[racchabanda] ఇంద్రభాను - 3 #iMdrabhAnu - 3#

 

ఇంద్రభాను - 3

ఈ వృత్తపు అమరికను ఈ విధముగా కూడ వ్రాయ వీలగును - UI - UIUIU - UIUIU. ఇలా వ్రాసినప్పుడు, ప్రాసనుంచి, ప్రతి పాదమునకు వేఱువేఱు ప్రాసయతులను (యతితో) ఉంచి వ్రాయ వచ్చును. ఆ ప్రయత్నమునకు ఉదాహరణములు - 

ఇంద్రభాను - ర/జ/త/ర UI - UIUIU - UIUIU
12 జగతి 1323

స్వామి నిన్ను జేరనా - సన్నుతించనా 
ఏమి నీదు కోర్కెయో - యీధరిత్రిపై 
మోము చూపవేలకో - మోపు చాలురా 
ప్రేమ మానసమ్ములో - వీణ మ్రోఁతరా 

నిన్ను దల్వఁగా సదా - నిల్వలేనురా 
తెన్ను కానకుండెరా - దీననైతిరా 
వెన్ను తట్టి లేపరా - పెట్టుచెట్టుగా 
కన్న నీవె యండరా - కావ రమ్మురా 
(పెట్టుచెట్టు = కల్పవృక్షము) 

పూల కారు వచ్చెరా - భూరి వర్ణమై 
చాల కోరికల్ మదిన్ - జారుహాసినీ 
నీల నీరదాకృతీ - నేర మెంచకోయ్ 
కేల హార మందుకో - క్షీరపాత్రతో 

ఈ వృత్తములో మొదటి రెండు అక్షరములను తొలగిస్తే మనకు హరహర (కర్ణపాలికా, పంక్తికా, మరాళికా, మౌక్తిక) వృత్తము లభిస్తుంది. 

హరిహర - ర/య/జ/గ UIUIU - UIUIU 
10 పంక్తి 331 

పైన ఇవ్వబడిన మూడవ ఉదాహరణమును పది యక్షరముల వృత్తముగా మార్చగా లభించినది - 

కారు వచ్చెరా - భూరి వర్ణమై 
కోరికల్ మదిన్ - జారుహాసినీ 
నీరదాకృతీ - నేర మెంచకోయ్ 
హార మందుకో -  క్షీరపాత్రతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
iMdrabhAnu - 3

ee vRttapu amarikanu ee vidhamugA kUDa vrAya vIlagunu - #UI - UIUIU - UIUIU#. ilA vrAsinappuDu, prAsanuMchi, prati pAdamunaku vE~ruvE~ru prAsayatulanu (yatitO) uMchi vrAya vachchunu. aa prayatnamunaku udAharaNamulu - 

iMdrabhAnu - ra/ja/ta/ra #UI - UIUIU - UIUIU#
12 jagati 1323

svAmi ninnu jEranA - sannutiMchanA 
Emi nIdu kOrkeyO - yIdharitripai 
mOmu chUpavElakO - mOpu chAlurA 
prEma mAnasammulO - vINa mrO@MtarA 

ninnu dalva@MgA sadA - nilvalEnurA 
tennu kAnakuMDerA - dInanaitirA 
vennu taTTi lEparA - peTTucheTTugA 
kanna nIve yaMDarA - kAva rammurA 
(peTTucheTTu = kalpavRxamu) 

pUla kAru vachcherA - bhUri varNamai 
chAla kOrikal madin - jAruhAsinI 
nIla nIradAkRtI - nEra meMchakOy 
kEla hAra maMdukO - xiirapAtratO 

ee vRttamulO modaTi reMDu axaramulanu tolagistE manaku harahara (karNapAlikA, paMktikA, marALikA, mauktika) vRttamu labhistuMdi. 

harihara - ra/ya/ja/ga #UIUIU - UIUIU# 
10 paMkti 331 

paina ivvabaDina mUDava udAharan'amunu padi yaxaramula vRttamugA mArchagA labhiMchinadi - 

kAru vachcherA - bhUri varNamai 
kOrikal madin - jAruhAsinI 
nIradAkRtI - nEra meMchakOy 
hAra maMdukO - xiirapAtratO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: