[racchabanda] వసుషట్పదిలో ప్రేమ షట్పదీవసువు #vasushaTpadilO prEma shaTpadIvasuvu#

 

వసుషట్పదిలో ప్రేమ షట్పదీవసువు - 

Happy Valentine's Day!

కనులందు నీవె 
తనువందు నీవె 
మనమందు నీవె - మధురమ్మై 
కనవేల నీవు 
వినఁగాను రావు 
మనమిందు నీదు - మననమ్మే 

సురతరువునందు
విరిమాల చిందు 
హరుసంపు క్రొత్త - హరివిల్లై 
స్వరరాగ గీతి 
సరి క్రొత్త రీతి 
మురిపించ నిమ్ము - ఫుల్లమ్మై 

ఇది వేఱు సీమ  
మదిలోని ప్రేమ 
ముదమిచ్చుఁ గామ - పుష్పమ్మై 
హృదయమ్ము దాఁకు 
వదనమ్ము పూయు 
సదనమ్ము మాఱు - స్వర్గమ్మై 

కవనమ్ములందు 
నవమైన విందు 
భువనమ్మునందు - మోదమ్మే 
నవరాగవీణ 
కవితలకు వాన 
జవమిచ్చు పుణ్య - జాహ్నవియే 

రసము లొలికించు 
దెసల వెలిఁగించు 
మసృణమగు నీదు - మమతలతో 
హసన మది చాలు 
నిసిని మురిపించు 
వసము నేనౌదు - వలపులలో 

లలిత రాగములఁ  
బలు పరాగముల 
నెల ప్రకాశముల - నిశి వెలిఁగె 
గలలఁ గరగితిని 
దలుపు తెఱచితిని 
బిలుపు లొసఁగితిని - బ్రియ యంచు 

నింగి యొక మాయ
రంగు లిడె ఛాయ 
శృంగముల మంచు - చిత్రమ్మే 
సంగమపు వేళ 
గంగవలె రమ్ము 
పొంగ హృదయమ్ము - పూర్ణశశీ 

నీ రూపు ప్రీతి 
నీ రవము గీతి 
నీరవపు రాత్రి - నిర్మలమే 
కోరితిని నిన్ను 
జేరుటయె చెన్ను 
హారమును వేతు - హరుసముతో 

విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
#
vasushaTpadilO prEma shaTpadIvasuvu - 

#Happy Valentine's Day!#

kanulaMdu nIve 
tanuvaMdu nIve 
manamaMdu nIve - madhurammai 
kanavEla nIvu 
vina@MgAnu rAvu 
manamiMdu nIdu - mananammE 

surataruvunaMdu
virimAla chiMdu 
harusaMpu krotta - harivillai 
svararAga gIti 
sari krotta rIti 
muripiMcha nimmu - phullammai 

idi vE~ru sIma  
madilOni prEma 
mudamichchu@M gAma - pushpammai 
hRdayammu dA@Mku 
vadanammu pUyu 
sadanammu mA~ru - svargammai 

kavanammulaMdu 
navamaina viMdu 
bhuvanammunaMdu - mOdammE 
navarAgavINa 
kavitalaku vAna 
javamichchu puNya - jAhnaviyE 

rasamu lolikiMchu 
desala veli@MgiMchu 
masRNamagu nIdu - mamatalatO 
hasana madi chAlu 
nisini muripiMchu 
vasamu nEnaudu - valapulalO 

lalita rAgamula@M  
balu parAgamula 
nela prakASamula - niSi veli@Mge 
galala@M garagitini 
dalupu te~rachitini 
bilupu losa@mgitini - briya yaMchu 

niMgi yoka mAya
raMgu liDe ChAya 
SRMgamula maMchu - chitrammE 
saMgamapu vELa 
gaMgavale rammu 
poMga hRdayammu - pUrNaSaSI 

nI rUpu prIti 
nI ravamu gIti 
nIravapu rAtri - nirmalamE 
kOritini ninnu 
jEruTaye chennu 
hAramunu vEtu - harusamutO 

vidhEyuDu - jejjAla kRshNa mOhana rAvu
#

__._,_.___

Posted by: "J. K. Mohana Rao" <jkmrao@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

To Post a message, send it to:   racchabanda@yahoogroups.com

To Unsubscribe, send a blank message to: racchabanda-unsubscribe@yahoogroups.com

SPONSORED LINKS
.

__,_._,___

No comments: