[racchabanda] విచిత్రగీతి #vichitragIti#

 

విచిత్రగీతి - 

ఆధారము - సీతారామ కెదిల్లాయ ఛందోదర్పణము (కన్నడములో) 
ఆర్యాభేదమైన గీతిలో ఆఱవ గణము నల/జ గణముగా నుంచి మిగిలిన గణములను తోచినట్లు ర-గణ మిశ్రితము చేసి వ్రాసినప్పుడు అది విచిత్రగీతి అవుతుంది. 

ఈవసంతయామిని పిలిచె 
నీవెన్నెల కాంతి పిలిచె - హృద్యమ్మై 
జీవితమ్ము సుందర మనుచు  
భావనమ్ములు భాసురమని - భవ్యమ్మై 

మోహన రూపా మాధవా 
నాహృదయేశ్వరుఁడ నీదు - నవ్వులతో 
వాహినివలె రా చిందఁగా 
మోహపు వర్షమున ముంచ - మోదముతో 

కమ్మఁగాఁ గనులకు నిమ్ముగా 
సొమ్ముగా మనసునకు నిండు - శోభగా రా 
చిమ్మఁగా నమృతము సోనగా 
రమ్ము నా గృహమునకు నాడ - రాసకేళిన్ 

కదలెడు యాకుల సవ్వడుల్ 
మదిలో స్పందనమ్ము సేసె - మందమ్మై
యిది యొక విచిత్ర గీతియే 
హృదయపు వీథిలోన మెఱసెఁ - బ్రేమమ్మై 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vichitragIti - 

aadhAramu - sItArAma kedillAya ChaMdOdarpaNamu (kannaDamulO) 
aaryAbhEdamaina gItilO aa~rava gaNamu nala/ja gan'amugA nuMchi migilina gaNamulanu tOchinaTlu ra-gaNa miSritamu chEsi vrAsinappuDu adi vichitragIti avutuMdi. 

eevasaMtayAmini piliche 
nIvennela kAMti piliche - hRdyammai 
jIvitammu suMdara manuchu  
bhAvanammulu bhAsuramani - bhavyammai 

mOhana rUpA mAdhavA 
nAhRdayESvaru@MDa nIdu - navvulatO 
vAhinivale rA chiMda@MgA 
mOhapu varshamuna muMcha - mOdamutO 

kamma@MgA@M ganulaku nimmugA 
sommugA manasunaku niMDu - SObhagA rA 
chimma@MgA namRtamu sOnagA 
rammu nA gRhamunaku nADa - rAsakELin 

kadaleDu yAkula savvaDul 
madilO spaMdanammu sEse - mamdammai
yidi yoka vichitra gItiyE 
hRdayapu vIthilOna me~rase@M - brEmammai 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: