[racchabanda] సాంగత్యము #sAMgatyamu#

 

సాంగత్యము - 

సాంగత్యము ఒక అర్ధసమగీతి. బేసి పాదములలో నాలుగు ఇంద్ర గణములు, సరి పాదములలో రెండు ఇంద్ర గణములు, ఒక సూర్యగణము. బేసి పాదములలో మూడవ గణముతో యతి. ప్రాస నియతము. సీస పాదములో చివరి సూర్య గణమును తొలగిస్తే మనకు సాంగత్యము లభిస్తుంది. ఈ ఛందస్సులో కన్నడములో కావ్యములే వ్రాయబడినవి. మచ్చునకు ఒక ఉదాహరణము కనకదాసులు వ్రాసిన మోహనతరంగిణి కావ్యములోని మొదటి పద్యము - 

శ్రీగిరిజేశ్వర నాత్మాభిరామ స-
ద్వాగీశ పిత పరంధామ 
కాగినెలెయ రంగ సురసార్వభౌమ సు-
త్యాగి పాలిసు పూర్ణకామ
(కన్నడములో యతి లేదు) 

పార్వతీపతి ప్రతిరూపమైన, బ్రహ్మ తండ్రియైన పరంధాముడు, సురసార్వభౌముడు, కల్పవృక్షసమానుడైన కాగినెలె రంగనాయకుడు కాపాడుగాక! 

క్రింద నా ఉదాహరణములు - 

సారసాక్షా నీదు - సాంగత్యమే కదా 
కోరిక యయె నందగోప 
చేరుట నిన్నెప్డు - శృంగార దీప్తిలో 
శ్రీరంగనాయకా చెప్పు 

ఈ వసంతపు రాత్రి - యీ వెన్నెలల వెల్గు 
జీవితమ్మును మాయ సేసె 
ప్రోవులై నిశిగంధ - పుష్పసంపద తావి 
త్రావమనె నమృత ధార 

అమ్మ యోభారతీ - యానందగీతమ్ము 
నెమ్మదిగను నాకు నేర్పు 
కమ్మగాఁ బాడఁగాఁ - గవితాస్వరూపమ్ము 
నిమ్ము రంజిల నెల్ల రిపుడు 

మాధవా చూడరా - మధుమాస మరుదెంచె 
మోద మివ్వఁగఁ బూచెఁ బూలు 
నాద బిందువులెల్ల - నర్తనమ్ముల నాడె 
పాదపమ్ములఁ బల్కెఁ బక్కి 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
sAMgatyamu - 

sAMgatyamu oka ardhasamagIti. bEsi pAdamulalO nAlugu iMdra gaNamulu, sari pAdamulalO reMDu iMdra gaNamulu, oka sUryagaNamu. bEsi pAdamulalO mUDava gan'amutO yati. prAsa niyatamu. sIsa pAdamulO chivari sUrya gaNamunu tolagistE manaku saaMgatyamu labhistuMdi. ee Chamdassuloe kannaDamulO kAvyamulE vrAyabaDinavi. machchunaku oka udAharan'amu kanakadAsulu vrAsina mOhanataraMgiNi kAvyamulOni modaTi padyamu - 

SrIgirijESvara nAtmAbhirAma sa-
dvAgISa pita paraMdhAma 
kAgineleya raMga surasArvabhauma su-
tyAgi pAlisu pUrNakAma
(kannaDamulO yati lEdu) 

pArvatIpati pratiruupamaina, brahma taMDriyaina paraMdhAmuDu, surasArvabhaumuDu, kalpavRxasamAnuDaina kAginele raMganAyakuDu kApADugAka! 

kriMda nA udAharan'amulu - 

sArasAxA nIdu - sAMgatyamE kadA 
kOrika yaye naMdagOpa 
chEruTa ninnepDu - SRMgAra dIptilO 
SrIraMganAyakA cheppu 

ee vasaMtapu rAtri - yI vennelala velgu 
jIvitammunu mAya sEse 
prOvulai niSigaMdha - pushpasaMpada tAvi 
trAvamane namRta dhAra 

amma yObhAratI - yAnaMdagItammu 
nemmadiganu nAku nErpu 
kammagA@M bADa@MgA@M - gavitAsvarUpammu 
nimmu raMjila nella ripuDu 

mAdhavA chUDarA - madhumAsa marudeMche 
moeda mivva@Mga@M bUche@M bUlu 
nAda biMduvulella - nartanammula nADe 
pAdapammula@M balke@M bakki 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: