[racchabanda] లలితాగీతి #lalitAgIti#

 

లలితాగీతి - 

ఆధారము - సీతారామ కెదిల్లాయ ఛందోదర్పణము (కన్నడములో) 

ఆర్యా భేదములలో గీతి ఒకటి. ఇందులో పూర్వోత్తర భాగములలో ఆర్యా (గాథా) పూర్వ భాగపు అమరిక ఉంటుంది (మూడు చతుర్మాత్రలు / నాలుగు చతుర్మాత్రలు + గురువు; మొత్తము పద్యములో 60 మాత్రలు). లలితాగీతిలో మూడవ చతుర్మాత్రకు బదులు ర-గణము ఉంటుంది. అనగా పద్యములో మొత్తము 62 మాత్రలు.

చందన చర్చిత దేహుఁడా 
సుందర సుకుమార రూప - శూరవరా 
వందిత చరణాంభోజుఁడా 
యిందీవరవర్ణతేజ - యిందుముఖా 

రామా శ్యామల రూపుఁడా 
స్వామీ మముఁ గావుమయ్య - సచ్ఛీలా 
రామా రణమున భీముఁడా 
ప్రేమమ్మునఁ గావుమయ్య - ప్రియ వరదా 

ఆమనిలో విరి పిల్చెనో 
కోమల రవములను బాడు - కోకిల లీ
ప్రేమ మధురమని తల్చెనో 
నా మానసమందు నిండె - నాదములే 

రాధాకృష్ణా రమ్మురా 
నీదయ నాకుండఁ జాలు - నెఱయగు నీ 
మోదము వ్యధ నీ సొమ్మురా 
కాదని చెప్పకుర యెపుడు - కమలాక్షా 

లలితా గీతిని పాడనా 
మెలమెల వినుమమ్మ నీవు - మీటుము నీ 
లలితమగు వీణ గూడ నా 
వలపున రాగములు నిండుఁ - బరవశమై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
lalitAgIti - 

aadhAramu - sItArAma kedillAya ChaMdOdarpaNamu (kannaDamulO) 

aaryA bhEdamulalO gIti okaTi. iMdulO pUrvOttara bhAgamulalO aaryA (gAthA) pUrva bhAgapu amarika uMTuMdi (mUDu chaturmAtralu / nAlugu chaturmAtralu + guruvu; mottamu padyamulO 60 mAtralu). lalitAgItilO mUDava chaturmAtraku badulu ra-gaNamu uMTuMdi. anagA padyamulO mottamu 62 mAtralu.

chaMdana charchita dEhu@MDA 
suMdara sukumAra rUpa - SUravarA 
vaMdita charaNAMbhOju@MDA 
yiMdIvaravarNatEja - yiMdumukhA 

rAmA SyAmala rUpu@MDA 
svAmI mamu@M gAvumayya - sachChIlA 
rAmA raNamuna bhImu@MDA 
prEmammuna@M gAvumayya - priya varadA 

aamanilO viri pilchenO 
kOmala ravamulanu bADu - kOkila lI
prEma madhuramani talchenO 
nA mAnasamaMdu niMDe - nAdamulE 

rAdhAkRshNA rammurA 
nIdaya nAkuMDa@M jAlu - ne~rayagu nI 
mOdamu vyadha nI sommurA 
kAdani cheppakura yepuDu - kamalAxA 

lalitA gItini pADanA 
melamela vinumamma nIvu - mITumu nI 
lalitamagu vINa gUDa nA 
valapuna rAgamulu niMDu@M - baravaSamai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: