www.telugubhakti.com Digest Number 4857

1 Message

Digest #4857
1

Message

Fri Jan 25, 2019 7:55 pm (PST) . Posted by:

telugubhaktipages

*8. హోమ్వర్కు*


సోమూ మొదటసారి స్నేహితుడు రామూతో హొటల్కువెళ్ళాడు. అక్కడ పద్ధతులు, వాతావరణం అంతా సోమూకు కొత్తగా ఉంది. అతను క్యాష్కౌంటరులో ముందే డబ్బులివ్వాలా అని వాకబు చేసాడు. దానికి హోటలు యజమాని 'మీరు తృప్తిగా తినండి తరువాత బిల్లు పే చేయవచ్చు' అన్నాడు. సోమూ, ఆ స్నేహితుడు రామూ కలిసి వడలు చెప్పారు. స్నేహితుడు రామూ ఒకటే వడ తిని 'ఇంక చాలు' అని చెప్పాడు. సోమూ మాత్రం ఏడు వడలు తిన్నాడు.
హోటలు యజమాని సోమూతిన్న ఏడు వడలకు రామూ తిన్న ఒక వడకు సోమ్ము ఇమ్మన్నాడు. సోమూ క్యాష్కౌంటర్దగ్గర యజమానితో పేచీ పెట్టుకున్నాడు. తాను తనకు ఒక వడకే డబ్బిస్తానంటాడు. హొటలు యజమాని ఎందుకు అని పశ్నిస్తే సోమూ ఇలా సమాధానం చెప్పాడు. నా స్నేహితుడు రామూ మీ ఒక్క వడకే తృప్తి చెందాడు. నాకు మాత్రం ఆకలి తీరే వడ ఏడవ వడగా వడ్డించారు. అంటే మీరు వడ్డించిన ముందు ఆరు వడలకు ఆకలితీర్చే గుణం లేదన్నమాట. ఆ ఆరు వడలు పనికి రానివి వాటికి డబ్బు ఇవ్వడం దండగ అన్నాడు. అందుకుని ఆకలితీర్చే గుణం కలిగిన ఆఖరి వడకే డబ్బు అంటూ వాదించాడు. హొటలు యజమాని చిక్కులోపడ్డ్డాడు. ఇప్పుడెలాగా? హొటల్యజమాని సోమూ స్నేహితుడ్ని రామూను అడిగాడు 'అయ్యా హోటల్కు వచ్చే ముందు ఏమైనా తిన్నారా?' అని దానికి ఆ స్నేహితుడు 'ఆరు వడలు ఇంట్లో తినివచ్చా'నని సమాధానం చెప్పాడు. రామూ మా ఆవిడ కూడా వడలు చేసింది సోమూ మా ఇంటికి రాక ముందు మా ఆవిడ పెట్టిన ఆరు వడలు ఇంట్లో తిన్నాను అన్నాడు. అదీ సంగతి! అందుకే అతనికి హొటల్లోని ఏడవ వడ తినగానే కడుపు నిండింది!! అదే మాదిరిగా మనలో కొంతమంది గత జన్మలలో ఆధ్యాత్మిక సాధన చేసి ఉంటారు! వారు ఆధ్యాత్మిక హోమ్వర్కు ముందు జన్మలలో చేసేశారు కనుక వారికి అధ్యాత్మిక ఉన్నతి చాలా త్వరగా ఉంటుంది. ఈ జన్మలో మనం ఆధ్యాత్మిక సాధన ఎక్కడ ఆపామో మరుసటి జన్మలో అక్కడనుంచి మళ్ళీ ఆధ్యాత్మిక సాధన మొదలౌతుంది. చాలా మంది శాస్త్ర అధ్యయనం అవసరమా? రమణమహర్షి, రామకృష్ణ పరమహంస లాంటి మహాత్ములు ఎందరో ఏ శాస్త్ర అధ్యయనం చేయకుండానే మొక్షం పొందారు కదా! అంటుంటారు. దానికి సమాధానం ఇదే వారు గత జన్మలలో పూర్తిగా శాస్త్ర అధ్యయనం చేసి ఉండవచ్చు. అందుకని యీ జన్మలో శాస్త్ర అధ్యయనం అవసరం లేకపోయింది.
కొంతమందికి జీవన్ముక్తి రాకుండానే మరణిస్తామేమొని సంశయం వస్తుంది? అయితే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఇలా చెపుతారు. సాధకులు ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన ఎక్కడ వదిలారో మరుజన్మలో అక్కడనుంచి ఆధ్యాత్మిక ప్రయాణం మళ్ళీ మొదలౌతుంది.


*ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ఉషిత్వ శాశ్వతీః సమాః|*
*శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో2భిజాయతే|| గీత 6 -41*


యోగభ్రష్టుడు (ఈ జన్మలో ఆధ్యాత్మిక సాధన అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం పూర్తి కాకుండా, జీవన్ముక్తి సాధిóంచకుండా మరణించిన వారిని గీతలో కృష్ణపరమాత్మ యోగభ్రష్టుడు అంటున్నారు.)

పుణ్యాత్ములు పొందు లోకములను అనగా సర్గాది లోకాలను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన పిదప పవిత్రులైన సంపన్నులైన సంస్కారవంతులైన వైదికసంప్రదాయ గృహములో జన్మించి తన ఆధ్యాత్మిక సాధనను తిరిగి కొనసాగించును.


www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: