[racchabanda] సార్థకనామ గణాక్షర వృత్తము - రజతగిరి #sArthakanAma gaNAxara vRttamu - rajatagiri#

 

రజతగిరి -

ఆధారము - కల్పితము 
సార్థకనామ గణాక్షర వృత్తము - [ర/జ/త/(గ3)/(ర)3]

రజతగిరి - ర/జ/త/మ/ర/ర/ర UI UI UI UUI UUU - UIU UIU UIU
21 ప్రకృతి 598315 

రమ్ము నన్ను జూడ వేవేగ మోదేవీ - రాగముల్ నింప డెందమ్ములో 
నిమ్ము ప్రీతితోడ మాధుర్య పీయూషం - బింపుగా నీనిశీథమ్ములో 
సొమ్ము నీమనోజ్ఞమౌ నాద గీతమ్ముల్ - సోలెదన్ హాయిగా సొంపులో 
నిమ్మనోజ్ఞ వేళలో నాకు నానంద - మ్మెల్ల లేకుండె లోకమ్ములో 

వెండికొండపైన నీకెప్పు డోదేవా - ప్రేమతో నాడు నృత్యమ్ములా 
కొండనుండి నీవు రావేల నన్ గానన్ - గూర్మి గంధమ్ము నిత్యమ్ములా 
నిండనిమ్ము నీదు స్నేహమ్ము ప్రీతిన్ నా - నేత్రముల్ వెల్గు దీపమ్ములే 
గుండె నీకు మందిరమ్మయ్యెఁ బూజించన్ - గోరితిన్ నీదు పాదమ్ములే 

మూలనున్న వీణ నీరోజు మీటంగాఁ - మోద మాపూవులై రాలునా 
లాలిపాట నీవు మెల్లంగఁ బాడంగా - రాగదీపమ్ములే వెల్గునా 
కేల నన్ను నీవు దాఁకంగ మేనెల్లన్ - గెంపులే స్రోతమై పారునా 
పాలపొంగు నాదు ప్రాయమ్ము నీకీయన్ - భావసంతృప్తి యింపొందునా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
rajatagiri -

aadhAramu - kalpitamu 
sArthakanAma gaNAxara vRttamu - [ra/ja/ta/(ga3)/(ra)3]

rajatagiri - ra/ja/ta/ma/ra/ra/ra #UI UI UI UUI UUU - UIU UIU UIU#
21 prakRti 598315 

rammu nannu jUDa vEvEga mOdEvI - rAgamul niMpa DeMdammulO 
nimmu prItitODa mAdhurya pIyUshaM - biMpugA nIniSIthammulO 
sommu nImanOj~namau nAda gItammul - sOledan hAyigA soMpulO 
nimmanOj~na vELalO nAku nAnaMda - mmella lEkuMDe lOkammulO 

veMDikoMDapaina nIkeppu DOdEvA - prEmatO nADu nRtyammulA 
koMDanuMDi nIvu rAvEla nan gAnan - gUrmi gaMdhammu nityammulA 
niMDanimmu nIdu snaehammu prItin nA - nEtramul velgu dIpammulE 
guMDe nIku maMdirammayye@M bUjiMchan - gOritin nIdu pAdammulE 

mUlanunna vINa nIrOju mITaMgA@M - mOda mApUvulai rAlunA 
lAlipATa nIvu mellaMga@M bADaMgA - rAgadIpammulE velgunA 
kEla nannu nIvu dA@MkaMga mEnellan - geMpulE srOtamai pArunA 
pAlapoMgu nAdu prAyammu nIkIyan - bhAvasaMtRpti yiMpoMdunA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: