Re: [racchabanda] Re: Aw: R e : [racc haban da] ప్ ర శ్నలు

 


Sorry! బసవ పురాణం కాదు. (అసలు అలాటి పేరుతో పుస్తకం ఉందో లేదో!) My mistake. Sorry!

 'షష్టాష్టకము' అన్న మాటకు reference "వరాహ పురాణము" నుండి ఇవ్వబడింది. పుస్తకం చదువుదామని లింక్ మళ్లీ చూస్తే, నా తప్పు తెలిసింది.

నంది మల్లయ, ఘంట సింగయ అను ఇద్దరు కవులు 'వరాహ పురాణము'ను రచించారని, గ్రంథపీఠికలో పుట్టపర్తి నారాయణాచార్యులు చెప్పినారు. వీరే తెలుగులో మొదటి జంటకవులట.

కావ్యదృష్టితో చూస్తే ఈ జంటకవులు ఎన్నుకున్న విషయం 'బల్బజము' అని పుట్టపర్తి అన్నారు.

బల్బజము అంటే ఏమిటి దేవా! అని ఆంధ్రభారతి నిఘంటువు కి వెళ్లి చూసాను. బల్బజము అంటే తృణప్రాయమట. In other words - it is pithless, sapless.

మరి ఆ కవులు బల్బజం ఎందుకు ఎన్నిక చేసుకున్నారంటే, కృతిభర్త నరసరాయడు,( కృష్ణదేవరాయల తండ్రి.) ఆయన వంశం వారికి 'ధరణీ వరాహ' అని బిరుదు ఉండేదట. వారి కేతన చిహ్నం వరాహము. అందువలన కృతిభర్తను మెప్పించటానికోసం -వరాహదేవుడు, ధరావరారోహకు-  పురాణకథలు చెప్పించినట్టుగా గ్రంథము రచించబడినట్టుందని, పీఠికలో ఉన్నది.

12 ఆశ్వాసములు. 2000 పద్యాలు. పైగా సృష్టి మొదటి నుండి, నాలుగు యుగాలగురించి చెప్పి, నాలుగు వేదాల సారముంటుందట. ఇది చదవటం నా వల్ల అయ్యే పనేనా!

అంతవరకైతే సరే, కాని అడుగడుగునా శ్రాద్ధ ప్రక్రియలు, వ్రతములు, మాహాత్మ్యములు ఉంటాయట. పైగా "ప్రతి వ్రతంలో స్వర్గ నరకాలు తిష్ఠ వేసుకుని" ఉంటాయట. చూసాను, సూచికలో. నిజమే, ఒకచోట వరసాగ్గా అన్నీ తిథులూ, వ్రతాలూ.

No way! Why would I want to read them!

పుట్టపర్తి ఈ జంట కవులు – గర్భ కవిత్వానికి ఆద్యులనీ, వీరికీ నాచన సోమనాథుని లాగానే, శబ్దాలంకార ప్రియత్వం, చమత్కార కవిత్వ ప్రియత్వం ఉన్నాయన్నారు.

Those too, ha!

రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వ్యాసం లోని ముగింపు మాటలు గుర్తుకు వచ్చాయి.

 "నాచన సోమునిది భావముల ప్రాధాన్యము లేక వస్తువు, రచన వీనికి జేరిన కళ. ఆ కాలమున తెలుగు సాహిత్యమున కిది నవీనము" .... "దీనికి లోగనివాడు లేడు. కాని నిదానముగా యోజించినపుడు ఇంతకంటే మంచి కళ కలదని తలపని వాడును లేడు.")

ఇంకా తొందరగా  'వరాహపురాణము' పుటలు తిప్పుతూ, ఆఖరి పేజీలో రాముడి మీద ఈ జంటకవులు చెప్పిన ఈ కందపద్యం చూసాను.

 " రామానుతతనుమారా

తామరపాతతకరాకతతసారమతా

శ్రీ మహిమహమహిమ శ్రీ

రామ సమ సరాగసాగరాసమ సమరా."

 

That does it. I have taken the book వరాహ పురాణము off my reading list.

-Lyla

__._,_.___

Posted by: lylayfl@aol.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (10)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: