[racchabanda] ఇంద్రభాను #iMdrabhAnu#

 

ఇంద్రభాను - 

ఆధారము - కల్పితము 
శ్రీ ఇంద్రకంటి పినాకపాణిగారి సూచనపై ఆధారము. వారి పేరు కూడ వృత్తములో ఉన్నది. 

ఇంద్రభాను - ర/జ/త/ర UI UI UIU - UI UIU 
12 జగతి 1323 

శ్యామలాంగి భామినీ - హంసగామినీ 
ప్రేమపూర్ణ వాహినీ - విశ్వమోహినీ 
సామగానలోలినీ - చారు మాలినీ 
రా మనోనివాసినీ - రమ్య హాసినీ 

చంద్రశేఖరా హరా - చండికేశ్వరా 
ఇంద్రభాను సేవితా - నృత్యమోదితా 
సాంద్రరాగ రంజితా - సర్వ వర్జితా 
తంద్రనుండి లేపరా - తాప మాపరా 

ప్రాణ మీవె మాధవా - రాధికాధవా 
వేణువూఁద రమ్మురా - ప్రేమ నిమ్మురా 
దీనురాల నేనురా - దేవ గానరా 
మానసాన నుండరా - మంచి యండరా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
iMdrabhAnu - 

aadhAramu - kalpitamu 
SrI iMdrakaMTi pinAkapANigAri sUchanapai aadhAramu. vAri pEru kUDa vRttamulO unnadi. 

iMdrabhAnu - ra/ja/ta/ra #UI UI UIU - UI UIU# 
12 jagati 1323 

SyAmalAMgi bhAminI - haMsagAminI 
prEmapUrNa vAhinI - viSvamOhinI 
sAmagAnalOlinI - chAru mAlinI 
rA manOnivAsinI - ramya hAsinI 

chaMdraSEkharA harA - chaMDikESvarA 
iMdrabhAnu sEvitA - nRtyamOditA 
sAMdrarAga raMjitA - sarva varjitA 
taMdranuMDi lEparA - tApa mAparA 

prANa mIve mAdhavA - rAdhikAdhavA 
vENuvU@Mda rammurA - prEma nimmurA 
dInurAla nEnurA - dEva gAnarA 
mAnasAna nuMDarA - maMchi yaMDarA 

vidhaeyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: