www.telugubhakti.com Digest Number 4886

2 Messages

Digest #4886
1.1
Satsangam by p_gopi_krishna
1.2
Satsangam by p_gopi_krishna

Messages

Sun Feb 24, 2019 9:52 pm (PST) . Posted by:

p_gopi_krishna

తవం మాతా త్వం శరణ్యం దాతాత్వం ధనఃత్వం ఆచార్యః |

త్వం త్రాతత్వంహర్తా విపదాం, అర్క! ప్రసీదమమ ||




"సూర్యదేవా! నీవే తల్లివి, నీవే రక్షకుడవు, నీవే దాతవు, నీవే సంపదవు, నీవే గురువవు, ఆపదల నుండి కాచే దైవానివి నీవే! నన్ను అనుగ్రహించు స్వామి" అని ప్రార్థన.




మహాపాపహరుడు, జీవన విజ్ఞాన మోక్షప్రదుడు, గ్రహపీడా నాశకుడు, సర్వ వ్యాధి నివారకుడు, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు.




కాలాన్ని తెచ్చేవాడు, క్రమం తప్పకుండా కాలాన్ని నడిపించేవాడు, జీవులను, కర్మ విధానాలను ప్రత్యక్షంగా చూస్తూ, "నేనున్నాను అన్నీ చూస్తున్నాను" అనే సత్య సంకేతాన్ని ఇస్తూ నిరంతరం లోక ప్రయాణం సాగించే స్వామి సూర్యుడు.




ఏడుగుర్రాల ఏలికగా ప్రసిద్ధుడైన సూర్య భగవానుడు ప్రతి రోజు, ప్రతి క్షణం మనకు కనిపించే దైవం.





శ్రీమతి కొల్లి విజయలక్ష్మి, శ్రీ కనకదుర్గప్రభ, ఫివ్రవరి, 2019

Sun Feb 24, 2019 10:38 pm (PST) . Posted by:

p_gopi_krishna

తవం మాతా త్వం శరణ్యం దాతాత్వం ధనఃత్వం ఆచార్యః |

త్వం త్రాతత్వంహర్తా విపదాం, అర్క! ప్రసీదమమ ||




"సూర్యదేవా! నీవే తల్లివి, నీవే రక్షకుడవు, నీవే దాతవు, నీవే సంపదవు, నీవే గురువవు, ఆపదల నుండి కాచే దైవానివి నీవే! నన్ను అనుగ్రహించు స్వామి" అని ప్రార్థన.




మహాపాపహరుడు, జీవన విజ్ఞాన మోక్షప్రదుడు, గ్రహపీడా నాశకుడు, సర్వ వ్యాధి నివారకుడు, ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు.




కాలాన్ని తెచ్చేవాడు, క్రమం తప్పకుండా కాలాన్ని నడిపించేవాడు, జీవులను, కర్మ విధానాలను ప్రత్యక్షంగా చూస్తూ, "నేనున్నాను అన్నీ చూస్తున్నాను" అనే సత్య సంకేతాన్ని ఇస్తూ నిరంతరం లోక ప్రయాణం సాగించే స్వామి సూర్యుడు.




బ్రహ్మ స్వరూపం ఉదయే, మధ్యాహ్నేతు మహేశ్వరః |

సాయంకాలే సదా విష్ణుః, త్రిమూర్తి తు దివాకరః ||




ప్రాతః కాలమున బ్రహ్మవలె జీవచైతన్యం చేస్తున్నాడు. మధ్యాహ్నపువేళ మహేశ్వరుడిగా జగత్తుకు పుష్టిని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు, సాయంత్రము తన దివ్య కిరణములచే అందరికీ మనోరంజక ఆనందమును విష్ణువై అందిస్తున్నాడు. ఈ విధంగా త్రిమూర్తి స్వరూపుడై సంధ్యా వందనాది విధులందు అర్ఘ్యమునందుకొనే ప్రత్యక్ష దైవం సూర్యుడే. అందుకే ఆయన జగత్పతి, జగత్పిత, మరియు పరబ్రహ్మ.




ఇంద్ర, మిత్రం, వరుణం, అగ్నిం, ఆహుః, అధో, దివ్యో సః సువర్ణో గరుత్మాన్ |

ఏకం సత్విప్రాః బహుదావదంతి, అగ్నిం, యమః, మాతరిశ్వానం ఆహుః ||

(ఋగ్వేదం)




దేవతా తత్వవేత్తలయిన మేధావులు ఆదిత్యున్నే ఇంద్రునిగాను, మిత్రునిగాను, వరుణునిగాను, అగ్నిగాను, గరుత్మంతునిగాను, మాతరిశ్వుని (వాయువు) గాను చెప్పివున్నారు. కనుక సూర్యుడు సకల దేవతా స్వరూపుడనవచ్చు.




భూమిపైన గల సర్వ ప్రకృతికి, జగత్తునకు మూలపురుషుడు, భూత వర్తమాన భవిష్యత్ సృష్టిమయుడు.




"సృష్థు ఈ రణం ప్రేరణయే నాసౌ సూర్యః" - సకల జగత్తును ప్రేరేపించువాడు గనుక సూర్యుడయ్యాడు..




ఏడుగుర్రాల ఏలికగా ప్రసిద్ధుడైన సూర్య భగవానుడు ప్రతి రోజు, ప్రతి క్షణం మనకు కనిపించే దైవం.





శ్రీమతి కొల్లి విజయలక్ష్మి మరియు దావులూరు రామకృష్ణ, శ్రీ కనకదుర్గప్రభ, ఫివ్రవరి, 2019

www.telugubhakti.com  - A one stop Bhakti and Cultural portal.

No comments: