[racchabanda] వరవీణ / కుసుమ షట్పది #varavINa / kusuma shaTpadi#

 

వరవీణ / కుసుమ షట్పది - 

ఆధారము - కల్పితము 
గతి - మిశ్రగతి (అష్టమాత్రలు 5,3)

నిన్న మీకు కవికంఠభూషణ వృత్తమును పరిచయము చేసినాను. దానికి చేసిన మార్పులు, కూర్పులే ఈ వరవీణ వృత్తము. ఇందులో వరుసగా మూడు స/జ గణములు, చివర స/లగ గణములు. ఇప్పుడు దీనిని ఒక షట్పదిగా పాడుకొన వీలగును. చాల లయబద్ధముగా నుంటుంది వినడానికి. 

స/జ/స/జ/స/జ/స/లగ IIUI UI / IIUI UI / IIUI UI - IIUIU
23 వికృతి 3062508

మనసూఁగె నాదు 
తనువూఁగె నాదు 
కనులిందు నిన్ను - గనఁగా సకీ 
వినఁగాను నీదు 
స్వనమందుఁ జిందు 
ప్రణయంపు గీతి - రమణీయమై 

చినచిన్న పల్కు 
లనురక్తి కుల్కు 
లనిశమ్ము నాకు - నసమానమే 
ప్రణయంపు కాన్క 
మణిమాల నీకు 
మనమార నిత్తు - మధురాధరీ 

కరమందునుండు 
వరవీణ మీటి 
స్వరరాగ గీతిఁ - బలికించవా 
హరుసమ్ము నిచ్చు 
సరసోక్తు లెన్నొ 
చిఱునవ్వుతోడఁ - జిలికించవా 

మఱపించ రమ్ము 
కురిపించి సొంపు
మురిపించ రమ్ము - స్ఫురితస్వనీ 
సరసాంగి నీకు 
విరిమాల వేసి  
తరియింపఁ జేతుఁ - దరుణీమణీ

(రెండు షట్పదులను చేరిస్తే ఒక వృత్తము అవుతుంది.)

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
varavINa / kusuma shaTpadi - 

aadhAramu - kalpitamu 
gati - miSragati (ashTamAtralu 5,3)

ninna mIku kavikaMThabhUshaNa vRttamunu parichayamu chEsinAnu. dAniki chEsina mArpulu, kUrpulE ee varavINa vRttamu. iMdulO varusagA mUDu sa/ja gaNamulu, chivara sa/laga gaNamulu. ippuDu dInini oka shaTpadigA pADukona vIlagunu. chAla layabaddhamugA nuMTuMdi vinaDAniki. 

sa/ja/sa/ja/sa/ja/sa/laga #IIUI UI / IIUI UI / IIUI UI - IIUIU#
23 vikRti 3062508

manasU@Mge nAdu 
tanuvU@Mge nAdu 
kanuliMdu ninnu - gana@MgA sakI 
vina@MgAnu nIdu 
svanamaMdu@M jiMdu 
praNayaMpu gIti - ramaNIyamai 

chinachinna palku 
lanurakti kulku 
laniSammu nAku - nasamAnamE 
praNayaMpu kAn&ka 
maNimAla nIku 
manamAra nittu - madhurAdharI 

karamaMdunuMDu 
varavINa mITi 
svararAga gIti@M - balikiMchavA 
harusammu nichchu 
sarasOktu lenno 
chi~runavvutODa@M - jilikiMchavA 

ma~rapiMcha rammu 
kuripiMchi soMpu
muripiMcha rammu - sphuritasvanI 
sarasAMgi nIku 
virimAla vEsi  
tariyiMpa@M jEtu@M - daruNImaNI

(reMDu shaTpadulanu chEristE oka vRttamu avutuMdi.)

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: