[racchabanda] Re: [Chandassu] ఫలసదనము (శిశుభరణ) #phalasadanamu (SiSubharaNa)#

 

కమలము వదనమొ - కమలము నయనములో 
కమలము కరములొ - కమలము చరణములో 
కమలము హృదయమొ - కమలము చెలువములో 
కమలము సదనమొ - కమలము సృజనములో 

హృదయము దెఱచితి - హితమగు పదములతో 
నదివలెఁ బరువిడె - నగవుల తరఁగలతో 
ముద మతి త్వరగను - బులకల వెలుఁగులతో 
నిది యొక యనుభవ - మిది కడు సుమధురమే 

చివరి గణములు తప్పినవి. సరి చేసిన పద్యములు - 

కమలము వదనము - కమలము నయనమ్ముల్
కమలము కరములు - కమలము చరణమ్ముల్ 
కమలము హృదయము - కమలము చెలువమ్ముల్ 
కమలము సదనము - కమలము సృజనమ్ముల్

హృదయము దెఱచితి - హితమగు పవనమ్ముల్ 
నదివలెఁ బరువిడె - నగవుల యలలందున్  
ముద మతి త్వరగను - బులకల మెఱుపయ్యెన్ 
మృదులము యనుభవ - మిది కడు మధురమ్మే 

క్షమాపణలతో - మోహన
#
kamalamu vadanamo - kamalamu nayanamulO 
kamalamu karamulo - kamalamu charaNamulO 
kamalamu hRdayamo - kamalamu cheluvamulO 
kamalamu sadanamo - kamalamu sRjanamulO 

hRdayamu de~rachiti - hitamagu padamulatO 
nadivale@M baruviDe - nagavula tara@MgalatO 
muda mati tvaraganu - bulakala velu@MgulatO 
nidi yoka yanubhava - midi kaDu sumadhuramE 

chivari gaNamulu tappinavi. sari chEsina padyamulu - 

kamalamu vadanamu - kamalamu nayanammul^
kamalamu karamulu - kamalamu charaNammul^ 
kamalamu hRdayamu - kamalamu cheluvammul^ 
kamalamu sadanamu - kamalamu sRjanammul^

hRdayamu de~rachiti - hitamagu pavanammul^ 
nadivale@M baruviDe - nagavula yalalaMdun^  
muda mati tvaraganu - bulakala me~rupayyen^ 
mRdulamu yanubhava - midi kaDu madhurammae 
#

with apologies! - mOhana 

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (2)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: