[racchabanda] పికరవము #pikaravamu#

 

పికరవము - 

ఆధారము - కల్పితము
చంపకోత్పలమాలలలో మొదటి చతుర్మాత్రను తొలగించి, మిగిలిన అమరికను విలోమ దిశలో అమర్చగా జనించిన వృత్తమిది. ఇందులో మూడు అష్టమాత్రలు - UIUIU, రెండు స-గణములు, IIIUIU. క్రింద నా ఉదాహరణములు - 

పికరవము - ర/జ/జ/జ/స/లగ UIUIU - IIU IIU - III UIU 
17 అత్యష్టి 47979

నామనమ్ములో - నవనాదముతో - నయనయమ్ముగాఁ  
బ్రేమగీతియే - వినిపించెనుగా - పికరవమ్ముగా 
కామసుందరా - కనిపించవె యా - కమలనేత్రముల్ 
ప్రేమమందిరా - ప్రియరాగముతోఁ - బిలువ వేలరా 

నీవు నవ్వఁగా - నెల వెల్గులలో - నెనరు దివ్వెలే 
నీవు పాడఁగా - నినదమ్ములలో - నెనరు గీతులే 
నీవు పిల్వఁగా - నిజ మీయెడఁదన్ - నెనరు చిందులే 
నీవు రా సకీ(కా) - నెఱయౌను గదా - నెనరు మన్కిలో 

పాడమంటివా - పద మొక్కటి యీ - వరవిపంచిపై 
నాడమంటివా - నలరించఁగ నీ - యరుణ సంధ్యలో 
నేఁడు నింగిలో - నెలరాజలరున్ - నిశిని జుక్కలన్ 
వేడుకొందు నో - ప్రియ జీవములో - వెలుఁగు నింపుమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
pikaravamu - 

aadhAramu - kalpitamu
chaMpakOtpalamAlalalO modaTi chaturmAtranu tolagiMchi, migilina amarikanu vilOma diSalO amarchagA janiMchina vRttamidi. iMdulO mUDu ashTamAtralu - #UIUIU#, reMDu sa-gaNamulu, #IIIUIU#. kriMda nA udAharaNamulu - 

pikaravamu - ra/ja/ja/ja/sa/laga #UIUIU - IIU IIU - III UIU# 
17 atyashTi 47979

nAmanammulO - navanAdamutO - nayanayammugA@M  
brEmagItiyE - vinipiMchenugA - pikaravammugA 
kAmasuMdarA - kanipiMchave yA - kamalanEtramul 
prEmamaMdirA - priyarAgamutO@M - biluva vElarA 

nIvu navva@MgA - nela velgulalO - nenaru divvelE 
nIvu pADa@MgA - ninadammulalO - nenaru gItulE 
nIvu pilva@mgA - nija mIyeDa@Mdan - nenaru chiMdulE 
nIvu rA sakI(kA) - ne~rayaunu gadA - nenaru man&kilO 

pADamaMTivA - pada mokkaTi yI - varavipaMchipai 
nADamaMTivA - nalariMcha@Mga nI - yaruNa saMdhyalO 
nE@MDu niMgilO - nelarAjalarun - niSini jukkalan 
vEDukoMdu nO - priya jIvamulO - velu@Mgu niMpumA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: