[racchabanda] క్రొత్త విఱుపుతో చంపకోత్పలమాలలు #krotta vi~ruputO chaMpakOtpalamAlalu#

 

క్రొత్త విఱుపుతో చంపకోత్పలమాలలు - 

మొదటి నాలుగు గణాలు ద్విపదవలె (న-గణమునకు బదులు స-గణము), తఱువాత రెండు పంచమాత్రలు. చంపకమాలకు ఇలాటి విఱుపు సంస్కృతములో పంచకావలి రూపములో నున్నది. 

మనసున దల్తు నిన్ - మధురమై చెలియా - మఱువంగ శక్యమా 
ప్రణయపు వార్ధిలోఁ - బలుకులే మణులౌ - వరసుందరీమణీ 
వినఁగను బల్కులన్ - బ్రియతమా వరమే - వికసించు డెందమే 
నను గన రా సకీ - నయముగా నవమై - నగుమోము చందమే 

హరుసము పొంగుఁగా - హరియనన్ మదిలో - ననిశమ్ము క్రొత్తగా 
కరుణకు ధామ మా - కమలనేత్రుఁడుగా - కరుణించ వచ్చునో 
తెరువును జూడఁగాఁ - దెలియ దా మొగమే - దినమో నిరాశయే 
మఱిమఱి వానినే - మనసులోఁ దలువన్ - మధురానుభూతియే 

నీలము మేను వె-న్నెలల హాసములో - నెలవంక వంపులే 
నీలము పింఛ మా - నెమలి నాట్యములో - నిశిలోన నింపులే 
నీలము రాత్రి యా - నెలఁతుకల్ వనిలో - నృతిలోన నంచలే 
నీలపు వెల్గులో - నిఖిలమే కలయో - నెఱయయ్యె వాంఛలే 

విధేయుడు - జెజ్ఝాల కృష్ణ మోహన రావు
#
krotta vi~ruputO chaMpakOtpalamAlalu - 

modaTi nAlugu gaNAlu dvipadavale (na-gaNamunaku badulu sa-gaNamu), ta~ruvAta reMDu paMchamAtralu. chaMpakamAlaku ilATi vi~rupu saMskRtamulO paMchakAvali rUpamulO nunnadi. 

manasuna daltu nin - madhuramai cheliyA - ma~ruvaMga SakyamA 
praNayapu vArdhilO@M - balukulE maNulau - varasuMdarImaNI 
vina@Mganu balkulan - briyatamA varamE - vikasiMchu DeMdamE 
nanu gana rA sakI - nayamugA navamai - nagumOmu chaMdamE 

harusamu poMgu@MgA - hariyanan madilO - naniSammu krottagA 
karuNaku dhAma mA - kamalanEtru@MDugA - karuNiMcha vachchunO 
teruvunu jUDa@MgA@M - deliya dA mogamE - dinamO nirASayE 
ma~rima~ri VAninE - manasulO@M daluvan - madhurAnubhUtiyE 

nIlamu mEnu ve-nnelala hAsamulO - nelavaMka vaMpulE 
nIlamu piMCha mA - nemali nATyamulO - niSilOna niMpulE 
nIlamu rAtri yA - nela@Mtukal vanilO - nRtilOna naMchalE 
nIlapu velgulO - nikhilamE kalayO - ne~rayayye vAMChalE 

vidhEyuDu - jejJAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: