[racchabanda] ఆమని సుమము #aamani sumamu#

 

ఆమని సుమము - 

ఆధారము - రత్నాకరుని హరవిజయము (వృత్తము పేరు తెలుపలేదు)
నడక - 4, 4 - 8 మాత్రలు 
వర్గము - మాలతి 

ఆమని సుమము - భ/న/న/జ/గ UII IIII - IIIUIU 
13 అతిజగతి 3071 

ఆమని సుమములు - హరుస మిచ్చునా 
కోమల రవములు - గుతుక మిచ్చునా 
శ్యామల రాత్రులు - సరస మిచ్చునా 
ప్రేమము సూపెడు - ప్రియుఁడు లేఁడుగా 

వేణువు స్వరములు - వినఁగ లేవుగా 
వీణయు మొరసెను - విరహగీతికన్ 
ప్రాణము నిను గనఁ - బరితపించఁగా  
నేనొక జడముగ - నిలిచియుంటినే 

చేలము వదలుము - చిలిపి కృష్ణుఁడా 
చాలిఁక సరసము - సరియు కాదురా 
తాళుము పనులవి - తలకు మించెరా 
మేలము వలదుర - మిహిరుఁ జూడరా 

ఏమని పలుకుట - హృదియు మ్రోఁగఁగాఁ 
బ్రేమము మనసునఁ - బ్రియ పరాగమే 
సోముని వెలుఁగులు - సొగసు లీనఁగా 
స్వామిని గొలువఁగ - సమయ మిప్పుడే 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
aamani sumamu - 

aadhAramu - ratnAkaruni haravijayamu (vRttamu pEru telupalEdu)
naDaka - 4, 4 - 8 mAtralu 
vargamu - mAlati 

aamani sumamu - bha/na/na/ja/ga #UII IIII - IIIUIU# 
13 atijagati 3071 

aamani sumamulu - harusa michchunA 
kOmala ravamulu - gutuka michchunA 
SyAmala rAtrulu - sarasa michchunA 
prEmamu sUpeDu - priyu@MDu lE@MDugA 

vENuvu svaramulu - vina@Mga lEvugA 
vINayu morasenu - virahagItikan 
prANamu ninu gana@M - baritapiMcha@MgA  
nEnoka jaDamuga - nilichiyuMTinE 

chElamu vadalumu - chilipi kRshNu@MDA 
chAli@Mka sarasamu - sariyu kAdurA 
tALumu panulavi - talaku miMcherA 
mElamu valadura - mihiru@M jUDarA 

Emani palukuTa - hRdiyu mrO@Mga@MgA@M 
brEmamu manasuna@M - briya parAgamE 
sOmuni velu@Mgulu - sogasu lIna@MgA 
svAmini goluva@Mga - samaya mippuDE 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: