[racchabanda] ఉజ్జ్వలా #ujjvalA#

 

ఉజ్జ్వలా - 

ఆధారము - వృత్తరత్నాకరము, అప్పకవీయము

యతి - సంస్కృతములో పాదాంత విరామయతి మాత్రమే. తెలుగులో అప్పకవి ఏడవ అక్షరముతో నుంచెను. నా ఉద్దేశములో ఎనిమిదవ అక్షరమును కూడ ఉంచ వచ్చును. క్రింద రెంటికి ఉదాహరణములు - 

ఉజ్జ్వలా - న/న/భ/ర 12 జగతి 1472

III III - UII UIU విఱుపుతో 

కొలఁకు కమల - గుచ్ఛముతోడఁ గెం- 
దలిరు టలల - తాదృశ మొందఁగా  
వెలుఁగు విరిసె - విన్నున రంగులన్ 
జెలువ మలరెఁ - జిత్రపు భంగులన్ 

రవియు పుట్టెను - రక్తపు ముద్దగా 
భువియు నిండెను - మోహన రాగమై 
నవము దినము - నాదము నిండఁగా 
రవము మొరసె - రంగుల నింగిలో 

IIII IIU - IIU IU విఱుపుతో 

కలరవములతోఁ - గవిగీతముల్ 
నెల వెలుఁగులలో - నెఱ మోదముల్ 
చలి నిసి తెర యు-జ్జ్వల కాంతిలో 
నలరెను హృదిలో - నసితాబ్జముల్ 

మనసున మనసై - మన రమ్మురా 
కను మిట హృదియే - కమలమ్మురా 
తెనుఁగునఁ గవితన్ - దియదీయఁగా 
వినఁగను వడి రా - ప్రియ హాయిగా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
ujjvalA - 

aadhAramu - vRttaratnAkaramu, appakavIyamu

yati - saMskRtamulO pAdAMta virAmayati mAtramE. telugulO appakavi EDava axaramutO nuMchenu. nA uddESamulO enimidava axaramunu kUDa uMcha vachchunu. kriMda reMTiki udAharaNamulu - 

ujjvalA - na/na/bha/ra 12 jagati 1472

#III III - UII UIU# vi~ruputO 

kola@Mku kamala - guchChamutODa@M geM- 
daliru Talala - tAdRSa moMda@MgA  
velu@Mgu virise - vinnuna raMgulan 
jeluva malare@M - jitrapu bhaMgulan 

raviyu puTTenu - raktapu muddagA 
bhuviyu niMDenu - mOhana rAgamai 
navamu dinamu - nAdamu niMDa@MgA 
ravamu morase - raMgula niMgilO 

#IIII IIU - IIU IU# vi~ruputO 

kalaravamulatO@M - gavigItamul 
nela velu@MgulalO - ne~ra mOdamul 
chali nisi tera yu-jjvala kAMtilO 
nalarenu hRdilO - nasitAbjamul 

manasuna manasai - mana rammurA 
kanu miTa hRdiyE - kamalammurA 
tenu@Mguna@M gavitan - diyadIya@MgA 
vina@mganu vaDi rA - priya hAyigA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: