్కి పోవలెన్ 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
kavikaMThabhUshaNamu - 

aadhAramu - appakavIyamu 
naDaka - miSragati (ashTamAtra) 

kavikaMThabhUshaNamu - sa/ja/sa/sa/sa/ja/ga 
19 atidhRti 177900

#IIUI UIII - UII UII UIUIU# vi~ruputO - 

kavikaMTha bhUshaNamu - kammani kAvyapu kalpanAkRtul 
ravi gAMchakuMDu palu - ramya jagammula@M jUsi yAkavul 
bhuvanammu velguliDu - pUrNaSaSAMkuni muMdu nuMchi sa-
tkavanAMbarammunanu - gAnamu niMpudu rIdharitripai 

nAkEmO appakavi yati nachchalEdu. idi oka tALa vRttamu. dInini prAsayatitO kriMdi vidhamugA vrAstE bAguMTuMdi - 

#IIUI UI - IIUI IU - IIUI UIU# vi~ruputO - 

manamAra ninnu - gana@M gOrke sakI - nanu vEga@M jUDavA 
pran'ayaMpu gIti - vina@M gOrke chelI - nunu gIti@M bADavA 
yinu@M DastamiMche@M - gana@M jaMdruni ka-mmani rAtri naMdamai 
yanumAna mEla - manamirvura kA-mana dIru baMdhamai 

malapaina maMchu - chali niMDenu gaM-baLa moMDu kAvalen 
jalilOna vEDi@M - galigiMcha@Mga@M gau-gili nAku nIvalen 
melemellagAnu - naLiNExaNa na-nnalariMcha rAvalen 
jali pAripOvu - valapMduna ve-nnela@M jilki pOvalen 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: