[racchabanda] ప్రాసయతితో చంపకమాల #prAsayatitO chaMpakamAla#

 

ప్రాసయతితో చంపకమాల - 

అనఘుని గొల్వఁగా - మనములో ముదమే - కనుదోయి కింపులే 
వనజము కన్ను లా - వనజ మాననమే - కన నీలి కెంపులే 
వినఁగను గీత మా - స్వనములోఁ బిలుపే - నును లేఁత రాగమే 
ప్రణయపు డెందమం - దనిశ మా తలఁపే - దినమెల్ల భోగమే

మధుర విభావరిన్ - మధుర గీతముతో - మది యాడు నాట్యమే 
మధురము భావనల్ - మధురమౌ కవితల్ - మదినిండ రాగమే 
ముదమునఁ దేలఁగాఁ - నదముపైఁ బయనం - బిది చాలు ప్రేమలో 
వదలను నిన్ను నా - నిదురలో మతిలో - వ్యధలోన హాయిలో 

ఉసిరిది యొక్కటే - యొసఁగనా చెలియా - మిసలేని రాత్రిలో 
ముసురున జీఁకటుల్ - దెసలలో మెఱపుల్ - రసహీన ధాత్రిలో 
నిసి యొక శాపమే - విసములో మధువై - రసగంగ పారునా 
బుసబుస నాగ మ-క్కసముతోఁ గదలెన్ - మసలంగ సాధ్యమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
prAsayatitO chaMpakamAla - 

anaghuni golva@MgA - manamulO mudamE - kanudOyi kiMpulE 
vanajamu kannu lA - vanaja mAnanamE - kana nIli keMpulE 
vina@Mganu gIta mA - svanamulO@M bilupE - nunu lE@Mta rAgamE 
praNayapu DeMdamaM - daniSa mA tala@MpE - dinamella bhOgamE

madhura vibhAvarin - madhura gItamutO - madi yADu nATyamE 
madhuramu bhAvanal - madhuramau kavital - madiniMDa rAgamE 
mudamuna@M dEla@MgA@M - nadamupai@M bayanaM - bidi chAlu prEmalO 
vadalanu ninnu nA - niduralO matilO - vyadhalOna hAyilO 

usiridi yokkaTE - yosa@MganA cheliyA - misalEni rAtrilO 
musuruna jI@MkaTul - desalalO me~rapul - rasahIna dhAtrilO 
nisi yoka SApamE - visamulO madhuvai - rasagaMga pArunA 
busabusa nAga ma-kkasamutO@M gadalen - masalaMga sAdhyamA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: