[racchabanda] స్కంధక షట్పది #skaMdhaka ShaTpadi#

 

స్కంధక షట్పది - 

ఆధారము - కల్పితము
1,2,4,5 పాదములు - కందపు కుఱుచ పాదములు (12 మాత్రలు)
3,6 పాదములు - కందపు నిడుద పాదములు (12 - 6 + 2 మాత్రలు) 

స్కంధక షట్పది - 

గానమ్మును నే వింటిని 
యానందముతో నుంటిని 
రా నను జూడంగ నిపుడు - రజనిని సొబగై 
నీనగవులు సిరి యంటిని 
నీనామము శరణంటిని 
రా నాకమ్మును జూపు నాకు - రసముల కిరవై 

సందెల వెలుఁగుల నీవే 
సుందర నిశిలో నీవే 
మందాకిని తీరమందు - మాధురి నీవే 
విందగు వేకువ నీవే 
నందన కుసుమము నీవే 
హిందోళపు రాగమందు - నింపులు నీవే 

ప్రేమానందాభరణా 
భూమిజ మానసహరణా 
నా మనమున నుండు మెపుడు - నవ్వుచు రామా 
శ్యామల సుందర వదనా 
సామజవరమృదుగమనా 
స్వామీ కావు మినవంశ - జలనిధిసోమా 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
skaMdhaka ShaTpadi - 

aadhAramu - kalpitamu
1,2,4,5 pAdamulu - kaMdapu ku~rucha pAdamulu (12 mAtralu)
3,6 pAdamulu - kaMdapu niDuda pAdamulu (12 - 6 + 2 mAtralu) 

skaMdhaka shaTpadi - 

gAnammunu nE viMTini 
yAnaMdamutO nuMTini 
rA nanu jUDaMga nipuDu - rajanini sobagai 
nInagavulu siri yaMTini 
nInAmamu SaraNaMTini 
rA nAkammunu jUpu nAku - rasamula kiravai 

saMdela velu@Mgula nIvE 
suMdara niSilO nIvE 
maMdAkini tIramaMdu - mAdhuri nIvE 
viMdagu vEkuva nIvE 
naMdana kusumamu nIvE 
hiMdOLapu rAgamaMdu - niMpulu nIvE 

prEmAnaMdAbharaNA 
bhUmija mAnasaharaNA 
nA manamuna nuMDu mepuDu - navvuchu rAmA 
SyAmala suMdara vadanA 
sAmajavaramRdugamanA 
svAmI kAvu minavaMSa - jalanidhisOmA 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: