[racchabanda] గర్భకవిత్వములో మఱొక కోణము #garbhakavitvamulO ma~roka kONamu#

 

గర్భకవిత్వములో మఱొక కోణము - 

చంపక లేక ఉత్పలమాల వృత్తములలో తేటగీతి, మధ్యాక్కరల ఒక ప్రత్యేకత గర్భితమైన విషయము అందఱికి తెలిసినదే. 

UII UIU + III UII UII UI UI (తే.గీ.) + U = ఉత్పలమాల

నేను దీనిని ఇంకొక కోణములో ఇప్పుడు చూస్తున్నాను. అదేమంటే UII UIU + (తే.గీ.) + U గా వ్రాసినప్పుడు మనకు క్రొత్త లయలు కలుగుతాయి. క్రింద ఒక ఉదాహరణమును ఇస్తున్నాను. ఇందులో మాలికలలోని భ-గణములకు బదులు ర-గణములు ఉన్నాయి. మొదటి గలమునకు బదులు న-గణము ఉన్నది. దీని గణములు - భ/ర/న/ర/ర/న/ర. ఇది పాదమునకు 21 అక్షరములు ఉండే ప్రకృతి ఛందములోని 763351వ వృత్తము. క్రింద ఒక ఉదాహరణము - 

చూడఁగ రమ్మురా కనులు - చూడఁగా నెంచెరా కమలనేత్ర నిన్ 
బాడఁగ రమ్మురా వఱలు - పాటలో మున్గి నేఁ బరవశింతురా 
ఆడఁగ రమ్మురా మనసు - హర్షమం దాడురా మమత నిండఁగా 
నేఁడిట యామినిన్ నెలయు - నిండెరా నీకునై నిలిచియుంటిఁగా 

ఇందులోని తేటగీతి - 

కనులు చూడఁగా నెంచెరా - కమలనేత్ర 
వఱలు పాటలో మున్గి నేఁ - బరవశింతు
మనసు హర్షమం దాడురా - మమత నిండ
నెలయు నిండెరా నీకునై - నిలిచియుంటి

UII UIU III - UII UII UI (మధ్యాక్కర) + UIU = ఉత్పలమాల

పైన వివరించిన విధముగా మధ్యాక్కరను వ్రాసి దాని చివర ఒక ర-గణమును ఉంచితే మనకు క్రొత్త క్రొత్త లయలు కలుగుతాయి. క్రింద ఒక ఉదాహరణము. ఇందులో భ-గణములకు బదులు ర-గణము, త-గణములను వాడినాను. దీని అమరిక త/ర/ర/ర/య/జ/గ. ఇది అతిధృతి ఛందములోని 169109వ వృత్తము. 

అద్దాల మేడలో నీదు - యందమ్ము చూడఁగా నెంతు భామినీ 
నిద్దంపు వెన్నెలల్ ముంచె - నిక్కమ్ముగాఁ బ్రపంచమ్ముఁ గామినీ 
వద్దంచుఁ జెప్పవద్దింక - వాంఛింతు నిన్ గదా - ప్రేమ వాహినీ 
ముద్దీయ రమ్ము నాకిప్డు - మోహమ్ముఁ దాళఁగా లేను మోహినీ 

ఇందులోని మధ్యాక్కర (త/ర/గల - త/ర/గల)- 

అద్దాల మేడలో నీదు - యందమ్ము చూడఁగా నెంతు 
నిద్దంపు వెన్నెలల్ ముంచె - నిక్కమ్ముగాఁ బ్రపంచమ్ము 
వద్దంచుఁ జెప్పవద్దింక - వాంఛింతు నిన్ గదా ప్రేమ 
ముద్దీయ రమ్ము నాకిప్డు - మోహమ్ముఁ దాళఁగా లేను 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
garbhakavitvamulO ma~roka kONamu - 

chaMpaka lEka utpalamAla vRttamulalO tETagIti, madhyAkkarala oka pratyEkata garbhitamaina vishayamu aMda~riki telisinadE. 

#UII UIU + III UII UII UI UI# (tE.gI.) + #U# = utpalamAla

nEnu dInini iMkoka kONamulO ippuDu chUstunnAnu. adEmaMTE #UII UIU +# (tE.gI.) + #U# gA vrAsinappuDu manaku krotta layalu kalugutAyi. kriMda oka udAharaNamunu istunnAnu. iMdulO mAlikalalOni bha-gaNamulaku badulu ra-gaNamulu unnAyi. modaTi galamunaku badulu na-gaNamu unnadi. dIni gaNamulu - bha/ra/na/ra/ra/na/ra. idi pAdamunaku 21 axaramulu uMDE prakRti ChaMdamulOni 763351va vRttamu. kriMda oka udAharaNamu - 

chUDa@Mga rammurA kanulu - chUDa@MgA neMcherA kamalanEtra nin 
bADa@Mga rammurA va~ralu - pATalO mun&gi nE@M baravaSiMturA 
aaDa@Mga rammurA manasu - harshamaM dADurA mamata niMDa@MgA 
nE@MDiTa yAminin nelayu - niMDerA nIkunai nilichiyuMTi@MgA 

iMdulOni tETagIti - 

kanulu chUDa@MgA neMcherA - kamalanEtra 
va~ralu pATalO mun&gi nE@M - baravaSiMtu
manasu harshamaM dADurA - mamata niMDa
nelayu niMDerA nIkunai - nilichiyuMTi

#UII UIU III - UII UII UI# (madhyAkkara) + #UIU# = utpalamAla

paina vivariMchina vidhamugA madhyAkkaranu vrAsi dAni chivara oka ra-gaNamunu uMchitE manaku krotta krotta layalu kalugutAyi. kriMda oka udAharaNamu. iMdulO bha-gaNamulaku badulu ra-gaNamu, ta-gaNamulanu vADinAnu. dIni amarika ta/ra/ra/ra/ya/ja/ga. idi atidhRti ChaMdamulOni 169109va vRttamu. 

addAla mEDalO nIdu - yaMdammu chUDa@MgA neMtu bhAminI 
niddaMpu vennelal muMche - nikkammugA@M brapaMchammu@M gAminI 
vaddaMchu@M jeppavaddiMka - vAMChiMtu nin gadA - prEma vAhinI 
muddIya rammu nAkipDu - mOhammu@M dALa@MgA lEnu mOhinI 

iMdulOni madhyAkkara (ta/ra/gala - ta/ra/gala)- 

addAla mEDalO nIdu - yaMdammu chUDa@MgA neMtu 
niddaMpu vennelal muMche - nikkammugA@M brapaMchammu 
vaddaMchu@M jeppavaddiMka - vAMChiMtu nin gadA prEma 
muddIya rammu nAkipDu - mOhammu@M dALa@MgA lEnu 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: