[racchabanda] పంచ మాత్రలతో సాంగత్యము #paMcha mAtralatO sAMgatyamu#

 

పంచ మాత్రలతో సాంగత్యము - 

సంగీత మాపేరు - శ్రవణముల కింపుగాఁ 
బొంగె నీ హృదయమున ముదము 
రంగయన నమవాస - రాత్రిలో వెన్నెలలు 
శృంగార కవితలకు నిల్లు

శ్యామలము రాత్రి యిది - చంద్రహీనము నింగి 
ప్రేమమయి కురిపించు వెలుఁగు 
కోమలము రాత్రి యిది - కూర్మితో నను జేరి 
కామవర్ధనిలోఁ బాడు కవిత 

మోహన తరంగిణిని - మోదముగ నీఁద రా 
వాహినిగ మారు మన వాంఛ 
దేహ మొక శలభమై - దీపశిఖలో మండు 
స్నేహమ్ము సాయమును జేయు 

అంత్యప్రాసతో షట్పదిగా సాంగత్యము - 

పున్నమియు నేఁడిందు  
వెన్నెలల ఱేఁడందు 
చెన్నుగాఁ బాడుమా చెలియ 
వన్నెలకు హరివిల్లు 
కన్ను లిఁక రాజిల్లు 
సన్నజాజులె నీవు సకియ 

రాగముల కొక మందు 
భోగముల కొక విందు 
సాఁగనీ నేఁడిందు సాకి
మూఁగవోయితి నిందు 
నాగముగ నీముందు 
సాఁగనీ యీచిందు సాకి 

విరహమే యగు తోడు 
నరకమ్ములో వాఁడు 
నిరతమ్ము కార్చుఁ గనీళ్లు 
హరుసమ్ము లేకుండ 
తెరువులను గనకుండ 
నిరతమ్ము కార్చనీ నీళ్లు

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
paMcha mAtralatO sAMgatyamu - 

saMgIta mApEru - SravaNamula kiMpugA@M 
boMge nI hRdayamuna mudamu 
raMgayana namavAsa - rAtrilO vennelalu 
SRMgAra kavitalaku nillu

SyAmalamu rAtri yidi - chaMdrahInamu niMgi 
prEmamayi kuripiMchu velu@Mgu 
kOmalamu rAtri yidi - kuurmitO nanu jEri 
kAmavardhanilO@M bADu kavita 

mOhana taraMgiNini - mOdamuga nI@Mda rA 
vAhiniga mAru mana vAMCha 
dEha moka Salabhamai - dIpaSikhalO maMDu 
snEhammu sAyamunu jEyu 

aMtyaprAsatO ShaTpadigA sAMgatyamu - 

punnamiyu nE@MDiMdu  
vennelala ~rE@MDaMdu 
chennugA@M bADumA cheliya 
vannelaku harivillu 
kannu li@Mka rAjillu 
sannajAjule nIvu sakiya 

rAgamula koka maMdu 
bhOgamula koka viMdu 
sA@MganI nE@MDiMdu sAki
mU@MgavOyiti niMdu 
nAgamuga nImuMdu 
sA@MganI yIchiMdu sAki 

virahamanu yI chE@Mdu 
narakammulO vA@MDu 
niratammu kArchu@M gannILlu  
harusammu lEkuMDa 
teruvulanu ganakuMDa 
niratammu kArchanI nILlu

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: